Nayantara Vs Liver Doc : అప్పుడు సమంత, ఇప్పుడు నయనతార - లివర్ డాక్టర్ దెబ్బకు ఆ పోస్ట్ డిలీట్ చేసిన లేడీ సూపర్ స్టార్
Nayantara: లివర్ డాక్ గుర్తున్నాడా? అదే సమంత పెట్టిన ఒక పోస్ట్ ని విమర్శిస్తూ కాంట్రవర్సీ క్రియేట్ చేసిన డాక్టర్. అదే డాక్టర్ ఇప్పుడు నయనతారపై విరుచుకుపడ్డాడు.
The Liver Doc Calls Out Nayantara Over Hibiscus Tea Post: లివర్ డాక్.. ఈ పేరు గుర్తిందిగా? అదే సమంత పెట్టిన హైడ్రోజన్ పెరాక్సైడ్ నెబలైజర్ పోస్ట్ పై తీవ్ర విమర్శలు చేసిన డాక్టర్. అప్పట్లో ఈ టాపిక్ సంచలనంగా మారిన విషయం తెలిసిందే. సమంతను హెల్త్ ఇలిటరేట్ అని, ఆమె ఫాలోయర్స్ ను తప్పుదోవ పట్టిస్తుంది అంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఇప్పుడిక ఈ లివర్ డాక్ మరోసారి వార్తల్లోకి వచ్చాడు. అయితే, ఇప్పుడు ఆయన టార్గెట్ చేసింది నయనతారని. మరి నయనతార పెట్టిన పోస్ట్ ఏంటి? లివర్ డాక్ ఏమన్నారు? ఒకసారి చూద్దాం.
పోస్ట్ ఏంటంటే?
సెలబ్రిటీలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తమకు సంబంధించిన చాలా విషయాలను అభిమానులతో పంచుకుంటారు. స్కిన్ రొటీన్, హెల్త్ రొటీన్ అన్ని షేర్ చేస్తుంటారు. అలా సోషల్ మీడియాలో ఎక్కవగా యాక్టివ్‌గా ఉండే నయనతార మందార పూలతో చేసుకునే హెర్బల్ టీని షేర్ చేసింది. అది ఆయుర్వేదం పరంగా చాలామంచిదని, షుగర్, బీపీ, కొలస్ట్రాలను తగ్గిస్తుంది అంటూ ఆ టీకి సంబంధించిన రెసిపీ పోస్ట్ చేసింది. దానిపైన లివర్ డాక్ స్పందించారు.
View this post on Instagram
8.7 మిలియన్ మందిని తప్పుదోవ పట్టిస్తుంది..
నయన తార పెట్టిన పోస్ట్‌కు లివర్ డాక్ ఎక్స్ ద్వారా కౌంటర్ ఇచ్చాడు. మందార పువ్వుకు సంబంధించి ఎలాంటి సైంటిఫిక్ రీసెర్చ్ జరగలేదని, అది హెల్త్‌కు మంచిదని ఎలాంటి డాక్యుమెంట్ ప్రూఫ్ లేదని అన్నారు. “ సమంత తన ఫాలోవర్స్ ని తప్పు దోవ పట్టించిన దానికంటే.. ఈ సినిమా యాక్టర్ నయనతార.. రెండు రెట్లు ఎక్కువగా తప్పుదోవ పట్టిస్తుంది. ఆమెని ఫాలో అయ్యే 8.7 మిలియన్స్ మందికి మందార పువ్వు టీ గురించి తప్పు ఇన్ఫర్మేషన్ ఇస్తోంది. ఆ టీ టేస్ట్ బాగుందని చెప్పి వదిలేసి ఉంటే బాగుండేది. కానీ, అలా కాకుండా ఆరోగ్యానికి సంబంధించి వాళ్ల మిడి మిడి జ్ఞానాన్ని జనాలకు కూడా పంచుతున్నారు. డయాబెటిస్, హై బీపీ, యాక్నే, యాంటీ బ్యాక్టీరియల్ అంటూ చెప్తున్నారు. ఆమె చెప్పినవాటికి ప్రూఫ్స్ ఇప్పటి వరకు లేవు” అని ట్వీట్ చేశాడు లివర్ డాక్. దీంతో నెటిజన్లు దీనిపై రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.
This is cinema actress Nayantara who has more than twice the following of the other actress Samantha miselading her 8.7 million followers on a supplement called hibiscus tea.
— TheLiverDoc (@theliverdr) July 29, 2024
If she had stopped at hibiscus tea is kind of tasty, that would have been ok. But no, they have to go… pic.twitter.com/d1fQCohsGU
సమంతపై కూడా..
లివర్ డాక్ సమంతపై గతంలో తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆమె హైడ్రోజన్ పెరాక్సైడ్ నెబలైజేషన్ పెట్టుకోవాలని చెప్తూ పెట్టిన పోస్ట్ పై ఆయన విరుచుకుపడ్డారు. ఆమె హెల్త్ ఇలిటరేట్ అంటూ కోపాడ్డాడు. ఆ తర్వాత సమంతకు సారీ చెప్పిన డాక్టర్. ఆమె వైద్యుడిపై తీవ్ర ఆరోపణలు చేశారు. సమంతకు ట్రీట్మెంట్ ఇచ్చి డాక్టర్ ఎంబీబీఎస్ కాదని, అతను ప్రకృతి వైద్యుడు అని ఆరోపించాడు. ఇప్పటికే ఆయనపై పలు కేసులు ఉన్నాయని, గతంలో ఆరోగ్యానికి హాని కలిగించే చాలా ఉత్పత్తులను ప్రొత్సహించినందుకు ఆయనపై ప్రభుత్వం చర్యలు కూడా తీసుకుందంటూ లివర్ డాక్ సంచలన కామెంట్స్ చేశారు. ఇక ఇప్పుడు నయనతారపై ఆయన విరుచుకుపడ్డారు. లివర్ డాక్ కావాలనే సెలబ్రిటీలను టార్గెట్ చేస్తున్నాడు అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: అప్పట్లో ఇలా ఉండేది కాదు, కేవలం దాని కోసమే గొడవలు జరిగేవి: రాజీవ్ కనకాల