అన్వేషించండి

Hi Nanna : హాయ్ నాన్న - అక్కడ మహేష్ తర్వాత నానిదే పైచేయి!

Nani : నాచురల్ స్టార్ నాని హాయ్ నాన్న మూవీతో ఓవర్సీస్ మార్కెట్ వద్ద మహేష్ తర్వాతి స్థానంలో నిలిచాడు.

Nani Hi Nanna : న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం స్టార్ హీరోలకు పోటీ ఇస్తున్నాడు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జోనర్స్ ఎంచుకుని బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లు అందుకుంటున్నాడు. ఈ ఏడాది 'దసరా' మూవీతో భారీ పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న నాని తాజాగా 'హాయ్ నాన్న'తో మరో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. తండ్రీ, కూతురు మధ్య అనుబంధం నేపథ్యంలో ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంతో శౌర్యువ్ అనే నూతన దర్శకుడు వెండితెరకు పరిచయమయ్యాడు. నాని సరసన మృణాల్ హీరోయిన్ గా నటించింది. అలాగే నానికి కూతురిగా కియారా ఖన్నా తన నటనతో ఆకట్టుకుంది.

డిసెంబర్ 7న తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే అంశాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉండడంతో బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ డీసెంట్ కలెక్షన్స్ అందుకుంటుంది. ముఖ్యంగా ఓవర్సీస్ లో వీకెండ్ పూర్తవక ముందే వన్ మిలియన్ మార్క్ దాటింది. దీంతో టైర్ 2 హీరోల్లో ఎక్కువ సార్లు ఓవర్సీస్ మార్కెట్ వద్ద 1 మిలియన్ మార్క్ అందుకున్న హీరోగా నాని సరికొత్త రికార్డ్ క్రేయేట్ చేశాడు. ఈ సినిమాతో కలిపి మొత్తం నాని నటించిన తొమ్మిది సినిమాలు ఈ ఘనతను అందుకోవడం విశేషం.

హాయ్ నాన్న కంటే ముందు ఈగ, భలే భలే మగాడివోయ్, నేను లోకల్, MCA, నిన్ను కోరి, జెర్సీ, అంటే సుందరానికి, దసరా సినిమాలు ఈ ఘనత సాధించగా తాజాగా ఆ లిస్టులో హాయ్ నాన్న కూడా చేరింది. టైర్ 2 హీరోల్లో ఎక్కువసార్లు ఈ ఫీట్ అందుకున్న ఏకైక హీరోగా నాని నిలిచాడు. ఎలాగో లాంగ్ రన్ చాలా దూరంలో ఉంది కాబట్టి ఈజీగా టూ మిలియన్ మార్క్ కొట్టొచ్చని అంటున్నారు. ఓవర్సీస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు తర్వాత నాని ఆ ప్లేస్ ను కైవసం చేసుకున్నాడు. ఓవర్సీస్ మార్కెట్ వద్ద మహేష్ టాప్ వన్ ప్లేస్ లో కైవసం చేసుకుంటే, నాని టాప్ 2 ప్లేస్ లో నిలవడం విశేషం. మహేష్ ఖాతాలో ఇప్పటిదాకా 11 మిలియన్ మూవీస్ ఉన్నాయి.

సంక్రాంతికి విడుదల కాబోయే 'గుంటూరు కారం' 12వ మూవీ అవుతుంది.  ఇక మిగిలిన హీరోలు మహేష్, నాని తర్వాతి స్థానంలో ఉన్నారు. దీన్నిబట్టి ఓవర్సీస్ లో నానికి ఎంత బలమైన మార్కెట్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే హాయ్ నాన్న రిలీజ్ రోజే నాని అమెరికా ప్రయాణం పెట్టుకుని దానికి తగ్గట్టే అక్కడి ఆడియన్స్ ని కలుస్తూ, థియేటర్స్ విజిట్ చేస్తూ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాడు. సలార్ వచ్చేదాకా ఓవర్సీస్ లో హాయ్ నాన్నకు ఎలాంటి డోకా ఉండదని అక్కడి బయ్యర్లు చెబుతున్నారు. కాగా హాయ్ నాన్న మూవీ 4 రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా రూ.40 కోట్ల గ్రాస్ అందుకుంది. యానిమల్, ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాల వల్ల తెలుగు రాష్ట్రాల్లో తక్కువ థియేటర్స్ దొరికినప్పటికీ హాయ్ నాన్న ఈ రేంజ్ కలెక్షన్స్ అందుకోవడం విశేషం.

Also Read : ప్రభాస్ 'స్పిరిట్'లో ‘యానిమల్’ బ్యూటీ తృప్తి దిమ్రి? ఇదిగో క్లారిటీ!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Oscars 2026 : ఆస్కార్ అవార్డ్స్‌లో ఆ మూవీకి సిక్సర్ - బెస్ట్ విన్నింగ్ మూవీస్ ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
ఆస్కార్ అవార్డ్స్‌లో ఆ మూవీకి సిక్సర్ - బెస్ట్ విన్నింగ్ మూవీస్ ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
Oscar 2026 : ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
Sai Pallavi : మధుబాల బయోపిక్‌లో సాయి పల్లవి? - మరో బాలీవుడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్!
మధుబాల బయోపిక్‌లో సాయి పల్లవి? - మరో బాలీవుడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్!
Pawan Kalyan : నా హీరో మెగాస్టార్ - చిరు ఈవెంట్‌కు వస్తే నేను తమ్ముడినే... పవర్ స్టార్ స్పీచ్ హైలెట్స్
నా హీరో మెగాస్టార్ - చిరు ఈవెంట్‌కు వస్తే నేను తమ్ముడినే... పవర్ స్టార్ స్పీచ్ హైలెట్స్

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dubai Airport Drone Attack: ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
Hyderabad Crime News: చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
AP Cabinet Reshuffle: ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
Oscar 2026 : ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
Rythu Bharosa Funds: తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
Potti Sriramulu Statue: నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Loose Motions : వాతావరణం మారగానే విరేచనాలు అవుతున్నాయా? అయితే ఈ జాగ్రత్తలతో పాటు ఈ ఫుడ్స్ తీసుకోండి
వాతావరణం మారగానే విరేచనాలు అవుతున్నాయా? అయితే ఈ జాగ్రత్తలతో పాటు ఈ ఫుడ్స్ తీసుకోండి
Embed widget