అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Sandeep Reddy Vanga - Aamir Khan: సారీ చెప్పిన అమీర్ ఖాన్ - సందీప్ రెడ్డిని ట్రోల్ చేస్తున్న నెటిజన్స్

Sandeep Reddy Vanga - Aamir Khan: 'యానిమల్‌' సినిమాకి సంబంధించి డైరెక్టర్‌ సందీప్‌, అమీర్‌ఖాన్‌ మాజీ భార్య కిరణ్‌రావు మధ్య కాంట్రవర్సీ నడుస్తుండగా.. ఇప్పుడొక వీడియో వైరల్‌ అవుతోంది.

Sandeep Reddy Vanga - Aamir Khan’s apology: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్’ సినిమా సూపర్‌ హిట్‌ టాక్‌ అందుకుంది. ఇప్పుడిక ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో కూడా దుమ్మురేపుతోంది ఈసినిమా. అయితే, ఈ సినిమాకి ప్రశంసలు వచ్చాయి, విమర్శలు కూడా వచ్చాయి. దాంట్లో భాగంగానే డైరెక్టర్‌ సందీప్‌రెడ్డి వంగ, అమీర్‌ఖాన్‌ మాజీ భార్య కిరణ్‌రావు మధ్య మాటల యుద్ధం నడిచింది. 'యానమిల్‌' సినిమా ఆడవాళ్లను కించపరిచేలా ఉందని ఆమె అన్నారు. దీనికి కౌంటర్‌గా సందీప్‌రెడ్డి కొన్ని కామెంట్స్‌ చేశారు. "ముందు ఆ విషయం నీ మాజీ భర్త అమీర్‌ఖాన్‌ని అడగండి" అంటూ ఒక ఇంటర్వ్యూలో కామెంట్స్‌ చేశారు. ఈ నేపథ్యంలో అమీర్‌ఖాన్‌కి సంబంధించి వీడియో ఒకటి ఇప్పుడు బయటికి వచ్చింది. 

సారీ చెప్పిన అమీర్‌ఖాన్‌.. 

అమీర్‌ ఖాన్‌ నటించిన 'దిల్‌' సినిమా గురించి, 'ఖంబే జైసీ ఖాదీహై' అనే పాటకి సంబంధించి కూడా సందీప్‌ కామెంట్స్‌ చేశారు. దానికి సారీ చెప్పాలని అన్నారు. అయితే, ఇప్పుడు దానికి సంబంధించి అమీర్‌ఖాన్‌ సారీ చెప్పిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఒక జాతీయ మీడియాతో మాట్లాడిన అమీర్‌ఖాన్‌.. "చాలా పాటల్లో, సినిమాల్లో ఆడవాళ్లను తక్కువ చేసి చూపిస్తాం. 'తూ చీజ్‌ బడీహై మస్త్‌ మస్త్‌' లాంటి పాటల్లో ఆడవాళ్లను ఐటమ్స్‌తో పోలుస్తాం. నేను అలాంటి పాటలు చేశాను. మనం ఆడవాళ్లను కంబాతో పోలుస్తున్నాం. వాళ్లను మనుషుల్లా చూడటం లేదు. నాకు ఇలాంటివి చూసినప్పుడు సిగ్గు అనిపిస్తుంది" అని ఆ వీడియోలో ఆడవాళ్లపై జరుగుతున్న దారుణాల గురించి మాట్లాడారు అమీర్‌ఖాన్‌. దీంతో ఇప్పుడు ఆ వీడియోను అమీర్‌ ఫ్యాన్స్‌ తెగ వైరల్‌ చేస్తున్నారు. సందీప్‌ రెడ్డిని ట్యాగ్‌ చేస్తూ "చూడండి సార్‌ ఆయన అప్పుడే సారీ చెప్పారు" అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

అసలు ఏంటీ వివాదం? 

‘యానిమల్‌’ సినిమాపై బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు స్పందించారు. ఈ సినిమా స్త్రీ విద్వేషంతో నిండి ఉందని వెల్లడించింది. ‘బాహుబలి-2’, ‘కబీర్ సింగ్’ సినిమాలు సైతం స్త్రీల పట్ల ద్వేషం, వేధింపులను ప్రోత్సహించేలా ఉన్నాయని ఆరోపించారు. దానికి కౌంటర్‌గా "నా సినిమాల గురించి విమర్శించే ఆమెను ఓ విషయం చెప్పాలి అనుకుంటున్నాను. మీరు ముందుగా అమీర్ ఖాన్ నటించిన ‘దిల్’ సినిమా చూడండి. ఈ సినిమాలో ఆయన దాదాపు అమ్మాయిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నిస్తారు. ఆ అమ్మాయిదే తప్పు అనేలా చూపించే ప్రయత్నం చేస్తారు. కానీ, అదే అమ్మాయి చివరకు అతడితో ప్రేమలో పడుతుంది. ఈ సినిమాను ఎలా అర్థం చేసుకోవాలి? ముందు ఇలాంటి సినిమాల గురించి మాట్లాడిన తర్వాత మా సినిమాల గురించి మాట్లాడితే బాగుంటుంది. గతాన్ని మరిచి విమర్శలు చేయడం మంచిది కాదని గుర్తుంచుకుంటే బాగుంటుంది” అంటూ కౌంటర్‌ ఇచ్చారు సందీప్‌రెడ్డి. దీంతో ఇప్పుడు ఆయనకు కౌంటర్‌గా పాత వీడియోను వైరల్‌ చేస్తున్నారు అమీర్‌ఖాన్‌ ఫ్యాన్స్‌. 

'యానిమల్‌'పై ఎన్నో విమర్శలు

'యానిమల్‌' సినిమాపై కేవలం కిరణ్‌ రావు మాత్రమే కాదు.. ఎంతోమంది ఎన్నో విమర్శలు చేశారు. సినిమాలో కొన్ని సీన్లు దారుణంగా ఉన్నాయి అంటూ సినిమా ఫీల్డ్‌లోని కొంతమంది కామెంట్స్‌ చేశారు. అంతేకాకుండా దీనిపై పార్లమెంట్‌లో కూడా చర్చ జరిగింది. కొంతమంది మహిళా ఎంపీలు ఈ సినిమాపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. 'యానిమల్‌'కి సీక్వెల్‌ కూడా ఉంది. అది ఇంకా బోల్డ్‌గా, డార్క్‌గా ఉంటుందని హీరో రణ్‌బీర్‌ కపూర్‌ ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పారు. మరి అది రిలీజ్‌ అయ్యాక ఇంకెన్ని కాంట్రవర్సీలు అవుతాయో అంటున్నారు ఫిలిమ్‌ క్రిటిక్స్‌.

Also Read: హీరోల ఇమేజ్‌కు ఇంపార్టెన్స్ ఇస్తే అంతే - 'గుంటూరు కారం'పై ఎస్వీ కృష్ణారెడ్డి షాకింగ్ కామెంట్స్  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PM Modi Comments: రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
AUS vs IND: ఆస్ట్రేలియన్లూ ! మీరు మారరా ? బుమ్రా బౌలింగ్‌పై చెకింగ్ ఆరోపణలు- భగ్గుమంటున్న అభిమానులు
ఆస్ట్రేలియన్లూ ! మీరు మారరా ? బుమ్రా బౌలింగ్‌పై చెకింగ్ ఆరోపణలు- భగ్గుమంటున్న అభిమానులు
Telangana: పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Comments: రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
AUS vs IND: ఆస్ట్రేలియన్లూ ! మీరు మారరా ? బుమ్రా బౌలింగ్‌పై చెకింగ్ ఆరోపణలు- భగ్గుమంటున్న అభిమానులు
ఆస్ట్రేలియన్లూ ! మీరు మారరా ? బుమ్రా బౌలింగ్‌పై చెకింగ్ ఆరోపణలు- భగ్గుమంటున్న అభిమానులు
Telangana: పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
Sonia Akula Engagement: ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
AR Rahman Legal Notice: వారికి ఏఆర్ రెహమాన్ లీగల్ నోటీసులు, కంటెంట్ తొలగించాలని 24 గంటలు డెడ్‌లైన్
వారికి ఏఆర్ రెహమాన్ లీగల్ నోటీసులు, కంటెంట్ తొలగించాలని 24 గంటలు డెడ్‌లైన్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Embed widget