Harshvardhan Rane: హీరోనూ వదల్లేదు, చొక్కా చింపేశారు... నిధి, సమంత టైపులో హర్షవర్ధన్ రాణెను చుట్టుముట్టిన ఫ్యాన్స్
Ek Deewane Ki Deewaniyat OTT: నిధి అగర్వాల్, సమంతను పబ్లిక్ లో జనాలు చుట్టుముట్టిన ఘటన మరువక ముందు ఉత్తరాదిన అటువంటి ఘటన చోటు చేసుకుంది. హీరో హర్షవర్ధన్ రాణెను అభిమానులు చుట్టుముట్టారు.

హైదరాబాద్ సిటీలో 'ది రాజా సాబ్' సాంగ్ లాంచ్ ప్రోగ్రామ్‌లో నిధి అగర్వాల్ చుట్టూ చేరిన అభిమానులు ఏం చేశారో అందరూ చూశారు. మరొక షాప్ లాంచ్ కోసం వెళ్లిన సమంతను సైతం జనాలు చుట్టుముట్టారు. ఆ రెండు ఘటనలు మరువక ముందు ఉత్తరాదిన ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. హిందీ సినిమా ఓటీటీ ప్రమోషన్లలో హర్షవర్ధన్ రాణెను అభిమానులు చుట్టుముట్టారు. 'ఏక్ దీవానే కి దీవానియత్' సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆయనను అభిమానులు చుట్టుముట్టి చొక్కా కూడా చింపేశారు.
ఈ ఏడాది ఇంటెన్స్ లవ్ స్టోరీ సినిమాలపై క్రేజ్ కనిపించింది. 'సయ్యారా', 'ఏక్ దీవానే కి దీవానియత్', 'తేరే ఇష్క్ మే' చిత్రాలకు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల ఆదరణ లభించింది. అయితే, ఈ సినిమాలను థియేటరలలో చూడటం మిస్ అయినవారు ఇప్పుడు ఓటీటీలో చూడవచ్చు. 'ఏక్ దీవానే కి దీవానియత్' ఓటీటీ విడుదల నేపథ్యంలో ప్రమోషన్ కోసం వెళ్ళినప్పుడు అభిమానుల చేతిలో హీరో హర్షవర్ధన్ రాణే చిక్కుకున్నారు.
హర్షవర్ధన్ రాణే చొక్కా చింపేసిన అభిమానులు
హర్షవర్ధన్ రాణే, సోనమ్ బజ్వా నటించిన సినిమా 'ఏక్ దీవానే కి దీవానియత్'. డిసెంబర్ 16 నుండి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఈ సినిమాను జీ5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో చూడవచ్చు. ఈ సందర్భంగా తన సినిమాను ప్రమోట్ చేయడానికి హీరో ప్రేక్షకుల మధ్యలోకి వెళ్ళారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అయ్యాయి. ఆయన వెళ్లిన చోట అభిమానులు నియంత్రణ కోల్పోయి నటుడిని చుట్టుముట్టినట్లు కనిపించింది.
బాంద్రాలోని బస్ స్టాండ్‌లో సినిమా డిజిటల్ విడుదల ప్రమోషన్ చేస్తున్నప్పుడు అభిమానుల చేతిలో చిక్కుకున్నారు హర్షవర్ధన్ రాణే. ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. అందులో నటుడు తన కారు నుండి దిగగానే అభిమానులు అకస్మాత్తుగా అతన్ని చుట్టుముట్టి అతని చొక్కాను లాగడం ప్రారంభించినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత అభిమానులు షాక్ అయ్యారు.
Also Read: Mark OTT: 'మార్క్' ఓటీటీ... కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
View this post on Instagram
నిధి అగర్వాల్ అయితే కారులోకి రావడానికి ఇబ్బంది
గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. అందులో నిధి అగర్వాల్ 'ది రాజా సాబ్' ప్రమోషనల్ ఈవెంట్‌లో కనిపించింది. హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్‌లో హీరోయిన్ అభిమానుల చేతిలో చిక్కుకుంది. అభిమానులు ఆమెను చుట్టుముట్టడమే కాకుండా ఆమెతో దురుసుగా ప్రవర్తించారు. కారులోకి రావడానికి ఇబ్బంది పడింది. అదొక్కటే కాదు... సమంత రూత్ ప్రభు కూడా అటువంటి పరిస్థితిలో చిక్కుకుంది.
ప్రస్తుతం హర్షవర్ధన్ రాణే సినిమాలకు వస్తే...
హర్షవర్ధన్ రాణేకు ఈ ఏడాది చాలా కలిసి వచ్చింది. 2016లో విడుదలైన అతని చిత్రం 'సనమ్ తేరి కసమ్' ఈ సంవత్సరం మళ్ళీ విడుదలై భారీ వసూళ్లు సాధించింది. ఈ సంవత్సరం 'ఏక్ దీవానే కి దీవానియత్' కూడా విడుదలై బాక్సాఫీస్‌లో మంచి వసూళ్లు సాధించింది. ఇప్పుడు నటుడి రాబోయే చిత్రాల విషయానికొస్తే, అతను 'సిలా', 'కున్ ఫాయా కున్' మరియు 'ఫోర్స్ 3' వంటి చిత్రాలలో కనిపించనున్నాడు.
Also Read: స్టేజిపై కన్నీళ్లు పెట్టుకున్న 'ది రాజా సాబ్' దర్శకుడు... ఓదార్చిన ప్రభాస్





















