Poonam Bajwa: ఎవర్రా మీరంతా? మరీ ఇలా ఉన్నారేంట్రా...? ఆ ప్రశ్నలకు ఉక్కిరి బిక్కిరైన పూనమ్
Poonam Bajwa Latest News: హీరోయిన్ పూనమ్ బజ్వా ఇన్‌స్టాగ్రామ్‌లో కాసేపు చిట్ చాట్ చేశారు. నెటిజనులు అడిగిన ప్రశ్నలకు ఆవిడ ఉక్కిరి బిక్కిరి అయ్యారు.

Poonam Bajwa Funny Reply to Netizens Compliments: 'మొదటి సినిమా' అంటూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది పూనమ్ బజ్వా. ఆ తర్వాత చిన్న చిన్న చిత్రాలు చేస్తూ... చివరకు 'పరుగు' మూవీతో మళ్లీ ఆకట్టుకుంది. అయితే ఈ బ్యూటీ తెలుగులో కంటే ఎక్కువగా తమిళంలో సినిమాలు చేసింది. అక్కడ పూనమ్ మంచి క్రేజ్ దక్కించుకుంది. దాంతో పూనమ్ ఎక్కువగా కోలీవుడ్ మీదే ఫోకస్ పెట్టి చెన్నైలో ఉంటున్న సంగతి తెలిసిందే. అక్కడ తన ప్రియుడుతో పూనమ్ ఉంటోందని కోలీవుడ్ గుసగుస. పూనమ్ వెకేషన్‌లకు సంబంధించిన ఫోటోలు ఎంతగా వైరల్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
సోషల్ మీడియాలో సందడి...
నెటిజనులతో చిట్ చాట్ వైరల్
పూనమ్ బజ్వా తెరపై ఎక్కువగా కనిపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం బాగా సందడి చేస్తూ ఉంటుంది. తాజాగా పూనమ్ పెట్టిన పోస్ట్... వాటికి ఒక్కో నెటిజన్ ఇస్తున్న కాంప్లిమెంట్స్, కొటేషన్స్‌లను చూసి పూనమ్ ఫిదా అవుతోంది. ఒక్కో కామెంట్ ఒక్కో డైమంట్ అన్నట్టుగా ఉంది. ఇక అవన్నీ చూసిన పూనమ్... 'ఎవర్రా మీరంతా...? మరీ ఇలా ఉన్నారేంట్రా బాబు!'' అని అనుకోకుండా ఉండలేదు.
'నువ్వు ఏమైనా సూర్యుడివా? ఎందుకంత వెలిగిపోతోన్నావ్' అని ఓ నెటిజన్ పూనమ్ బజ్వాను అంటాడు. 'అవును నేను నీకు మాత్రమే సూర్యుడిని' అని పూనమ్ రిప్లై ఇచ్చింది. 'నువ్వేమైనా వైఫై వా?... నీతోనే కనెక్ట్ అయిపోతోన్నా?' అని ఇంకో నెటిజన్ అన్నాడు. 'అరెరే ఇది బాగుందే' అని పూనమ్ మురిసిపోయింది.'నువ్వు ఎక్కడి నుంచి వచ్చావ్... స్వర్గం నుంచి కిందకు వచ్చావా? ఎందుకంటే నువ్వు దేవతలా కనిపిస్తున్నావ్!' అని మరో నెటిజన్ అన్నాడు. 'ఈ కాంప్లిమెంట్ వింటే నాకు నా కాలేజ్ రోజులు గుర్తుకు వస్తున్నాయి... రోజ్ డేని గుర్తుకు తెచ్చావ్' అని పూనమ్ బజ్వా రిప్లై ఇచ్చింది.
'నీ మీద నేను కంప్లైంట్ ఇస్తాను... నా గుండెలో ఫ్రీగా ఉంటున్నావ్... రెంట్ కూడా ఇవ్వడం లేదు' అని మరో నెటిజన్ అన్నాడు. 'వద్దు వద్దు అలా చేయొద్దు' అంటూ స్వీట్‌గా వేడుకుంది పూనమ్. ఇక ఇన్ స్టా స్టోరీలో జరిగిన ఈ చిట్ చాట్ అందరినీ నవ్వించేస్తోంది. ప్రస్తుతానికి అయితే తెలుగులో పూనమ్ సినిమాలు ఏవీ చేయడం లేదు. తమిళంలో అడపాదడపా తెరపై సందడి చేస్తోంది. హీరోయిన్ రోల్స్ నుంచి క్యారెక్టర్స్ వైపు ఆవిడ షిఫ్ట్ అవుతోంది.
Also Read: షూటింగులు ఆపితే అడుక్కు తినాలి... కార్మికుల ఆకలి బాధలపై మాట్లాడరే? - నాయకులపై వీఎన్ ఆదిత్య ఫైర్




















