అన్వేషించండి

Akshay Kumar: వెయ్యి కోట్ల కలెక్షన్స్ ఇవ్వాల్సిన కిలాడీ హీరో.. 1000 కోట్ల నష్టాలు మిగిల్చితే? అక్షయ్ కుమార్ ఫెయిల్యూర్‌కు కారణాలివేనా?

Akshay Kumar: ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సాధించిన అక్షయ్ కుమార్.. ఇప్పుడు వరుసగా 13వ ఫ్లాప్‌ను మూటగట్టుకున్నాడు. తన పరిస్థితి ఇలా అయిపోవడానికి కారణాలు ఏంటని ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు.

Akshay Kumar: ఇప్పుడు సీనియర్ హీరోలు, యంగ్ హీరోలు అని తేడా లేకుండా కంటెంట్ ఉన్న చిత్రాలకే ప్రేక్షకులు ఓటు వేస్తున్నారు. అలా ప్రేక్షకుల టేస్ట్ మారడంతో చాలామంది సీనియర్ హీరోలు రొటీన్ కమర్షియల్ చిత్రాలను నమ్ముకొని నష్టాలు చవిచూస్తున్నారు. దానికి పర్ఫెక్ట్ ఉదాహరణ బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్. ఒకప్పుడు అక్షయ్ కుమార్‌కు ‘బాలీవుడ్ ఖిలాడి’ అని పేరు ఉండేది. కొంతకాలం వరకు అక్షయ్ కుమార్‌కు ఉన్న హిట్స్ ఇతర హీరోలకు లేవు. అలాంటి హీరో ఇప్పుడు నష్టాల్లో ఉన్నాడు. అక్షయ్ కుమార్‌కు వచ్చిన నష్టం చూసి బాలీవుడ్ సైతం ఆశ్చర్యపోతోంది.

ఖాన్స్‌కు పోటీ..

ఒకప్పుడు అక్షయ్ కుమార్‌కు ఆఫ్ స్క్రీన్‌ పాపులారిటీ వేరే లెవెల్‌లో ఉండేది. కానీ గత కొంతకాలంగా ఈ హీరో సినిమాల గురించి ప్రేక్షకులు అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. తన రొటీన్ యాక్షన్ సినిమాలు చూడడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. తన మార్షల్ ఆర్ట్స్ స్కిల్స్ ఎవరినీ ఇంప్రెస్ చేయలేకపోతున్నాయి. ఒకప్పుడు ‘ఖిలాడి’ అనే టైటిల్‌తో అక్షయ్ కుమార్ నటించిన ప్రతీ సినిమా హిట్ అయ్యేది. ఆ తర్వాత వరుసగా బయోపిక్స్‌లో నటించి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు. బాలీవుడ్‌లో ఖాన్స్‌కు పోటీగా స్టార్‌డమ్ సంపాదించుకున్న హీరోగా నిలబడ్డాడు అక్షయ్ కుమార్. కానీ అంతా మెల్లగా మారిపోతూ వచ్చింది.

వరుసగా 13 ఫ్లాపులు..

కోవిడ్ తర్వాత అక్షయ్ కుమార్‌కు ఒక్క హిట్ కూడా లేదు. తాజాగా విడుదలయిన ‘సర్ఫిరా’తో వరుసగా 13వ ఫ్లాప్‌ను మూటగట్టుకున్నాడు ఈ హీరో. అంతకు ముందు తను నటించిన ‘బెల్ బాటమ్’, ‘లక్ష్మి’, ‘కట్‌పత్లి’, ‘అత్రంగి రే’, ‘బచ్చన్ పాండే’, ‘సామ్రాట్ పృథ్విరాజ్’, ‘రక్షా బంధన్’, ‘రామ్ సేతు’, ‘సెల్ఫీ’, ‘మిషన్ రాణిగంజ్’, ‘బడే మియా చోటే మియా’ చిత్రాలు కూడా ఫ్లాప్స్‌గా నిలిచాయి. ఇందులో కొన్ని చిత్రాలు అయితే భారీ బడ్జెట్‌తో తెరకెక్కి డిశాస్టర్లుగా నిలిచాయి. దీంతో మొత్తం కలిపి.. అక్షయ్ కుమార్‌ మూవీలకు రూ.1000 కోట్లు నష్టం వచ్చినట్టు సమాచారం. ‘బడే మియా చోటే మియా’ రూ.250 కోట్లు పోగొట్టుకోగా.. ‘సామ్రాట్ పృథ్విరాజ్’ రూ.150 కోట్ల నష్టాన్ని చవిచూసినట్టు తెలుస్తోంది.

అవే కారణాలు..

అసలు అక్షయ్ కుమార్ ఈ రేంజ్‌లో ఫెయిల్యూర్‌ను చూడడానికి పలు కారణాలు వినిపిస్తున్నాయి. అందులో ముఖ్యమైనది సినిమా క్వాలిటీతో సంబంధం లేకుండా ఏ చిత్రానికి అయినా మూడు నెలలు మాత్రమే సమయాన్ని కేటాయిస్తాడు అక్షయ్. దీని వల్ల ఇండస్ట్రీలో తనకు పలుమార్లు ట్రోల్స్ కూడా ఎదుర్కున్నాడు. రెమ్యునరేషన్ విషయంలో స్ట్రిక్ట్‌గా ఉండే అక్షయ్.. మూవీ ఔట్‌పుట్ ఎలా ఉన్నా పట్టించుకోడని కొందరు నిర్మాతలు ఓపెన్‌గా స్టేట్‌మెంట్ కూడా ఇచ్చారు. పైగా తన రాజకీయ అభిప్రాయాలను ఓపెన్‌గా బయటపెట్టడం వల్ల కూడా కొందరు ప్రేక్షకులు తన సినిమాలు చూడడం మానేశారని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ప్రస్తుతం అక్షయ్ కుమార్ అప్‌కమింగ్ మూవీ అయిన ‘ఖేల్ ఖేల్ మే’ ఆగస్ట్ 15న విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే తెలుగులో మొదటిసారి ‘కన్నప్ప’ మూవీలో నటిస్తున్నాడు. ఇందులో అక్షయ్ శివుడి పాత్రలో కనిపించనున్నాడు.

Also Read: ఎలాంటి వ్యాయామం లేకుండానే 21 రోజుల్లో బరువు తగ్గిన నటుడు మాధవన్ - ఇంతకీ ఆ వెయిట్‌లాస్ సీక్రెట్ ఏమిటో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Free Gas Scheme: మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ - ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక ప్రకటన
మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ - ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక ప్రకటన
Kumari Aunty: సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
CM Revanth Reddy: 'ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం' - ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల చేసిన సీఎం
'ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం' - ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల చేసిన సీఎం
Telangana High Court: 15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చేయండి- అధికారులకు హైకోర్టు ఆదేశం
15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చేయండి- అధికారులకు హైకోర్టు ఆదేశం
Embed widget