Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్... పవన్ నుంచి ఎన్టీఆర్, అల్లు అర్జున్ వరకు... ఘటన పట్ల టాలీవుడ్ సెలబ్రిటీల దిగ్భ్రాంతి
Tollywood Celebs On Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ సిటీలో ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ అయిన ఘటన పట్ల టాలీవుడ్ ప్రముఖులు స్పందించారు. ఎవరు ఏమన్నారంటే?

Tollywood Celebrities Reacts to Air India Plane Crash: అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లో క్రాష్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన పట్ల ఏపీ ఉప ముఖ్యమంత్రి - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సహా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వంటి పలువురు తెలుగు సినిమా ప్రముఖులు స్పందించారు. ఘటన పట్ల ఎవరేమన్నారంటే?
''అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఘోర దుర్ఘటన. మాటలకు అందని విషాదం ఇది. మొత్తం జాతిని దిగ్భ్రాంతికి గురి చేసిన ఘటన ఇది. ఇందులో భారతీయులతో పాటు విదేశస్తులు మరణించడం బాధాకరం. ప్రయాణీకులతో పాటు సిబ్బంది, విమానం కూలిన చోట మరికొందరు ప్రాణాలు కోల్పోవడం నా మనసును ఎంతో కలచివేస్తోంది. ఈ సమయంలో మనమంతా కేంద్రానికి బాసటగా నిలుద్దాం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలుపుతున్నాను'' అని నందమూరి బాలకృష్ణ తెలిపారు.
''అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఫ్లైట్ క్రాష్ ఘటన నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ బాధను మాటల్లో వర్ణించలేం. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా'' అని చిరంజీవి తెలిపారు. అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ ఘటన నన్ను షాక్‌కి గురి చేసిందని నాగార్జున తెలిపారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. లండన్ నగరానికి 242 మంది ప్రయాణికులతో బయలుదేరిన విమానం టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికి కూలిపోవడం ఊహించలేకపోతున్నానని, అది కూడా వైద్య కళాశాల వసతి భవనం మీద కూలడం మహా విషాదంగా మిగిలిందని ఆయన తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో మృతలకు, వాళ్ల కుటుంబాలకు దేశం బాసటగా ఉండాల్సిన సమయమిది అని పవన్ పేర్కొన్నారు.
Also Read: అఖిల్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో అక్కినేని పెద్ద కోడలు శోభిత చేతిలోని బ్యాగ్ రేటు ఎంతో తెలుసా?
అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికరం
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) June 12, 2025
అహ్మదాబాద్ లో చోటు చేసుకున్న విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. 242 మందితో లండన్ బయలుదేరిన విమానం – టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోవడాన్ని ఊహించలేకున్నాము. వైద్య కళాశాల వసతి భవనాలపై కూలడంతో ఒక మహా విషాదంగా మిగిలింది. ఈ…
ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ ఘటన విషయం తెలిసి నా హృదయం ముక్కలు అయ్యిందని అల్లు అర్జున్ చెప్పారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Heartbroken by the tragic Ahmedabad Air India flight crash. My deepest condolences to the families of the victims. May their souls rest in peace. Truly heart-wrenching 💔
— Allu Arjun (@alluarjun) June 12, 2025
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ ఘటన పట్ల ఎన్టీఆర్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.
Deeply saddened by the Ahmedabad Air India flight crash. Prayers and strength to everyone affected. My thoughts are with the passengers, crew members, and their families.
— Jr NTR (@tarak9999) June 12, 2025
అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ ఘటన తర్వాత ఇండోర్ వేదికగా జరగాల్సిన 'కన్నప్ప' ప్రీ రిలీజ్ ఈవెంట్, ట్రైలర్ లాంచ్ వాయిదా వేస్తున్నట్లు విష్ణు మంచు ప్రకటించారు. ఘటన గురించి తెలిసిన తర్వాత తన హృదయం మొక్కలైందన్నారు. సల్మాన్ ఖాన్ సైతం ఒక ఈవెంట్ క్యాన్సిల్ చేశారు.
Also Read: అలప్పూజా జింఖానా రివ్యూ: సోనీ లివ్ ఓటీటీలో మలయాళ స్పోర్ట్స్ డ్రామా - తెలుగులోనూ స్ట్రీమింగ్
My heart breaks for the lives lost in today’s Ahmedabad Air India crash. In deep mourning, we’re deferring the #Kanappa trailer release by one day and canceling tomorrow’s Indore pre‑release event. My prayers are with the families during this unimaginably difficult time. 💔
— Vishnu Manchu (@iVishnuManchu) June 12, 2025
అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ ఘటన హృదయ విదారకరమని దిశా పటానీ పేర్కొన్నారు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన వారికి సకాలంలో సాయం ఉండాలని కోరుకుంటున్నట్లు ఆవిడ ట్వీట్ చేశారు. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు బాధను మాటల్లో వర్ణించలేమన్నారు జాన్వి కపూర్.
బాలీవుడ్ హీరోయిన్ అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్ తదితరులు ఈ ఘటన పట్ల విచారం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు.





















