అన్వేషించండి

Aishwarya Lekshmi: మెగా మేనల్లుడితో 'హనుమాన్' నిర్మాతలు చేస్తున్న సినిమాలో ఐశ్వర్య

Sai Durga Tej New Movie: సాయి దుర్గా తేజ్, పాన్ ఇండియా హిట్ 'హనుమాన్' నిర్మాతలు కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి కలయికలో ఓ సినిమా రూపొందుతోంది. అందులో వసంతగా ఐశ్వర్య లక్ష్మీని ఎంపిక చేశారు.

SDT 18 Movie Cast: 'విరూపాక్ష', 'బ్రో' సినిమాలతో మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ రూటు మార్చారు. ఆ రెండు సినిమాలు చూస్తే... రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్స్ కాదు. ఇప్పుడు స్ట్రాంగ్ కంటెంట్ కథల వైపు చూస్తున్నారు సాయి తేజ్. 'హను మాన్'తో పాన్ ఇండియా హిట్ అందుకున్న ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ తమ ఖాతాలో వేసుకున్నారు నిర్మాతలు కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి. వీరి కలయికలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అందులో కథానాయికగా ఐశ్వర్యను ఎంపిక చేశారు. 

సాయి దుర్గా తేజ్ సరసన ఐశ్వర్య!
మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ కథానాయకుడిగా ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాతలైన నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి దంపతులు ప్రొడ్యూస్ చేస్తున్న సినిమాకు రోహిత్ కేపీ దర్శకుడు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రమిది. ఇందులో కథానాయిక పాత్రకు చాలా ప్రాముఖ్యం ఉంది. అందులో ఐశ్వర్య లక్ష్మి నటించనున్నారు.

Also Read: తమ్ముడికి తారక్ (జూనియర్ ఎన్టీఆర్) వెల్కమ్... బాబాయ్ బాలకృష్ణతో గొడవాలంటూ వచ్చే పుకార్లకు చెక్!

Aishwarya Lekshmi Upcoming Movie: ఐశ్వర్య లక్ష్మి మలయాళీ అమ్మాయి. మలయాళంలో కథానాయికగా కెరీర్ స్టార్ట్ చేశారు. తర్వాత తమిళ సినిమాల్లోకి వచ్చారు. సత్యదేవ్ 'గాడ్ సే'తో తెలుగు చిత్రసీమకు పరిచయం అయ్యారు. మణిరత్నం 'పొన్నియన్ సెల్వన్'లో పాత్ర ఆమెకు ఎక్కువ గుర్తింపు తెచ్చింది. సాయి తేజ్ సినిమా తెలుగులో ఆమెను ఎక్కువ మందికి చేరువ చేస్తుందని చెప్పవచ్చు.

Aishwarya Lekshmi Role In SDT 18 Movie: సాయి తేజ్ సినిమాలో వసంత పాత్రలో ఐశ్వర్య నటించనున్నట్టు చెప్పారు. ఇవాళ ఆమె పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఆమె క్యారెక్టర్ లుక్ వైవిధ్యంగా ఉంది. ఎడారి తరహా ల్యాండ్‌ స్కేప్‌లోని పోస్టర్‌లో ఐశ్వర్య లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Also Read: హీరోయిన్లూ... బాధ్యత ఉండక్కర్లా? అనన్య నాగళ్ళ, స్రవంతిని చూసి సిగ్గు పడండి - కోట్లు కావాలి, ప్రజల కష్టాలు పట్టవా?


ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌ శివార్లలోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా వేసిన మ్యాసీవ్ సెట్‌లో చిత్రీకరణ జరుగుతోంది. హై ఆక్టేన్ పీరియడ్ యాక్షన్ డ్రామాలో సాయి దుర్గ తేజ్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం మెగా మేనల్లుడు సరికొత్తగా మేకోవర్‌ అయ్యారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

Also Read: విజయ్ 'ది గోట్'కి సీక్వెల్... పవన్ కల్యాణ్ టైటిల్ మీద కన్నేసిన దళపతి

టాప్ హెడ్ లైన్స్

Aadarsha Kutumbam Weekend Collections : ఆదర్శ కుటుంబం ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - 50 కోట్ల క్లబ్‌లో వెంకీ త్రివిక్రమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్!
ఆదర్శ కుటుంబం ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - 50 కోట్ల క్లబ్‌లో వెంకీ త్రివిక్రమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్!
Nayanthara Simbu: మాజీ ప్రేమికులు మళ్ళీ కలుస్తారా? శింబుతో నయనతార సినిమా చేస్తారా?
మాజీ ప్రేమికులు మళ్ళీ కలుస్తారా? శింబుతో నయనతార సినిమా చేస్తారా?
Thrigun Jangaa First Look: 'బిగ్ బాస్' త్రిగుణ్ హీరోగా 'జంగా'... హౌస్‌లో హీరో - కానీ ఫస్ట్ లుక్ వచ్చేసింది
'బిగ్ బాస్' త్రిగుణ్ హీరోగా 'జంగా'... హౌస్‌లో హీరో - కానీ ఫస్ట్ లుక్ వచ్చేసింది
RC17 Concept Poster : మెగా ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ - రామ్ చరణ్, సుకుమార్ RC17 కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్... స్టోరీ అదేనా?
మెగా ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ - రామ్ చరణ్, సుకుమార్ RC17 కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్... స్టోరీ అదేనా?

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Seifert, Phillips Carnage:  ప్ర‌త్య‌ర్థి బ్యాటర్ల ఊచకోతతో టీమిండియాకు మ‌రో ఓట‌మి.. ఐదో టీ20లో కివీస్ ఘ‌న విజ‌యం.. సత్తా చాటిన సీఫెర్ట్, ఫిలిఫ్స్, మిల్నే
ప్ర‌త్య‌ర్థి బ్యాటర్ల ఊచకోతతో టీమిండియాకు మ‌రో ఓట‌మి.. ఐదో టీ20లో కివీస్ ఘ‌న విజ‌యం.. సత్తా చాటిన సీఫెర్ట్, ఫిలిఫ్స్, మిల్నే
CM Revanth Reddy: రైళ్లు ఆపినా.. తెలంగాణ కాంగ్రెస్ సైన్యాన్ని ఆపలేకపోయారు: ఢిల్లీలో రేవంత్ రెడ్డి
రైళ్లు ఆపినా.. తెలంగాణ కాంగ్రెస్ సైన్యాన్ని ఆపలేకపోయారు: ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
Lokesh Visits Raptadu Victim: రాప్తాడు బాలికకు లోకేశ్ పరామర్శ - మా బిడ్డలా భావించండి.. డాక్టర్లకు విజ్ఞప్తి !
రాప్తాడు బాలికకు లోకేశ్ పరామర్శ - మా బిడ్డలా భావించండి.. డాక్టర్లకు విజ్ఞప్తి !
Murasu Cyclone: దూసుకొస్తున్న మురసు తుపాను.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు! 3న తీరం దాటే అవకాశం
దూసుకొస్తున్న మురసు తుపాను.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు! 3న తీరం దాటే అవకాశం
YS Jagan Protest: పులివెందుల ఆర్వో ఆఫీసుకు తాళం! వైసీపీ అభ్యర్థులతో జగన్ బైఠాయింపు
పులివెందుల ఆర్వో ఆఫీసుకు తాళం! వైసీపీ అభ్యర్థులతో జగన్ బైఠాయింపు
MG Motor Car Price Hike: ఈ 2 కార్ల ధరలు పెరిగాయి, కొనేముందు కొత్త ధరలు చెక్ చేసుకోండి
MG Motors 2 కార్ల ధరలు పెరిగాయి, కొనేముందు కొత్త ధరలు చెక్ చేసుకోండి
Anakapalli Movie OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'అనకాపల్లి' - విలేజ్ రొమాంటిక్ డ్రామా ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'అనకాపల్లి' - విలేజ్ రొమాంటిక్ డ్రామా ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Dastagiri Intercepts Jagan: వివేకాను చంపించింది మీరే.. పులివెందులలో జగన్ కాన్వాయ్‌ను అడ్డుకున్న దస్తగిరి !
వివేకాను చంపించింది మీరే.. పులివెందులలో జగన్ కాన్వాయ్‌ను అడ్డుకున్న దస్తగిరి !
Embed widget