Dacoit Glimpse: అందరూ నిన్ను మోసం చేశారు.. నేను మాత్రం.. - ఇంట్రెస్టింగ్‌గా అడివి శేష్ 'డకాయిట్' ఫైర్ గ్లింప్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
Dacoit Fire Glimpse: అడివి శేష్ లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'డకాయిట్' నుంచి ఫైర్ గ్లింప్స్ వచ్చేసింది. మాస్ ఎలివేషన్స్‌తో ఆయన చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.

Adivi Sesh's Dacoit Movie Fire Glimpse Released: అడివి శేష్, మృణాల్ ఠాకూర్ మోస్ట్ అవెయిటెడ్ యాక్షన్ డ్రామా 'డకాయిట్'. ఈ మూవీ నుంచి ఫైర్ గ్లింప్స్ తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. అడివి శేష్ నటించిన 'క్షణం', 'గూఢచారి'తో పాటు పలు తెలుగు సినిమాలకు కెమెరా మ్యాన్‌గా చేసిన షానీల్ డియో ఈ మూవీకి దర్శకత్వం వహించారు.
ఆసక్తికరంగా గ్లింప్స్
ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ జూలియట్ పాత్రలో కనిపించారు. 'హే జూలియట్.. నీకు జరిగింది మామూలు విషయం కాదు.' అంటూ అడివి శేష్ డైలాగ్‌తో గ్లింప్స్ ప్రారంభం కాగా.. 'అందరూ నిన్ను మోసం చేశారు. కానీ నేను నిన్ను మోసం చేయడానికి రాలేదు.' అంటూ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. అంతే కాకుండా అడివి శేష్ ఇందులో ఖైదీగా కనిపించారు. మాస్ ఎలివేషన్ డైలాగ్స్ మూవీపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. భీమ్స్ సిసిరోలియో బీజీఎం వేరే లెవల్‌లో ఉంది.
ఇద్దరు మాజీ లవర్స్ కథే డకాయిట్ అని తెలుస్తోంది. తమ జీవితాలను మార్చుకునేందుకు వరుస దోపిడీ ప్రణాళికలు వేయగా.. ఆ తర్వాత ఏం జరిగిందనేదే స్టోరీ. ఇద్దరు లవర్స్ బద్ధ శత్రువుల్లా ఎలా మారారు?, ఒకరినొకరు చంపుకొనేందుకు సైతం ఎందుకు వెనుకాడరు? అనేది తెలియాలంటే మూవీ రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
Thagaletteydaaniki Osthunna!
— Adivi Sesh (@AdiviSesh) May 26, 2025
🔥❤️🔥 It’s gonna be a #DACOIT December#DacoitFire is out now! 👇🏼https://t.co/stdbamH9pW#DACOIT IN CINEMAS WORLDWIDE CHRISTMAS :: DECEMBER 25th 💥💥#DacoitFromDec25th@mrunal0801 @anuragkashyap72 @Deonidas #BheemsCeciroleo @danushbhaskar… pic.twitter.com/nQINjgTodY
Also Read: మా కులం సినిమా.. మా గుడి సినిమా థియేటర్ - ట్రోలింగ్స్‌పై మంచు మనోజ్ స్ట్రాంగ్ కౌంటర్
క్రిస్మస్ సందర్భంగా..
ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఎస్ఎస్ క్రియేషన్స్, సునీల్ నారంగ్ ప్రొడక్షన్స్ సంస్థలపై కింగ్ నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అడివి శేష్ (Adivi Sesh), మృణాల్ ఠాకూర్‌తో పాటు ప్రకాష్ రాజ్, జైన్ మేరీ ఖాన్, సునీల్, అతుల్ కుల్‌కర్ణి, అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమాను క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
భారీ ధరకు ఆడియో రైట్స్
ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా.. ఫైర్ గ్లింప్స్‌లో బీజీఎం వేరే లెవల్‌లో ఉంది. మూవీ ఆడియో రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ప్రముఖ సంస్థ 'సోనీ'.. రూ.8 కోట్లకు రైట్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. అడివి శేష్ కెరీర్‌లోనే ఇది భారీ రికార్డుగా చెబుతున్నారు.
అడివి శేష్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం 'డకాయిట్'తో పాటు స్పై యాక్షన్ థ్రిల్లర్ 'గూఢచారి' మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న మూవీలోనూ ఆయన నటిస్తున్నారు. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కొన్ని విదేశాల్లో షూటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వరుస మూవీస్ వస్తుండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.





















