Rakhi Sawant: రాఖీ సావంత్ ముద్దు కేసు - రద్దు చేయాలంటూ కోర్టును ఆశ్రయించిన సింగర్
బాలీవుడ్ నటి రాఖీ సావంత్ గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. తన వ్యాఖ్యలు, చేష్టలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. ఎక్కువగా ఆమె ప్రేమ, పెళ్లికు సంబంధించిన వార్తలతో..
Rakhi Sawant : బాలీవుడ్ నటి రాఖీ సావంత్ గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. తన వ్యాఖ్యలు, చేష్టలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. ఎక్కువగా ఆమె ప్రేమ, పెళ్లికు సంబంధించిన వార్తలతో ఎక్కువగా వార్తల్లో నిలిచింది. ఈ బ్యూటీ పేరు మళ్లీ తాజాగా తెరపైకి వచ్చింది. గతంలో బాలీవుడ్ సింగర్ మికా సింగ్ పై రాఖీ సావంత్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. అప్పటి నుంచి ఈ కేసు కోర్టులో నడుస్తుంది. తాజాగా ఈ కేసుకు సంబంధించి సింగర్ మికా సింగ్ ముంబై హైకోర్టును ఆశ్రయించాడు. రాఖీ సావంత్ కు తనకూ మధ్య విభేదాలు లేవని, తనపై పెట్టిన కేసునే పరస్పర ఒప్పందంలో పరిష్కరించుకున్నామని, అందుకు ఆమె పూర్తి అంగీకారం తెలిపినట్టు కోర్టుకు తెలియపరిచారు. కాబట్టి ఈ కేసును కొట్టి వేయాలని కోరాడు. ఈ విషయాన్ని మికా సింగ్ తరఫు లాయర్ వెల్లడించినట్టు సమాచారం.
మరోవైపు, రాఖీ తరఫు న్యాయవాది కూడా ఈ విషయాన్ని తేల్చాలని అనుకుంటున్నారని, అందుకే తాను అఫిడవిట్‌ను సిద్ధం చేశానని తెలిపారట. అందుకు సంబంధించిన అఫిడవిట్ హైకోర్టు రిజిస్ట్రీ విభాగంలో కనిపించకుండా పోయింది. దీంతో ఈ కేసు తదుపరి విచారణ పూర్తయ్యేలా వారంలోగా రాఖీ తాజా అఫిడవిట్‌ను సిద్ధం చేయాలని కోర్టు ఆదేశించింది.
అసలేం జరిగిందంటే..
రాఖీ సావంత్ 2006 జూన్ 11న ముంబై శివారు ఓ రెస్టారెంట్ లో బర్త్ డే పార్టీ కు హాజరైంది. ఆ పార్టీకి సింగర్ మికా సింగ్ కూడా వచ్చారు. ఈ సందర్బంగా మికా సింగ్ రాఖీ సావంత్ ను అనుమతి లేకుండా ముద్దు పెట్టుకున్నారట. దీంతో రాఖీ బలవంతంగా ముద్దు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. మికా సింగ్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. విచారణ జరిపిన పోలీసులు సంఘటన జరిగిన సమయంలో పార్టీ వీడియో ఫుటేజ్, స్టిల్ ఫోటోల ఆధారంగా మికా సింగ్ పై భారత శిక్షాస్మృతిలోని 354 (వేధింపులు), 323 (దాడి) నేరాల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత మికా సింగ్ కనిపించకుండా పారిపోయాడు. తర్వాత అతను జూన్ 17, 2006 లో ముందస్తు బెయిల్ కోసం సెషన్స్ కోర్టును ఆశ్రయించాడు.
దాదాపు 17 ఏళ్లుగా ఈ కేసు కోర్టులో నడుస్తోందని మికా సింగ్ తరఫు న్యాయ వాది తెలిపుతున్నారు. అయితే ఈ ఘటన జరిగి చాలా సంవత్సరాలు అయిపోవడంతో దీనికి ముగింపు పలకడానికి మికా, రాఖీ సిద్దంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరూ పరస్పర అంగీకారంతో ఈ కేసును కొట్టివేయాలని కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. మరో విషయం ఏంటంటే.. 2006 తనకు ముద్దు పెట్టాడు అంటూ మికా సింగ్ పై కేసు పెట్టిన రాఖీ గత కరోనా సమయంలో అదే మికా తో కలసి బహిరంగ ప్రదేశాల్లో కనిపించడం గమనార్హం. వీరిద్దరూ ఇప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారని, అందుకే ఇప్పుడు ఈ కేసును కొట్టివేయాలని నిర్ణయించుకున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు ఇదంతా చూసిన నెటిజన్స్.