అజీత్ బాటలో మంజు వారియర్ - ఏకంగా సూపర్ బైక్ కొనేసింది, ఎన్ని లక్షలో తెలుసా?
నిజ జీవితంలో కూడా అజిత్ నుంచి ప్రేరణ పొందినట్లే కనిపిస్తుంది మంజు వారియర్. ఎందుకంటే అజిత్ దగ్గర ఉన్నటువంటి అద్భుతమైన బైక్ మోడల్‌నే కొనుగోలు చేసింది ఈ ముద్దుగుమ్మ.
మంజు వారియర్ ఇటీవల సూపర్ స్టార్ అజిత్ కుమార్ తో కలిసి వినోద్ దర్శకత్వంలో వచ్చిన తునివులో అలరించింది. ఈ సినిమాలో ఆమె నటన అందరినీ ఆకట్టుకుంది. వీరిద్దరి కాంబినేషన్ ఎంతో మందికి నచ్చిందనే చెప్పాలి. అయితే నిజ జీవితంలో కూడా అజిత్ నుంచి ప్రేరణ పొందినట్లే కనిపిస్తుంది మంజు. ఎందుకంటే అజిత్ దగ్గర ఉన్నటువంటి అద్భుతమైన బైక్ మోడల్‌నే మంజు కూడా కొనుగోలు చేసింది ఈ ముద్దుగుమ్మ. గత నెలలో టూ వీలర్ లైసెన్స్ టెస్టుకు హాజరై వార్తల్లో నిలిచిన మంజు వారియర్, తాజాగా రూ. 21లక్షల బైక్ కొనుగోలు చేసి మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు పంచుకోగా అవి క్షణాల్లో వైరల్ గా మారాయి.
‘తునివు’ సినిమాలో అజిత్ సరసన నటించిన ఈ మలయాళీ భామ ఆయన స్ఫూర్తితో ఖరీదైన BMWR1250 GS బైక్ కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని మంజు వారియర్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో అభిమానులు మంజుకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక వీడియోలో మంజు మెరూన్ షర్ట్, బ్లాక్ ప్యాంట్ ధరించి షూస్ తో అదిరిపోయే లుక్ లో కనిపించిన తీరు.. బైక్ షోరూమ్ లోకి వెళ్లే స్టైల్.. అదిరిపోయింది అని చెప్పాలి. అందులో రెడ్ సన్ గ్లాసెస్.. మంజు లుక్ ను మరింత పెంచేశాయి అని చెప్పడంలో సందేహం లేదు. అయితే మంజు స్టైల్ కి అభిమానులు ఫిదా అయ్యారు. షో రూంలో ఉన్నవారితో మాట్లాడడం, పేపర్స్ పై సంతకం చేయడం, పసుపు రంగు హెల్మెట్ ధరించి... బైక్ తో వెళ్లిపోవడం కూల్ గా అనిపించాయి. ఇంతేకాదు తాను మంచి రైడర్ గా మారాలంటే.. ముందు చాలా దూరం వెళ్లాలి అని.. తాను రోడ్లపై సరిగ్గా డ్రైవింగ్ చేయలేకపోతే ఓపికపట్టండి అంటూ రాసుకొచ్చింది మంజు. ఇక #AK #AjithKumar Sir అని ట్యాగ్ చేసి.. అజిత్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపింది.
View this post on Instagram
బీఎండబ్ల్యూఆర్ 1250 జిఎస్ బైక్ భారతీయ మార్కెట్లో లభిస్తున్న అత్యంత ఖరీదైన బైకుల జాబితాలో ఒకటి. అజిత్ వంటి సెలబ్రిటీలు ఈ బైక్ కొనుగోలు చేశారు. బహుశా ఇంతటి ఖరీదైన బైక్ కొనుగోలు చేసిన మొదటి సినీ నటి మంజు వారియరే కావచ్చు. ఇప్పిటికే ఈమె వద్ద ల్యాండ్ రోవర్, మారుతి బాలొనొ కార్లతో పాటు మినీ కూపర్ ఎలక్ర్టిక్ కారు కూడా ఉన్నాయి. సుదూర ప్రాంతాలకు రైడింగ్ చేయడానికి ప్రత్యేకంగా ఈ బైక్స్ ను తయారుచేశారు. ఈ బైక్ ట్విన్-సిలెండర్ 1254 సిసి ఇంజన్ 134 బిహెచ్ పి పవర్ 143 ఎన్ఎమ్ టార్క్ ని జనరేట్ చేస్తుంది. ఇది 20 లీటర్ల ప్యూయెల్ ట్యాంక్ కలిగి 6స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ తో జతచేసి ఉంటుంది. డిజైన్, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ పరంగా ఈ బైక్ తనకు తానే సాటిగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.