Suresh Babu on Allu Arjun: బన్నీని ఎందుకు టార్గెట్ చేస్తా... సోషల్ మీడియాలో రూమర్లపై అసహనం వ్యక్తం చేసిన నిర్మాత సురేష్ బాబు
Producer Suresh Babu: రీసెంట్ గా ముఖ్యమంత్రితో భేటీ అయ్యాక, ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ ను టార్గెట్ చేశారంటూ జరుగుతున్న ప్రచారంపై నిర్మాత సురేష్ బాబు స్పందించారు.
రీసెంట్ గా టాలీవుడ్ ను షేక్ చేసిన సంధ్య థియేటర్ వివాదం ముఖ్యమంత్రితో సినీ పెద్దల భేటీ తర్వాత సద్దుమణిగింది. కానీ ఆ భేటీ అనంతరం ప్రముఖ నిర్మాత సురేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ చేసిన కీలక వ్యాఖ్యలు కొత్త వివాదానికి దారి తీశాయి. ఆయన అల్లు అర్జున్ ని ఉద్దేశించే ఆ కామెంట్స్ చేశారని టాక్ నడిచింది. దీంతో తాజాగా ఇచ్చిన మరో ఇంటర్వ్యూలో సురేష్ బాబు తన కామెంట్స్ పై వివరణ ఇచ్చారు.
బన్నీ, రానా ఫ్రెండ్స్... నేనెందుకు అంటాను?
సురేష్ బాబు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ "నేను సోషల్ మీడియాను పెద్దగా ఫాలో అవ్వను. ఈ రోజు ఉదయమే నాకు ఎవరో దీని గురించి షేర్ చేశారు. అందులో నేను బన్నీని ఏదో అన్నట్టుగా రాశారు. నేను వాడిని ఏదో అనడం ఏంటి? చిన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు బన్నీ. నా కొడుక్కి మంచి ఫ్రెండ్ వాడు. వాడి గురించి నేను ఎందుకు ఇలా అంటాను? నేను ఏదో అన్నానని అంటున్నారు. ఎందుకలా రాయడం?" అంటూ సురేష్ బాబు అసహనాన్ని వ్యక్తం చేశారు. దీంతో ఇప్పటిదాకా సురేష్ బాబు అల్లు అర్జున్ ని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశారని, నెగెటివిటీని స్ప్రెడ్ చేసిన వాళ్లకి బన్నీ ఫాన్స్ ఈ వీడియోను పోస్ట్ చేస్తూ, కౌంటర్లు వేయడం మొదలుపెట్టారు. నిజానికి సురేష్ బాబు ఓ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జనం ఎక్కువగా వచ్చే ప్రదేశాలకి చిన్నపిల్లలతో వెళ్లలే పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అందులో భాగంగానే అభిమానులను, అలాగే ఈవెంట్ నిర్వాహకులను ఉద్దేశించి సురేష్ బాబు ఆ కామెంట్స్ చేశారు. కానీ సురేష్ బాబు కామెంట్స్ ని అపార్థం చేసుకున్న కొంతమంది అల్లు అర్జున్ ను ఉద్దేశించే ఆయన ఇలా అన్నారంటూ ప్రచారాన్ని మొదలుపెట్టారు.
Also Read: ట్రైలర్ రిలీజ్ చేయకుంటే ఆత్మహత్య... 'గేమ్ ఛేంజర్' టీంకు రామ్ చరణ్ అభిమాని సూసైడ్ లెటర్
సురేష్ బాబు ఏమన్నారంటే...
సీఎంతో భేటీ అనంతరం సురేష్ బాబు మాట్లాడుతూ "పబ్లిక్ ప్లేస్ లో ఉన్నప్పుడు ఎలా వ్యవహరించాలి? అనేది తెలుసుకుంటే ఇలాంటివి జరగవు. మనం తెలుసుకోవడంతో పాటు పిల్లలకు కూడా నేర్పించాలి. ఇలాంటి రద్దీ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి? ఎంత జాగ్రత్తగా ఉండాలి అన్నది ముందే, ఇంట్లోనే నేర్పించాలి. మన తీరు వల్లే ఇలా జరుగుతుంది తప్పా దీన్ని ప్రజలు సృష్టించలేదు. ఇంట్లో ఎగురు, డాన్స్ చెయ్... ఏం చేసినా సరే కానీ బయటకు వచ్చినప్పుడు కాస్త పద్ధతిగా ఉండాలి కదా? " అని అన్న వీడియో వైరల్ అయింది. ఈ వివాదమంతా 'పుష్ప 2' ప్రీమియర్ షో కోసం అల్లు అర్జున్ డిసెంబర్ 4న సంధ్య థియేటర్ కు వెళ్లడం, అక్కడ తొక్కిసలాటలో రేవతి అని మహిళ చనిపోవడం గురించి. దీనికి కారణం అల్లు అర్జున్ చేసిన రోడ్ షోనే అంటూ పోలీసులు తేల్చడంతో వివాదం ముదిరి, ప్రభుత్వం వర్సెస్ సినిమా ఇండస్ట్రీ అనేలా మారిపోయింది. దీంతో దిల్ రాజు నేతృత్వంలో సినీ పెద్దలంతా కలిసి ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి తో చర్చించారు.
Also Read: లైంగిక వేధింపులకు పాల్పడిన టీవీ నటుడు - అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసిన కేసులో అరెస్ట్