అన్వేషించండి

Sreeleela : శ్రీలీల తిలక్ వర్మ డేటింగ్ రూమర్స్ - హీరోయిన్ తల్లి స్ట్రాంగ్ రియాక్షన్

Sreeleela Dating : హీరోయిన్ శ్రీలీల క్రికెటర్ తిలక్ వర్మ డేటింగ్ రూమర్స్‌పై హీరోయిన్ తల్లి రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని అన్నారు.

Actress Sreeleela's Mother Reaction On Dating Rumours : క్రికెటర్ తిలక్ వర్మతో (Tilak Varma) స్టార్ హీరోయిన్ శ్రీలీల డేటింగ్‌లో ఉన్నట్లుగా గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై హీరోయిన్ తల్లి స్వర్ణలత రియాక్ట్ అయ్యారు. శ్రీలీల పెళ్లికి చాలా టైం ఉందంటూ ఈ రూమర్స్‌ను ఖండించారు.

'కొంచెం కూడా నిజం లేదు'

ఈ వార్తల్లో కొంచెం కూడా నిజం లేదని... అసలు ఇలాంటి రూమర్స్ ఎలా పుట్టుకొస్తాయో తెలియడం లేదని తెలిపారు శ్రీలీల తల్లి. 'సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం, వార్తలు పూర్తిగా అవాస్తవం నిరాధారం. ఇలాంటి కథలు ఎలా పుట్టుకొస్తాయో తెలియడం లేదు. ఇందులో కొంచెం కూడా నిజం లేదు.

శ్రీలీల (Sreeleela) ప్రస్తుతం తన చదువు, యాక్టింగ్‌లో బిజీగా ఉంది. ఏ మాత్రం కొంచెం గ్యాప్ దొరికినా NEET PGకి ప్రిపేర్ అవుతోంది. ఇలాంటి వ్యక్తిగత విషయాలు ఆలోచించడానికి ఆమెకు మరో ఐదారేళ్లు టైం ఉంది.' అని చెప్పారు. 2025లో డిసెంబరులో శ్రీలీల - తిలక్ ఇద్దరూ తిరుమలను సందర్శించడం, వాంఖడే టీ 20 మ్యాచ్‌లో హీరోయిన్ సందడి చేయడం... రెండూ ఉద్దేశపూర్వకంగా జరగలేదని స్పష్టం చేశారు. వాటి ఆధారంగా కథలు అల్లుకుపోవద్దని అన్నారు. ముంబయి ఐపీఎల్ మ్యాచ్‌కు శ్రీలీల హాజరు కావడంతో డేటింగ్ రూమర్స్ ప్రచారం సాగింది.

Also Read : ముంబైలో ఇవాళే 'పెద్ది' ట్రైలర్ లాంచ్... రిలీజ్ టైమ్ నుంచి వెన్యూ వరకు - ఫుల్ డీటెయిల్స్

గతంలో కూడా శ్రీలీలపై ఇలాంటి రూమర్స్ వచ్చాయి. అప్పుడు కూడా తల్లి స్వర్ణలత వాటిని ఖండించారు. బాలీవుడ్ యాక్టర్ కార్తీక్ ఆర్యన్‌తో ఆమె రిలేషన్‌లో ఉన్నట్లు బీటౌన్‌లో రూమర్స్ వచ్చాయి. కార్తిక్ ఆర్యన్ తల్లి తాను ఇద్దరం గైనకాలజిస్టులమని... వృత్తి నేపథ్యంలో ఇద్దరం కలుసుకుంటామని చెప్పారు. దురదృష్టవశాత్తూ... అందరూ శ్రీలీల, కార్తిక్‌లకు రిలేషన్ ఉందని రాయడం మొదలుపెట్టారని వాటిని తీవ్రంగా ఖండించారు.

ప్రస్తుతం శ్రీలీల వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. పెళ్లిసందDతో ఇండస్ట్రీ ఇచ్చిన ఈ యంగ్ బ్యూటీ... స్టార్ హీరోల సరసన హీరోయిన్‌గా నటించారు. రవితేజ ధమాకాతో సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత మహేశ్ బాబుతో గుంటూరు కారం, బాలయ్యతో భగవంత్ కేసరి, పవన్ కల్యాణ్‌తో ఉస్తాద్ భగత్ సింగ్‌లో నటించారు. గత కొంతకాలంగా ఆమె ఖాతాలో సరైన హిట్ పడలేదు. రీసెంట్‌గా తమిళంలో ఎంట్రీ ఇచ్చారు. శివకార్తికేయన్ హీరోగా వచ్చిన పరాశక్తి మూవీలో హీరోయిన్‌గా నటించారు. ఇప్పుడు స్టార్ హీరో ధనుష్ హీరోగా నటిస్తోన్న మూవీలో హీరోయిన్‌గా చేస్తున్నారు. బాలీవుడ్‌లోనూ ఓ మూవీ చేస్తున్నారు.

Also Read : బాక్సాఫీస్‌పై 'కరుప్పు' సామి తాండవం... మూడు రోజుల్లో వంద కోట్లు... సూర్య సాలిడ్ హిట్టు కొట్టాడయ్యా

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chennai Love Story Collections: వీకెండ్ తర్వాత చెన్నై లవ్ స్టోరీ కలెక్షన్లు ఎలా ఉన్నాయ్? సోమవారం ఎన్ని కోట్లు వచ్చాయంటే? 
Chennai Love Story Four Days Collection - చెన్నై లవ్ స్టోరీ కలెక్షన్లు... నాలుగో రోజు ఎంత వచ్చిందంటే?
Pavala Shyamala: ప్రముఖ నటి పావలా శ్యామల కన్నుమూత... చివరి రోజుల్లో ఎవరికీ అటువంటి దుస్థితి రాకూడదు
ప్రముఖ నటి పావలా శ్యామల కన్నుమూత... చివరి రోజుల్లో ఎవరికీ అటువంటి దుస్థితి రాకూడదు
Tollywood Stars Injured: జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
Jr NTR Shoulder Injury : ఎన్టీఆర్‌కు భుజం గాయం - 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
ఎన్టీఆర్‌కు భుజం గాయం - 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
Advertisement

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
"63 కోర్ట్ ధిక్కార కేసులు భూ మాఫియావే!" - హైకోర్టు తీర్పుపై HYDRA క‌మిష‌న‌ర్ రంగనాథ్ వివరణ
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Blood Pressure Tablets : బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
Tollywood Stars Injured: జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
Embed widget