Naa Saami Ranga: ‘నా సామిరంగ’లో అల్లరి నరేశ్ పాత్ర అలాంటిదేనా? ఊహించని ట్విస్ట్ ఉండబోతుందా?
Allari Naresh: నాగార్జున హీరోగా నటించిన ‘నా సామిరంగ’లో అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ కూడా కీలక పాత్రలు చేశారు. అయితే ఈ మూవీలో అల్లరి నరేశ్ పాత్ర గురించి రకరకాల రూమర్స్ వైరల్ అవుతున్నాయి.
Allari Naresh in Naa Saami Ranga: సంక్రాంతి బరిలో దిగనున్న సీనియర్ హీరోల్లో నాగార్జున కూడా ఒకరు. జనవరి 14న నాగార్జున హీరోగా నటించిన ‘నా సామిరంగ’ మూవీ విడుదలకు సిద్దమవుతోంది. ముందుగా మహేశ్ బాబు ‘గుంటూరు కారం’, ఆ తర్వాత వెంకటేశ్ ‘సైంధవ్’ రిలీజ్ అయిన తర్వాత ‘నా సామిరంగ’తో బరిలోకి దిగనున్నారు నాగార్జున. ఈ మూవీలో నాగార్జునతో పాటు మరో ఇద్దరు యంగ్ హీరోలు కూడా నటించారు. వారే అల్లరి నరేశ్, రాజ్ తరుణ్. అయితే ఈ మూవీలో అల్లరి నరేశ్ పాత్ర గురించి పలు రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ఒక ట్విస్ట్ ఉండనుందని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.
అంజి పాత్రలో అల్లరి నరేశ్..
‘నా సామిరంగ’లో అల్లరి నరేశ్ పాత్ర పేరు అంజి అని మూవీ టీమ్ రివీల్ చేసింది. ఈ పాత్రను రివీల్ చేయడం కోసం ఒక ప్రత్యేకమైన గ్లింప్స్‌ను కూడా విడుదల చేసింది. అయితే ఇందులో రాజ్ తరుణ్ పాత్రకంటే అల్లరి నరేశ్ పాత్రకే కాస్త ఎక్కువ ప్రాధాన్యత ఉన్నట్టు అనిపిస్తుందని టీజర్, ట్రైలర్ చూసిన ప్రేక్షకులు అనుకుంటున్నారు. కానీ ‘నా సామిరంగ’లో అల్లరి నరేశ్ పాత్ర ఒక ఊహించని ట్విస్ట్‌తో వస్తుందని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇది నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర ఏమో అని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నెగిటివ్ షేడ్స్ ఉండడం మాత్రమే కాకుండా నాగార్జునను మోసం చేసే రోల్ అయ్యింటుందా అని మాట్లాడుకుంటున్నారు.
‘గమ్యం’ తరహాలో..
‘నా సామిరంగ’ దర్శకుడు విజయ్ బిన్నీ.. ఇప్పటికే అల్లరి నరేశ్ కెరీర్‌లో అంజి అనేది మరో గుర్తుండిపోయే పాత్ర అవుతుందని హామీ ఇచ్చాడు. అంతే కాకుండా ‘గమ్యం’ మూవీ వల్ల అల్లరి నరేశ్‌కు ఎంత పేరొచ్చిందో.. ‘నా సామిరంగ’ వల్ల కూడా అంతే పేరు వస్తుందని అన్నాడు. ఇక టీజర్‌లో కూడా అల్లరి నరేశ్ వాయిస్ ఓవర్‌తోనే నాగార్జునకు ఎలివేషన్స్ ఇచ్చారు. దీంతో కచ్చితంగా అల్లరి నరేశ్ పాత్ర చాలా ఆసక్తికరంగా ఉండబోతుందని ప్రేక్షకులు కూడా నమ్ముతున్నారు. ఇక ఈ మూవీలో నాగార్జునకు జోడీగా అషికా రంగనాథ్ నటిస్తుండగా.. సెకండ్ హీరోలుగా చేస్తున్న అల్లరి నరేశ్, రాజ్ తరుణ్‌లకు కూడా హీరోయిన్స్ ఉన్నారు. అల్లరి నరేశ్‌కు జోడీగా మిర్నా నటించగా.. రాజ్ తరుణ్‌కు జోడీగా రుక్సార్ కనిపించనుంది.
వింటేజ్ నాగార్జునను చూస్తారు..
ఎన్నో ఏళ్లుగా టాలీవుడ్‌లో యంగ్ కొరియోగ్రాఫర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ బిన్నీ. ఎంతోమంది యంగ్ హీరోలకు స్టైలిష్ స్టెప్పులను కంపోజ్ చేసిన విజయ్.. ఇప్పుడు సీనియర్ హీరో అయిన నాగార్జునతోనే యాక్షన్ చేయించాడు. ‘నా సామిరంగ’తో మొదటిసారి మైక్రోఫోన్ పట్టిన విజయ్.. తన సినిమాలో చాలా హై మూమెంట్స్ ఉంటాయని చెప్పుకొచ్చాడు. ఇందులో ప్రతీ ఒక్కరు వింటేజ్ నాగార్జునను చూస్తారని ఫ్యాన్స్‌కు హామీ ఇచ్చాడు. నాగార్జునను చాలా డిఫరెంట్‌గా ప్రజెంట్ చేయాలి అనుకున్న విషయంలో తాను సక్సెస్ అయినట్టుగా భావిస్తున్నానని విజయ్ బిన్నీ.. ‘నా సామిరంగ’ సక్సెస్‌పై ధీమా వ్యక్తం చేస్తున్నాడు.
Also Read: నన్ను బాడీ షేమింగ్ చేశారు, అదే నాకు ఎనర్జీ డ్రింక్ - విజయ్ సేతుపతి