Happy Birthday Nabha Natesh: నభా నటేష్ బర్త్ డే: అందాల నటికి అవకాశాలు నిల్ - పాపం, ఆ యాక్సిడెంట్‌తో!
Nabha Natesh : ఇస్మార్ట్ బ్యూటీ నభానటేష్ ఈరోజు తన పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా అభిమానులు ఆమెకు బర్త్ డే విషెస్ అందజేస్తున్నారు.
Nabha Natesh Birth Day : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో ఒకే ఒక సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చిన హీరోయిన్స్ లో నభా నటేష్ కూడా ఒకరు. 'ఇస్మార్ట్ శంకర్' మూవీ తో నబా నటేష్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఆ సినిమాలో ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ తెలంగాణ స్లాంగ్ తో అదరగొట్టింది. అంతకు ముందు ఒకటి రెండు సినిమాలు చేసినా రాని గుర్తింపు ఈ సినిమాతో సొంతం చేసుకుంది నభా నటేష్. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ సుధీర్ బాబు హీరోగా నటించిన 'నన్ను దోచుకుందువటే' అనే సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసి ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంది.
ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఫస్ట్ మూవీ లో క్లాస్ లుక్ తో ఆకట్టుకున్న ఈ హాట్ బ్యూటీ ఇస్మార్ట్ శంకర్ మూవీ తో తనలోని గ్లామర్ మొత్తాన్ని బయటికి తీసింది. అందంతోపాటు నటనతోనూ అదరగొట్టింది. సినిమా కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడంతో హీరోయిన్ గా నభా నటేష్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ సరసన 'డిస్కో రాజా', సాయి ధరమ్ తేజ్ కి జోడిగా 'సోలో బ్రతికే సో బెటర్', బెల్లంకొండ శ్రీనివాస్ సరసన 'అల్లుడు అదుర్స్' వంటి సినిమాలు చేసింది. కానీ ఆ సినిమాలేవి ఈమెకి ఆశించిన స్థాయి విజయాలను అందించలేకపోయాయి.
ఇక చివరగా నితిన్ కి జోడిగా 'మ్యాస్ట్రో' అనే సినిమాలో నటించింది. హిందీలో సూపర్ హిట్ అయిన 'అందాదున్' అనే సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీ కూడా నిరాశపరిచింది. ఆ తర్వాత అనుకోకుండా ఓ రోడ్డు ప్రమాదానికి గురి గురి కావడంతో రెండు చోట్ల ఎముకలు విరిగి సర్జరీ చేయించుకుంది. దాంతో ఏడాది పాటు సినిమాలకు దూరమైంది. ఇదే విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా స్వయంగా వెల్లడించింది. ఇక ప్రస్తుతం ఆఫర్స్ కోసం ట్రై చేస్తోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఆకర్షిస్తుంది.
అందాల ప్రదర్శనలో ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా గ్లామర్ డోస్ ని ఓ రేంజ్ లో పెంచుతూ నెటిజన్స్ ని ఆకట్టుకుంటుంది. నభా త్వరలోనే తన కొత్త సినిమాలకు సంబంధించి అప్డేట్స్ ప్రకటించనున్నట్లు సమాచారం. అందంతోపాటు టాలెంట్ ఉన్న నభా నరేష్ ఈరోజు(డిసెంబర్ 11) తన పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆమె ఫ్యాన్స్, ఫాలోవర్స్ బర్త్ డే విషెస్ తెలుపుతూ మళ్లీ తెలుగు వెండితెరపై అవకాశాలు అందుకుని హీరోయిన్ గా బిజీ అవ్వాలని కోరుకుంటున్నారు.
Also Read : హాయ్ నాన్న - అక్కడ మహేష్ తర్వాత నానిదే పైచేయి!