Neha Sharma: టాలీవుడ్‌లోకి ‘చిరుత’ బ్యూటీ - ఆ యంగ్ హీరో సినిమాతో రీ ఎంట్రీకి సిద్ధమవుతోన్న నేహా శర్మ
‘చిరుత’ బ్యూటీ నేహా శర్మ మళ్లీ టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇవ్వనుందట. టాలీవుడ్ లో ఆ యంగ్ హీరోతో ఓ సినిమా చేయనుందనే వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
Neha Sharma: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో విశ్వక్ సేన్ ఒకరు. ప్రస్తుతం విశ్వక్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఈ ఏడాది ‘దాస్ కా ధమ్కీ’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ మూవీతో దర్శకుడు, నిర్మాతగానూ సక్సెస్ అయ్యాడు విశ్వక్. ఈ సినిమా తర్వాత మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు. ఇప్పటికే కృష్ణ చైతన్యతో ‘గ్యాంగ్ ఆఫ్ గోదావరి’ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. మరో మూవీ రవితేజ ముళ్ళపూడి దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ గురించి ఇప్పుడు మరో కొత్త అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘విఎస్10’ లో ‘చిరుత’ మూవీ బ్యూటీ నేహా శర్మ కూడా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడీ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టాలీవుడ్ లోకి మళ్లీ ‘చిరుత’ బ్యూటీ..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డెబ్యూ సినిమా ‘చిరుత’లో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది నేహా శర్మ. ఈ సినిమా 2007 లో విడుదలైంది. ఈ మూవీ తర్వాత వరుణ్ సందేశ్ తో ‘కుర్రాడు’ అనే సినిమాలో నటించింది. ఈ మూవీ యావరేజ్ గా నిలిచింది. ఈ రెండు సినిమాల తర్వాత ఆమెకు తెలుగులో పెద్దగా అవకాశాలు ఏమీ రాలేదు. దీంతో 2010 లో ‘క్రూక్’ అనే హిందీ సినిమాలో నటించింది. ఇక అప్పటి నుంచి హిందీ సినిమాలే ఎక్కువగా చేసిందీ బ్యూటీ. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మళ్లీ విశ్వక్ సేన్ సినిమాతో మళ్లీ ఈ బ్యూటీ టాలీవుడ్ లో అడుగుపెట్టనుందని తెలుస్తోంది. విశ్వక్ సేన్ - రవితేజ ముళ్ళపూడి కాంబోలో వస్తున్న మూవీలో నేహా శర్మ ఓ కీలక పాత్రలో కనిపించనునందనే వార్త ఇప్పుడు టాలీవుడ్ లో జోరుగా వినిపిస్తోంది.
త్వరలో మూవీ టైటిల్ గ్లింప్స్..
విశ్వక్ సేన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ‘గ్యాంగ్ ఆఫ్ గోదావరి’ మూవీ గ్లింప్స్ ను విడుదల చేశారు. దానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇక రవితేజ ముళ్ళపూడితో చేస్తున్న సినిమా కూడా శర వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ మూవీ మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తయినట్టు సమాచారం. త్వరలోనే మరో షెడ్యూల్ షూటింగ్ ను ప్రారంభించనున్నారు. అలాగే ఆగస్టు 6 న ఉదయం 11 గంటలకు సినిమా టైటిల్ గ్లింప్స్ ద్వారా విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు మేకర్స్ ఓ పోస్ట్ ను చేశారు. అలాగే ఈ మూవీ ఫస్ట్ సింగిల్ ను కూడా త్వరలోనే విడుదల చేస్తారని అంటున్నారు. ఇక ఈ మూవీకు జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. ఫన్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమాలతో విశ్వక్ ఎలాంటి హిట్ లు అందుకుంటాడో చూడాలి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial