Samantha: టాలీవుడ్‌లోనూ హేమ కమిటీలాంటిది ఏర్పాటు చేయండి- సీఎం రేవంత్ రెడ్డికి సంచలన లేఖ రాసిన సమంత
Samantha: స్టార్ హీరోయిన్ సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ సంచలన పోస్ట్ షేర్ చేసింది. మలయాళంలో లాగే మనకు హేమ కమిటీ కావాలని, ఇక్కడ నియమించిన ఆ సబ్ కమిటీ రిపోర్ట్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు!
Samantha Sensational Post: స్టార్ హీరోయిన్ సమంత ఓ షాకింగ్ పోస్ట్ షేర్ చేసింది. మలయాళ ఇండస్ట్రీ హేమ కమిటీ నివేదిక నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వాన్ని ఓ విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం సమంత పోస్ట్ టాలీవుడ్‌లో సంచలనంగా మారింది. కాగా మలయాళ సినీ ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై ఇటీవల జస్టిసి హేమ కమిటీ నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో హేమ సంచలన విషయాలు బయటపెట్టింది. దీంతో ఇండస్ట్రీలో చీకటి కోణాలు బట్టబయలు అయ్యాయి.
ఈ నివేదిక సీఎం పినరయి విజయన్‌కు అందించగా అందులో విషయాలను అందరికి తెలిసేల కమిటీ నివేదిక విడుదల చేసింది ప్రభుత్వం.ఇందులో విస్తూ పోయే నిజాలు బయటకు వచ్చాయి. హేమ కమిటీ రిపోర్టులో ఇతర ఇండస్ట్రీలోని వారే కాదు తమిళ ఇండస్ట్రీకి చెందిన వారు కూడా షాక్ అవుతున్నారు. హేమ కమిటీ రిపోర్టుపై సీరియస్‌గా తీసుకోవాలి, ఇందులో నిజానిజాలు బయటకు వచ్చేలా చేసి బాధిత మహిళలకు న్యాయం జరిగేలా చూడాలంటూ ఇండస్ట్రీలోని వారంత డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఇటీవల టాలీవుడ్ హీరోయిన్ సమంత కూడా స్పందించారు. అంతేకాదు హేమ కమిటీ పనితీరు, ఈ కమిటీ ఏర్పడేలా చేసిన WCC నిర్ణయాన్ని ఆమె ప్రశంసించారు.
అయితే తాజాగా హేమ కమిటీలాగే మన టాలీవుడ్‌లో నియమించిన సబ్ కమిటీ నివేదికను కూడా వెలికితియాలని ఆమె తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు టాలీవుడ్‌లో మహిళలకు సురక్షితమైన వాతావరణం కల్పించే ఉద్దేశంతో ఏర్పాటై వాయిస్ ఆఫ్ ఉమెన్ సబ్ కమిటి పోస్ట్‌ను సమంత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు. ఇందులో "తెలుగు సినీ పరిశ్రమలోని మా మహిళలంతా హేమ కమిటీ రిపోర్టును స్వాగతిస్తున్నాం. అలాగే ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ (WCC) చేస్తున్న కృషిని అభినందిస్తున్నాం. WCC కారణంగా మలయాళ ఇండస్ట్రీలోని చీకటి కోణాలు బయటపడ్డాయి. ఆ WCC నుంచి స్ఫూర్తి పొందే తెలుగు సినీ పరిశ్రమలో మహిళల కోసం ఏర్పడిన సపోర్ట్ గ్రూపు 'ది వాయిస్ ఆఫ్ ఉమెన్' 2019లో ఏర్పాటైంది.
లైంగిక వేధింపులపై సబ్ కమిటీ సమర్పించిన ఆ రిపోర్టును పబ్లిష్ చేయాలని మేము తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇది టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేసే మహిళల రక్షణ చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం, ఇండస్ట్రీ చేపట్టబోయే విధానాలకు తోడ్పడుతుందని మేము భావిస్తున్నాం" అని కోరింది. అదే పోస్ట్‌ను సమంత తన ఇన్‌స్టాగ్రామ్ వేదిక షేర్ చేసి వారికి సపోర్టు ఇచ్చారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆమె పోస్ట్ హాట్‌టాపిక్‌గా మారింది. ఇదిలా ఉంటే సమంత చివరిగా ఖుషి చిత్రంతో అలరించింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఒక్క తెలుగు ప్రాజెక్ట్ కూడా లేదు. ఆమె నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ రిలీజ్ కావాల్సి ఉంది. సినిమాలకు లాంగ్ బ్రేక్ తీసుకున్న సామ్ ఇప్పుడిప్పుడే రీఎంట్రీకి రెడీ అవుతుంది.
Also Read: ఆ రూమర్లకు చెక్, పుష్ప 2 రిలీజ్‌పై నిర్మాత క్లారిటీ - ఈ వినాయక చవితికి నో అప్‌డేట్స్ అంట!