Adipurush : అందుకే ‘ఆదిపురుష్’ విడుదల ఆలస్యమవుతోంది: ఓం రౌత్
ఓం రౌత్ డైరెక్షన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా 'ఆదిపురుష్'విడుదలకు పేలవమైన విజువల్ ఎఫెక్ట్సే కారణమని మూవీ డైరెక్టర్ వెల్లడించారు. వీఎఫ్ఎక్స్ వర్క్ వల్లే తమకు ఆరేడు నెలల కాలం కలిసొచ్చిందని తెలిపారు
Adipurush : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కృతి సనన్ నటించిన పాన్-ఇండియన్ పౌరాణిక ఇతిహాసం, 'ఆదిపురుష్' రిలీజ్ కు ఆలస్యంపై మేకర్స్ స్పందించారు. విజువల్ ఎఫెక్ట్స్ కారణంగా ఈ సినిమా విడుదల మరింత ఆలస్యమవుతోందని ఈ సందర్భంగా ఆ మూవీ డైరెక్టర్ ఓం రౌత్ వెల్లడించారు.
ఓం రౌత్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'ఆది పురుష్' సినిమాకు ముందు నుంచీ అడుగడునా ఆటంకాలే ఎదురవుతున్నాయి. సినిమా పోస్టర్ రిలీజైన దగ్గర్నుంచి ట్రైలర్ వరకు ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూ సవాళ్లను అధిగమిస్తూనే ఉంది. సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్ గ్లింప్స్, టీజర్ అభిమానులను, నెటిజన్లను తీవ్రంగా నిరాశపరచడంతో పాటు... రాముడిగా ప్రభాస్ లుక్స్ కూడా ఆశించిన స్థాయిలో ఆదరణకు నోచుకోలేదు. దీంతో మేకర్స్ అన్ని రకాలుగా నిరాశకు లోనయ్యే పరిస్థితి ఏర్పడింది. సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ సైతం పేలవంగా ఉండడంతో సాధారణ ప్రేక్షకులు ఈ సినిమాను ఎంజాయ్ చేయలేరనే వార్తలూ వచ్చాయి.
'ఆది పురుష్' ను ‘మోషన్ కాప్చర్ టెక్నాలజీ’ తో సహజంగా గ్రాఫిక్స్ ఉండేలా చేస్తామని సినీ దర్శకుడు ఓం రౌత్ ప్రకటించినా.. టీజర్, ట్రైలర్ లోని సన్నివేశాలపై తీవ్ర స్థాయిలో నెగెటిక్ టాక్ వచ్చింది. దీంతో మూవీ రిలీజ్ ఆలస్యం అవుతూ వస్తోంది. ఈ ఏడాది సంక్రాంతికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. వీఎఫ్ఎక్స్ పై వచ్చిన ట్రోలింగ్, నెగెటివ్ టాక్ కారణంగా విజువల్ ఎఫెక్ట్ లో మార్పులు చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇక ఇటీవలే ఆ మాటను నిలబెట్టుకున్నట్టు సోషల్ మీడియాలో వైరల్ కొన్ని ఫొటోలు వైరల్ గా మారాయి. 'ట్రైబెకా ఫెస్టివల్' సందర్భంగా రిలీజైన ఓ ప్రోమోలో ఆది పురుష్ మూవీలోని ఓ క్లిప్పింగ్ కనిపించింది. ఈ క్లిప్పింగ్ లో కొన్ని మార్పులు జరిగినట్టు వార్తలు వినిపించాయి. కానీ నిజంగా చెప్పాలంటే బ్యాగ్రౌండ్ కలర్ మినహా పెద్దగా మార్పులేమీ చేయలేదనట్టు మాత్రం స్పష్టంగా తెలుస్తోంది.
ఇక తాజాగా 'ఆది పురుష్' విడుదలకు అవుతున్న ఆలస్యంపై మేకర్స్ రియాక్ట్ అయ్యారు. ఈ ఏడాది ఆరంభంలోనే మూవీని రిలీజ్ చేద్దామనుకున్నాం. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల జూన్‌కు వాయిదా వేశామని డైరెక్టర్ ఓం రౌత్ అన్నారు. అలా తమకు ఆరేడు నెలల కాలం కలిసి వచ్చిందని చెప్పారు. అది తమకు ఎంతో ముఖ్యమైన సమయం తమకు ఎదురవుతున్న సవాళ్లు సినిమాను మరింత మెరుగ్గా, మరింత బలంగా సాగేలా చేస్తాయని అన్నారు. భారతదేశంలోనే ఆదిపురుష్ లాంటి సినిమా మునుపెన్నడూ రాలేదన్న ఆయన.. 'మార్వెల్', 'డీసీ', 'అవతార్' లాంటి హాలీవుడ్ బ్లాక్‌బస్టర్‌లలో ఉపయోగించిన సాంకేతికతను ఆదిపురుష్‌లో ఉపయోగించినట్లు ఓం రౌత్ వెల్లడించారు. రామాయణాన్ని ప్రస్తుత తరానికి అందించడమే తమకున్న పెద్ద బాధ్యత అని ఆయన చెప్పారు.
ఇక 'ఆది పురుష్' సినిమా విషయానికొస్తే ఈ సినిమాలో ప్రభాస్ రాముడుగా, సీతా దేవి పాత్రలో కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా కనిపించనున్నారు. ఇంతకుముందు హనుమంతుడు , రాక్షస రాజు రావణున్ని ఇష్టమెచ్చినట్టుగా చూపించారని ఆదిపురుష్ నిర్మాతలపై హిందూ గ్రూపు నాయకులు అనేక కేసులు కూడా దాఖలు చేశారు. ఇదిలా ఉండగా ఈ మూవీ జూన్ 16, 2023న పాన్ ఇండియా రేంజ్ లో ప్రపంచ వ్యా్ప్తంగా రిలీజ్ కానుంది.