Keeravani Richard Carpenter : ఆనందంతో ఏడ్చిన కీరవాణి - ఆస్కార్‌ను మించిన గిఫ్ట్
'నాటు నాటు...' పాటకు ఆస్కార్ రావడంతో సంగీత దర్శకుడు కీరవాణి, 'ఆర్ఆర్ఆర్' చిత్ర బృందాన్ని చాలా మంది అభినందిస్తున్నారు. అయితే, ఒకరి ప్రశంస ఆయన కళ్ళవెంట ఆనంద భాష్పాలు వచ్చేలా చేసింది. ఆయన ఎవరో తెలుసా?
'నాటు నాటు...' (Naatu Naatu Song) పాటకు 'బెస్ట్ ఒరిజినల్ సాంగ్' విభాగంలో ఆస్కార్ అవార్డు (Oscars 2023 Winners) రావడంతో 'ఆర్ఆర్ఆర్' సినిమా (RRR Movie)కు పని చేసిన సభ్యులు మాత్రమే కాదు... యావత్ దేశం అంతా సంబరం చేసుకుంది. దేశానికి రాజమౌళి, కీరవాణి ఎనలేని కీర్తి తీసుకొచ్చారని దేశ ప్రధాని, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి చాలా మంది ప్రశంసించారు.
'ఆర్ఆర్ఆర్'కు ఆస్కార్ రావడంతో సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణికి వచ్చిన ప్రశంసలు, ప్రశంసించిన వారి జాబితా బోలెడు ఉంది. అయితే, ఒక్కరి ప్రశంస మాత్రం కీరవాణి కళ్ళ వెంట ఆనంద భాష్పాలు వచ్చేలా చేసింది. ఇంతకీ, ఆయన ఎవరో తెలుసా? ఆయన అభిమాన సంగీత దర్శకుడు.
ఆస్కార్ వేదికపై కీరవాణి స్పీచ్ గుర్తు ఉందా?
ఆస్కార్ వేదికపై అవార్డు అందుకున్న తర్వాత కీరవాణి మాట్లాడిన మాటలు గుర్తు ఉన్నాయా? తాను కార్పెంటర్స్ సంగీతం వింటూ పెరిగానని, ఈ రోజు ఆస్కార్స్ (Oscars Trophy)తో ఉన్నానని పెద్దన్న పేర్కొన్నారు. కార్పెంటర్ పాట పాడుతూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆ రిచర్డ్ కార్పెంటర్ నుంచి కీరవాణికి ప్రశంస వచ్చింది.
ఆస్కార్ అందుకున్న 'నాటు నాటు...' రచయిత చంద్రబోస్, కీరవాణికి రిచర్డ్ కార్పెంటర్, ఆయన పిల్లలు శుభాకంక్షాలు చెప్పారు. అదీ పాట రూపంలో! ''ఇది నేను అసలు ఊహించలేదు. ఆనంద భాష్పాలు వస్తున్నాయి. ఈ విశ్వంలోని అత్యంత అందమైన, అద్భుతమైన బహుమతి ఇది'' అని కీరవాణి ఇంస్టాగ్రామ్ స్టోరీలో పేర్కొన్నారు. అదీ సంగతి!
Also Read : శృతి హాసన్ మందు కొట్టి ఆరేళ్ళ - బీర్ కూడా నాన్ ఆల్కహాలిక్ అయితేనే
View this post on Instagram
'ఆస్కార్ వచ్చింది. సో, చెప్పండి! ఇంట్లో ఎగ్జైట్మెంట్ ఎలా ఉంది?' అని కీరవాణి సోదరుడిని ఓ కార్యక్రమంలో సుమ కనకాల అడగ్గా... ''మనం చేసిన సినిమా జనాలకు ఎక్కువ రీచ్ అవ్వాలనే తాపత్రయమే ఉంటుంది తప్ప... రాజమౌళి గానీ, ఇంట్లో మిగతా కుటుంబ సభ్యులు గానీ అవార్డుల పట్ల ఎప్పుడూ అంత దృష్టి పెట్టలేదు'' అని కళ్యాణీ మాలిక్ సమాధానం ఇచ్చారు.
ఆస్కార్ వేడుక పూర్తి కావడంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇండియా వచ్చేశారు. నిన్న (బుధవారం) ఉదయమే ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. అభిమానులు గ్రాండ్ వెల్కమ్ ఇవ్వడంతో పాటు రాజీవ్ గాంధీ ఇంటెర్నేషన్ ఎయిర్ పోర్ట్ అంతా 'జై ఎన్టీఆర్' నినాదాలతో హోరెత్తించారు. రేపు (శుక్రవారం) విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'దాస్ కా ధమ్కీ' సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.
ఆస్కార్ నుంచి రామ్ చరణ్ నేరుగా ఢిల్లీలో ల్యాండ్ కానున్నారు. జాతీయ మీడియా సంస్థ నిర్వహిస్తున్న ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అక్కడ నుంచి భాగ్య నగరానికి వస్తారు. ఆయనకు ఘన స్వాగతం పలకడానికి అభిమానులు భారీ ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది.
దర్శక ధీరుడు రాజమౌళి, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అమెరికాలో ఉన్నట్టు తెలుస్తోంది. అక్కడ లాస్ ఏంజిల్స్ సిటీలో రాజమౌళికి ఓ ఇల్లు ఉంది. ఆ ఇంటిలో కొన్ని రోజులు ఉండొచ్చు. 'ఆర్ఆర్ఆర్'కు ఆస్కార్ రావడంతో ఇప్పుడు తదుపరి సినిమా మీద రాజమౌలోకి మరింత దృష్టి పెట్టే అవకాశం ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఆయన సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ స్టూడియోలు ఆ సినిమాకు పని చేసే అవకాశాలు ఉన్నాయి.