అన్వేషించండి

Allu Sirish: మా నాన్న నన్ను నమ్మి ఎప్పుడూ ఖర్చుపెట్టలేదు, ‘పుష్ప’పై ఉన్న హైప్ చాలు - అల్లు శిరీష్

Allu Sirish: రెండేళ్ల తర్వాత అల్లు శిరీష్ నటిస్తున్న చిత్రమే ‘బడ్డీ’. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగగా.. ఇందులో సినిమా గురించి, అల్లు ఫ్యామిలీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు శిరీష్.

Allu Sirish: మామూలుగా యంగ్ హీరోలు.. ఏడాదికి రెండు సినిమాలు లేదా ఒక సినిమా అని దూసుకుపోతుంటే.. అల్లు శిరీష్ మాత్రం తెరపై కనిపించి రెండేళ్లు అయిపోయింది. త్వరలోనే ‘బడ్డీ’ అనే డిఫరెంట్ క్రైమ్ యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది. దాదాపు ఏడాదిన్నర నుండి ఈ మూవీతోనే శిరీష్ బిజీగా ఉన్నాడు. ఫైనల్‌గా ఈ మూవీ థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. అందుకే ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు మేకర్స్. తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. అందులో తన సినిమా గురించి, నిర్మాత, దర్శకుడి గురించి మాట్లాడుతూ.. ‘బడ్డీ’ ఎక్స్‌పీరియన్స్‌ను పంచుకున్నాడు అల్లు శిరీష్.

టెన్షన్‌గా ఉంది..

‘‘గతేడాది మూవీ పోస్టర్ రిలీజ్ చేయగానే ఎందుకు మళ్లీ రీమేక్ చేస్తున్నారు, ఈ సినిమా మేము ఆల్రెడీ చూశామని అందరూ అడుగుతూ ఉన్నారు. నేను ఎంత చెప్పినా వాళ్లు నమ్మరు. అందుకే ట్రైలర్ వచ్చాక అందరికీ అర్థమవుతుందని సైలెంట్‌గా ఉండిపోయాను. ఇది రెగ్యులర్ మూవీ కాదు.. కొంచెం కొత్త రకం సినిమా ఇది. ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారో లేదో అని టెన్షన్ ఉంది కానీ ట్రైలర్ చూసిన తర్వాత ఆడియన్స్ కనెక్ట్ అవుతారేమో అనిపించింది. ఎందుకంటే ఎవరైనా ఏదైనా కొత్తగా ట్రై చేసినప్పుడు సినిమాలో పెద్ద స్టార్ ఉన్నా లేకపోయినా తెలుగు ఆడియన్స్ వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు. అందుకే ఈ సినిమాను కూడా కచ్చితంగా చూస్తారని నమ్మకం కలిగింది’’ అంటూ ‘బడ్డీ’ గురించి చెప్పుకొచ్చాడు అల్లు శిరీష్.

ఫోన్ చేశాను..

‘బడ్డీ’ డైరెక్టర్ సామ్ ఆంటన్ గురించి కూడా శిరీష్ మాట్లాడాడు. ‘‘సామ్ ఆంటన్ డైరెక్ట్ చేసిన తమిళ సినిమాలు చూశాను. నాకు నచ్చి వెంటనే ఆయనకు ఫోన్ చేశాను. నీ దగ్గర కథ ఉంటే చెప్పు తెలుగులో చేద్దామన్నాను, తను కూడా సరే అన్నాడు. తనతో పనిచేస్తే బాగుంటుందనే ఆలోచనలోనే ఉన్నాను కానీ అవకాశం రాలేదు’’ అంటూ ఇప్పటికి వాళ్లిద్దరూ కలిసి వర్క్ చేసే అవకాశం వచ్చిందని శిరీష్ తెలిపాడు. ఇక నిర్మాత జ్ఞానవేల్ గురించి మాట్లాడుతూ.. ‘‘మా నాన్న కూడా నా మీద ఎప్పుడూ ఇంత ఖర్చుపెట్టి సినిమా తీయలేదు. నన్ను నమ్మి నాకు ఎవరూ యాక్షన్ సినిమా ఇవ్వలేదు. అందుకే జ్ఞానవేల్‌కు థ్యాంక్స్’’ అని నవ్వుతూ చెప్పాడు అల్లు శిరీష్.

అదే ఛాలెంజింగ్..

‘పుష్ప’ గురించి మాట్లాడమని అడగగా.. ‘‘ఉన్న హైప్ చాలు.. ఇప్పుడు నేనేమైనా అని, దానికి మీరు డబుల్ ఊహించుని.. ఇదంతా ఎందుకు? టీజర్, ట్రైలర్ వస్తాయి. అవి చూసి మీరే డిసైడ్ అవ్వండి’’ అని సింపుల్‌గా మాట దాటేశాడు అల్లు శిరీష్. ఇక హీరోయిన్స్‌తో నటించడం, టెడ్డీ బెర్‌తో నటించడం మధ్య తేడా చెప్తూ.. హీరోయిన్స్ రియాక్ట్ అవుతారు, టెడ్డీ బేర్ రియాక్ట్ అవ్వదు కాబట్టి అది రియాక్ట్ అవుతుందని ఊహించుకొని నటించడం ఛాలెంజింగ్ అని అన్నాడు. ‘బడ్డీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అయాన్‌ను తీసుకొస్తానని ఫ్యాన్స్‌కు మాటిచ్చేశాడు. అల్లు అర్జున్ కూడా ఈవెంట్‌కు వస్తాడా అని అడగగా.. దానికి క్లారిటీ ఇవ్వలేదు. సోషల్ మీడియాలో అయాన్ క్రేజ్ చూస్తుంటే తనకే అసూయగా ఉందన్నాడు అల్లు శిరీష్.

Also Read: ‘బడ్డీ’ ట్రైలర్ - తగ్గేదే లే అంటున్న టెడ్డీ బేర్, యాక్షన్‌తో కుమ్మేసిన అల్లు శిరీష్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
YS Jagan:  అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Kohli Completes 1000 Runs Vs KKR: కేకేఆర్ పై వెయ్యి ప‌రుగులు పూర్తి.. ఫిఫ్టీతో స‌త్తా చాటిన విరాట్, ఫ‌స్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ శుభారంభం
కేకేఆర్ పై కోహ్లీ వెయ్యి ప‌రుగులు పూర్తి.. ఫిఫ్టీతో స‌త్తా చాటిన విరాట్, ఫ‌స్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ శుభారంభం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KKR vs RCB IPL 2025 Match Highlights | కేకేఆర్ పై 7వికెట్ల తేడాతో ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ | ABP Desamడీలిమిటేషన్ పై దక్షిణాది యుద్ధంమేము రాజకీయంగా నష్టపోతాంIPL 2025 Captain's Meet | రేపటి నుంచే ఐపీఎల్ మహా సంగ్రామం ప్రారంభం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
YS Jagan:  అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Kohli Completes 1000 Runs Vs KKR: కేకేఆర్ పై వెయ్యి ప‌రుగులు పూర్తి.. ఫిఫ్టీతో స‌త్తా చాటిన విరాట్, ఫ‌స్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ శుభారంభం
కేకేఆర్ పై కోహ్లీ వెయ్యి ప‌రుగులు పూర్తి.. ఫిఫ్టీతో స‌త్తా చాటిన విరాట్, ఫ‌స్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ శుభారంభం
Sushant Singh Rajput Case: నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది ఆత్మహత్యే- తేల్చేసిన సీబీఐ
నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది ఆత్మహత్యే- తేల్చేసిన సీబీఐ
Pawan Kalyan Latest News: పవన్ పేరు చెబితే ర్యాగింగ్ చేశారు- నంద్యాల ఎంపీ శబరి ఆసక్తికర వ్యాఖ్యలు
పవన్ పేరు చెబితే ర్యాగింగ్ చేశారు- నంద్యాల ఎంపీ శబరి ఆసక్తికర వ్యాఖ్యలు
Vizag:  వైజాగ్ బీచ్‌కు మళ్లీ బ్లూఫ్లాగ్ గుర్తింపు - కలెక్టర్ కఠిన చర్యలతో మళ్లీ కళకళ
వైజాగ్ బీచ్‌కు మళ్లీ బ్లూఫ్లాగ్ గుర్తింపు - కలెక్టర్ కఠిన చర్యలతో మళ్లీ కళకళ
Actor Posani Latest News : గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
Embed widget