అన్వేషించండి

Andhra Pradesh : విజయసాయి రెడ్డిపై నటి జ్యోతి సెటైర్.. ‘పెళ్ళాం ఊరెళితే’ వీడియోతో మీమ్

Actress Jyoti: ఎంపీ విజయసాయి రెడ్డి, శాంతిల వివాదం గత కొన్ని రోజులుగా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇష్యూపై నటి జ్యోతి ఓ సెటైరికల్ వీడియోని పోస్ట్ చేసింది.

Actress Jyoti: టాలీవుడ్ క్యారెక్టర్ యాక్ట్రెస్ జ్యోతి అందరికీ సుపరిచితమే. సినిమాల్లో రొమాంటిక్ కామెడీ పాత్రల్లో నటించి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. అయితే సినిమాలతో కంటే వివాదాలతోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది. తెలుగు ‘బిగ్ బాస్’ లో కంటెస్టెంట్ గా మెరిసింది. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే జ్యోతి.. తన విషయాలను నెటిజన్లతో పంచుకుంటూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ నెట్టింట సందడి చేస్తుంది. తాజాగా ఆమె తన ఇంస్టాగ్రామ్ లో ఎంపీ విజయ విజయసాయి రెడ్డిపై ఓ సెటైరికల్ వీడియోని పోస్ట్ చెయ్యడం చర్చనీయాశంగా మారింది. 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి ఇటీవల కాలంలో అనుకోని విధంగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. 67 ఏళ్ళ వయసులో ఆయనపై అక్రమ సంబందం ఆరోపణలు వచ్చాయి. తన భార్య దేవాదాయ శాఖ ఏసీ శాంతితో విజయసాయికి సంబంధం ఉందని, ఆయన కారణంగానే ఒక బిడ్డకు జన్మనిచ్చిందని మదన్‌ మోహన్‌ అనే వ్యక్తి ఆరోపిస్తున్నాడు. డీఎన్‌ఏ టెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. అయితే శాంతి మాత్రం తన మొదటి భర్తకు ఎప్పుడో విడాకులు ఇచ్చి న్యాయవాది సుభాష్‌ ను పెళ్లి చేసుకున్నట్లుగా చెబుతోంది. విజయసాయి సైతం తనపై వస్తున్న రూమర్స్ ను మీడియా ముఖంగా ఖండించారు. ఈ వివాదంలో ఇరు వర్గాలు ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో.. గత కొన్ని రోజులుగా రాజకీయ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్ గా నడుస్తోంది. 

విజయసాయి రెడ్డి, శాంతి, మదన్‌ మోహన్‌, సుభాష్‌ ల వివాదంలో నిజా నిజాల గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న తరుణంలో ఇదే ఇష్యూపై నటి జ్యోతి ఓ మీమ్ వీడియోని సోషల్ మీడియాలో పంచుకుంది. ఆమె నటించిన ‘పెళ్ళాం ఊరెళితే’ సినిమాలోని సన్నివేశాన్ని విజయసాయి రెడ్డి వివాదంతో ముడిపెడుతూ ఈ వీడియో ఎడిట్ చేయబడింది. 'మదన్ మోహన్ ఫిలిమ్స్ ప్రజంట్స్.. ఆ బిడ్డకు తండ్రెవరు?' అంటూ వచ్చిన ఈ మీమ్ ని ఎవరు ఎడిటింగ్ చేసారో తనకు తెలియదు కానీ, ఇది చాలా ఫన్నీగా ఉందని జ్యోతి క్యాప్షన్ పెట్టింది. ఇది ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. 

ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో శ్రీకాంత్, వేణు తొట్టెంపూడి, సంగీత, రక్షిత ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘పెళ్ళాం ఊరెళితే’. ఈ సినిమాలో తిలోత్తమ అనే వేశ్య క్యారక్టర్ లో నటించింది జ్యోతి. ఇందులో ఆమెది కథను మలుపుతిప్పే కీలక పాత్ర. ఓ హోటల్ లో శ్రీకాంత్, వేణు, గుండు హనుమంతరావులలో జ్యోతి ఎవరికి భార్య అనే విషయంలో బ్రహ్మానందం కన్ఫ్యూజ్ అయ్యే సన్నివేశం సినిమాలో హిలేరియస్ గా పేలింది. ఇప్పుడు అదే సీన్ ని విజయసాయి రెడ్డి, శాంతి ఇష్యూతో సింక్ చేస్తూ ఎడిట్ చేసిన వీడియోని జ్యోతి పోస్ట్ చేసింది. దీనిపై వైసీపీ అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఆమెపై నెగెటివ్ కామెంట్స్ చేయడంతో, జ్యోతి వాటిని హైడ్ చేసింది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jyoti Labala (@jyothiactress)

ఇక సినిమాల విషయానికొస్తే, 'పెళ్లాం ఊరెళితే' తర్వాత 2005లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన 'హంగామా' చిత్రంలో ఆలీకి జోడీగా నటించింది జ్యోతి. 'ఓ మై లవ్' మూవీలో ప్రధాన పాత్ర పోషించింది. ఎవడి గోల వాడిది, మహాత్మ, కాంచనమాల కేబుల్ టీవీ, గుడుంబా శంకర్, రంగ ది దొంగ, చిత్రాంగ, సాహసం సేయరా డింభకా, కెవ్వు కేక, దరువు, యముడికి మొగుడు వంటి అనేక తెలుగు చిత్రాల్లో ఆమె నటించింది. జ్యోతి ఎక్కువగా కామెడీ టచ్ ఉండే వ్యాంప్ తరహా పాత్రల్లో కనిపించింది. తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్-1లో కంటెస్టెంట్ గా పాల్గొంది. అయితే ఆమె ఫస్ట్ వీక్ లోనే ఎలిమినేట్ అయింది.

Also Read: సినిమాల్లోకి రాకముందు సూర్య ఏం చేసేవాడో తెలుసా? రూ.600 మాత్రమే జీతం - హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Embed widget