Ram Charan Fans : మెగా ఫ్యాన్స్ భారీ ఏర్పాట్లు - రేపు రామ్ చరణ్ గ్రాండ్ వెల్కమ్‌కు అంతా రెడీ
Ram Charan returns to hyderabad : ఆస్కార్స్ కోసం అమెరికా వెళ్లిన రామ్ చరణ్, శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్నారు. ఆయనకు గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి ఫ్యాన్స్ భారీ ఏర్పాట్లు చేశారు.
ఆస్కార్ వేడుకకు అమెరికా వెళ్లిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన (Upasana) దంపతులు హైదరాబాద్ ఎప్పుడు వస్తారు? అంటే... రేపు సాయంత్రం! ఆస్కార్స్ నుంచి నేరుగా ఢిల్లీ వెళుతున్నారు రామ్ చరణ్. అక్కడ ఓ మీడియా సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు వేదికపై ఆయన కూడా ఉంటారు. సచిన్ టెండూల్కర్, అమిత్ షా వంటి ప్రముఖులతో రామ్ చరణ్ స్టేజి షేర్ చేసుకోనుండటం అభిమానులకు సంతోషంగా ఉంది. అదే సమయంలో హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ఆయనకు గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి రెడీ అయ్యారు.
భాగ్య నగరానికి రేపే రామ్ చరణ్...
ఢిల్లీ నుంచి రేపు (శుక్రవారం) సాయంత్రం హైదరాబాద్ రానున్నారు రామ్ చరణ్. రాత్రి ఎనిమిదిన్నరకు ఫ్లైట్ ల్యాండ్ అవుతుందని తెలిసింది. ఆయనకు గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి ఫ్యాన్స్ భారీ ఏర్పాట్లు చేశారు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ దగ్గర రామ్ చరణ్ ఫ్యాన్స్ రచ్చ మామూలుగా ఉండబోదని తెలిసింది.
Also Read : ఆనందంతో ఏడ్చిన కీరవాణి - ఆస్కార్‌ను మించిన గిఫ్ట్
View this post on Instagram
ఆస్కార్ వేడుకకు అమెరికా వెళ్లిన రామ్ చరణ్, ఉపాసన సినిమా గురించి మాత్రమే కాదు... సంస్కృతి సంప్రదాయాల గురించి సైతం మాట్లాడారు. తాము ఎక్కడికి వెళ్లాలన్నా తప్పకుండా ఓ పని చేస్తామని చెప్పారు రామ్ చరణ్. ఫారిన్ ట్రిప్పులకైనా, ముఖ్యమైన పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడైనా కచ్చితంగా దేవుడికి పూజలు చేస్తామని చెప్పారు. ఆ తర్వాతే బయటకు అడుగు పెడతామన్నారు. ఉపాసన ఎక్కడికి వెళ్లినా తనతో పాటు చిన్న సీతారాముల విగ్రహాలను తీసుకువెళ్తుందట.
ఆస్కార్ వేడుకలకు ముందు చెర్రీ దంపతుల పూజలు
తాజా ఆస్కార్ వేడుకలలో పాల్గొనేందుకు వెళ్లిన సమయంలోనూ ఉపాసన ఈ విగ్రహాలను తీసుకెళ్లారట. ఈ ఈవెంట్ లో పాల్గొనడానికి వెళ్లే ముందుకు తమ హోటల్ గదిలో సీతారాముల విగ్రహాలను ఉంచి పూజలు చేశారట. “ఎక్కడికి వెళ్లినా నా భార్య తప్పకుండా చిన్న ఆలయాన్ని ఏర్పాటు చేస్తుంది. అది మాకు చాలా కాలంగా అలవాటు అయ్యింది. ఈ ఆలయం మన ఆచారాలనే కాదు, భారతదేశానికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది” అని తాజాగా రామ్ చరణ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆస్కార్ కు ముందు రామ్ చరణ్, ఉపాసన పూజలు చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
ఆస్కార్ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా చెర్రీ దంపతులు
ఇక ఆస్కార్ వేడుకలో చెర్రీ దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇటలీకి చెందిన కస్టమ్ మేడ్ షూస్‌తో పాటు భారతీయ డిజైనర్లు శంతను, నిఖిల్ తన కోసం రూపొందించిన పూర్తిగా నలుపు రంగు భారతీయ దుస్తులను చెర్రీ ధరించాడు. "నేను ఈ దుస్తులను ధరిస్తే భారతదేశాన్ని ధరించినట్లు అనిపిస్తుంది” అని చెర్రీ ఈ సందర్భంగా కామెంట్ చేశారు. ఇక ఆరు నెలల గర్భవతి అయిన ఉపాసన, ఎర్రటి పువ్వుతో కూడిన నెక్లెస్ ను ధరించింది. క్రీమ్ చీరను కట్టుకుంది. ఆమె చీరను తెలంగాణ కళాకారులు పట్టు స్క్రాప్‌లతో తయారు చేశారు.
Also Read : విజయ్ 'లియో'లో లోకేష్ ఫస్ట్ ఛాయస్ త్రిష కదా? యంగ్ హీరోయిన్ 'నో' చెప్పడంతో ఛాన్స్ వచ్చిందా?