Pushpa 2: ఆ రూమర్లకు చెక్, పుష్ప 2 రిలీజ్‌పై నిర్మాత క్లారిటీ - ఈ వినాయక చవితికి నో అప్డేట్స్ అంట!
Pushpa 2 Release: కొద్ది రోజులుగా 'పుష్ప 2' మూవీ రిలీజ్‌పై రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా వాటన్నింటిపై స్పందించాడు నిర్మాత రవి శంకర్. అలాగే పుష్ప 2 రిలీజ్‌పై కూడా క్లారిటీ ఇచ్చారు.
Producer Ravi Shankar On Pushpa 2 Release: ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ అవైయిటెడ్ చిత్రాల్లో 'పుష్ప 2' ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో పాన్ ఇండియా తెరకెక్కుతోంది. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ వచ్చిన మూడేళ్లు అవుతుంది. 2001 డిసెంబర్ 17న విడుదలైన ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. 'పుష్ప: ది రైజ్'గా వచ్చిన ఫస్ట్ పార్ట్ ప్రపంచ బాక్సాఫీసు వద్ద మారుమోగింది. దీనికి అప్పుడే సీక్వెల్‌ని ప్రకటించారు. ఫస్ట్ పార్ట్ వచ్చిన మూడేళ్లు అవుతుంది.
పుష్ప 2 మళ్లీ వాయిదా?
కానీ, ఇంకా పుష్ఫ 2 షూటింగ్ ఇంకా పూర్తి చేసుకోలేదు. ఈ మూవీ ఆలస్యం అవుతుండటంతో పుష్ప 2పై రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న సినిమా రిలీజ్ చేస్తామన్నారు. కానీ అనుకోకుండా సినిమా వాయిదా వేశారు. ఏకంగా నాలుగు నెలలు వెనక్కి తీసుకెళ్లి డిసెంబర్ 6న రిలీజ్ డేట్ ప్రకటించారు. దీంతో పుష్ప 2పై రకరకాల పుకార్లు వస్తున్నాయి. డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్‌కి మధ్య విభేదాలు వచ్చాయని, దీంతో బన్నీ షూటింగ్‌కి ప్యాకప్ చెప్పి విదేశాలకు వెళ్లాడంటూ రూమర్స్ వచ్చాయి. అయితే వాటికి రీసెంట్గా చెక్ పెట్టారు బన్నీ, సుకుమార్.
బన్నీ-సుకుమార్ మధ్య మనస్పర్థలు...
ఇటీవల 'మారుతి నగర్ సుబ్రమణ్యం' ప్రీరిలీజ్ ఈవెంట్‌కు సుకుమార్‌తో కలిసి వచ్చిన వారిమధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని చూపించారు. అయినా, 'పుష్ప: ది రూల్' డిసెంబర 6న వచ్చే అవకాశం లేదని, ఇది మళ్లీ వాయిదా పడుతుందని ప్రచారం జరుగుతుంది. తాజాగా ఈ పుకార్లన్నింటికి చెక్ పెట్టారు నిర్మాత రవి శంకర్. మైత్రీ మూవీ మేకర్ సంస్థ నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ తాజాగా మత్తు వదలరా టీజర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన 'పుష్ప 2'పై వస్తున్న పుకార్లపై స్పందించారు.
షూటింగ్ సాఫిగా జరుగుతుంది
"పుష్ప ఎక్స్ట్రార్డినరి సినిమా. అందులో ఎలాంటి సందేహం లేదు. పుష్ప 2ను ఈ డిసెంబర్ 6న విడుదల చేస్తున్నాం. అందదుఓల ఎలాంటి డౌట్ లేదు. మూవీ రిలీజ్‌పై ఎన్నో రుమార్లు వస్తున్నాయి. అవి నిజం కాదు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా డిసెంబర్ 6నే సినిమా రిలీజ్ చేస్తాం. షూటింగ్ సాఫీగా సాగుతుంది. ఈ సెప్టెంబర్ 2న ఫస్టాఫ్ ఎడింగ్కి ఇచ్చేస్తున్నారు. ఈ లోపు ఎడింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఇక సెకండాఫ్ కూడా అక్టోబర్ 6 తేదికల్లా ఇచ్చే అవకాశం ఉంది. అది కూడా పూర్తి చేసి కంఫర్టబుల్‌గా నవంబర్ 28 వరకు కాపీ ఇచ్చేసి వరల్డ్ వైడ్‌గా పంపించాలని ప్లాన్ చేస్తున్నాం. నవంబర్ 25న సెన్సార్ బోర్డు చేపిస్తాం" అంటూ చెప్పుకొచ్చారు.
అయితే ఈ వినాయక చవితికి మూవీ అప్డేట్స్ ఏం లేవని, సెప్టెంబర్.. అక్టోబర్‌లో పాటలు రిలీజ్ చేస్తామన్నారు. పుష్ప 2కి సంబంధించి ఇంకా రెండు పాటలు ఉన్నాయన్నారు. ఇక సినిమా ప్రీమియర్స్ కూడా ఉన్నాయని, ముందు రోజు పక్కా ప్రీమియర్స్ ఉంటాయన్నారు. ఈ అప్డేట్తో పుష్ప 2 రిలీజ్‌పై వస్తున్న పుకార్లకు చెక్ పడినట్టయ్యింది. నిర్మాత ఇచ్చిన అప్డేట్స్తో బన్నీ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇది తెలిసి ఫ్యాన్స్, ఆడియన్స్ పండగా చేసుకుంటున్నారు. పుష్ప 2 జాతర సెప్టెంబర్ నుంచి మొదలు అంటూ ఖుషీ అవుతున్నారు.