అన్వేషించండి

Malavika Mohanan : చిరంజీవి బాబీ మూవీలో హీరోయిన్! - 'ది రాజా సాబ్' బ్యూటీ మాళవిక రియాక్షన్ ఇదే!

Chiranjeevi : చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబోలో ఓ మూవీ రాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో హీరోయిన్ తనేనంటూ వస్తోన్న రూమర్స్‌పై నటి మాళవిక మోహనన్ స్పందించారు.

Malavika Mohanan About Chiranjeevi Bobby Project : మెగాస్టార్ చిరంజీవి, 'వాల్తేరు వీరయ్య' ఫేం బాబీ దర్శకత్వంలో ఓ పవర్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ రాబోతోన్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గానే ఈ మూవీ కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేయగా భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచే పలు రూమర్స్ హల్చల్ చేస్తూనే ఉన్నాయి. ఈ మూవీలో హీరోయిన్‌గా 'ది రాజా సాబ్' బ్యూటీ మాళవిక మోహనన్ నటించనున్నారనే ప్రచారం సాగింది. తాజాగా దీనిపై ఆమె రియాక్ట్ అయ్యారు. 

అది నిజం కాదు

తాను ఈ మూవీలో హీరోయిన్ అనేది నిజం కాదని మాళవిక తెలిపారు. 'డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో రాబోతోన్న మెగా 158లో నేను యాక్ట్ చేయనున్నట్లు సోషల్ మీడియాలో వచ్చే వార్తలు అవాస్తవం. నా కెరీర్‌లో ఒక్కసారైనా చిరంజీవి గారి లాంటి అగ్ర హీరోతో నటించాలని కోరుకుంటున్నా. ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నా. కానీ, ఈ ప్రాజెక్టులో నేను భాగం కాదు. ఆ రూమర్స్‌లో ఎలాంటి నిజం లేదు.' అని క్లారిటీ ఇస్తూ ట్వీట్ చేశారు. 

Also Read : 'బాహుబలి' బిహైండ్ ద స్టోరీ - ప్రభాస్, రానా, రాజమౌళి సరదా ముచ్చట్లు... ఫుల్ ఇంటర్వ్యూ చూశారా?

హీరోయిన్ ఎవరు?

తాను నటించడం లేదని మాళవిక క్లారిటీ ఇచ్చేయడంతో ఇప్పుడు ఈ మూవీలో హీరోయిన్ ఎవరు? అనేది చర్చనీయాంశంగా మారింది. మెగాస్టార్ చిరు సరసన హీరోయిన్‌గా డైరెక్టర్ బాబీ ఎవరిని సెలక్ట్ చేస్తారా? అని సస్పెన్స్ నెలకొంది. త్వరలోనే దీనిపై మూవీ టీం క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది.

చిరు, బాబీ కాంబోలో వచ్చిన 'వాల్తేరు వీరయ్య' బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అందుకుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్టుపైనా అంతే స్థాయిలో హైప్ ఉంది. గొడ్డలి వేటుతో రక్తపు ధార కిందకు వచ్చినట్లుగా పోస్టర్ ఉండగా... ఇప్పటివరకూ చూడని ఓ డిఫరెంట్ మాస్ ఎంటర్టైనర్‌ను అందించబోతున్నట్లు అర్థమవుతోంది. బెంగాల్ నేపథ్యంలో కథ సాగనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ, లోహిత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తుండగా... త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ప్రస్తుతం చిరు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'మన శంకర వరప్రసాద్ గారు' వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. అలాగే, వశిష్ట మల్లిడి దర్శకత్వంలో 'విశ్వంభర' 2026, మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత బాబీ, శ్రీకాంత్ ఓదెల మూవీస్ లైనప్‌లో ఉన్నాయి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Main Vaapas Aaunga OTT : ఓటీటీలోకి బాలీవుడ్ బ్లాక్ బస్టర్ - దేశ విభజన మధ్య నలిగిన ప్రేమ... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి బాలీవుడ్ బ్లాక్ బస్టర్ - దేశ విభజన మధ్య నలిగిన ప్రేమ... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Cocktail 2 OTT : ఓటీటీలోకి రష్మిక లేటెస్ట్ బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి రష్మిక లేటెస్ట్ బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
Jaya Krishna : ఘట్టమనేని వారసుడి ఫస్ట్ సక్సెస్ - ఫ్యామిలీ కీలక నిర్ణయం... లెగసీ కంటిన్యూ చేసేలా...
ఘట్టమనేని వారసుడి ఫస్ట్ సక్సెస్ - ఫ్యామిలీ కీలక నిర్ణయం... లెగసీ కంటిన్యూ చేసేలా...

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 బైక్‌లే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ లిమిటెడ్ ఎడిషన్‌కు అతి భారీ డిమాండ్
కేవలం 3 నిమిషాల్లోనే అమ్ముడైన రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 X రఫ్ క్రాఫ్ట్స్ - ఏంటి దీని స్పెషాలిటీ?
Embed widget