అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Jyothika Breaks Silence on Suriya's Kanguva : కంగువ నెగిటివ్ రివ్యూలపై జ్యోతిక సీరియస్.. "సూర్య వైఫ్​గా కాదు.. సినిమాను ప్రేమించే వ్యక్తిగా చెప్తున్నాను"

Jyothika Kanguva Review : కంగువ సినిమాపై వస్తున్న నెగిటివిటీపై.. జ్యోతిక రెస్పాండ్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా.. నెగిటివ్ రివ్యూలకు ఘాటైన రిప్లై ఇచ్చారు. ఆ పోస్ట్ సారాంశమిదే..

Jyothika Defends Against Negative Reviews of Kanguva : పీరియాడికల్ యాక్షన్ మూవీగా ప్రపంచవ్యాప్తంగా కంగువ నవంబర్ 14వ తేదీన విడుదలైంది. అయితే ఈ సినిమాకు మొదటి రోజునుంచే మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా మొదటి అరగంటపై ఫ్యాన్స్ కాస్త వ్యతిరేకత చూపించినా.. తర్వాత సినిమా బాగానే ఉందనే టాక్​ బయటకొచ్చింది. అయితే ఈ సినిమాపై కొందరు కావాలనే నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారంటూ.. జ్యోతిక సీరియస్ అయ్యారు. సూర్య భార్యగా కాదు.. సినీ ప్రేమికురాలిగా రాస్తున్నానంటూ.. సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు. 

జ్యోతిక ఇన్​స్టాగ్రామ్ పోస్ట్ సారాంశమిదే

I pen this note as Jyotika and a cinema lover and not actor Suriya's wife అంటూ జ్యోతిక సోషల్ మీడియాలో తన అభిప్రాయం వ్యక్తం చేశారు. "కంగువ ఓ అద్భుతమైన సినిమా. సూర్య మీరు ఈ సినిమా చేసినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమాను మీ డ్రీమ్. దానిని ధైర్యంగా ముందుకు తీసుకెళ్లినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. 

సినిమాల్లో అవి భాగమే..

అందరూ చెప్తున్నట్టుగానే.. సినిమాలో మొదటి అరగంట కాస్త వర్క్​ అవుట్ కాలేదు. సౌండ్​లో కూడా కాస్త సమస్యలు ఉన్నాయి. ఇలాంటి లోపాలు సినిమాల్లో ఓ భాగం. భారతీయ చిత్రాల్లో ఇది చాలా కామన్. ముఖ్యంగా సరికొత్తగా సినిమాలు చేయాలని ప్రయత్నించినప్పుడు ఇలాంటివి జరుగుతాయి. వాటిని ప్రయోగాల్లో భాగంగానే చూడాలి. అయితే మొదటి అరగంట సినిమాని పట్టుకుని.. తర్వాతి రెండున్నర గంటల సినిమాని నెగిటివ్ చేయడం సరికాదు. " అనే అర్థం వచ్చేలా పోస్ట్​లో రాసుకొచ్చారు. 

కావాలనే నెగిటివ్ ప్రచారం

"నిజం చెప్పాలంటే కంగువ అనేది it’s an absolute cinematic experience. కెమెరా వర్క్, దానిని ఎగ్జిక్యూట్ చేసిన విధానాన్ని నేను తమిళ సినిమాల్లో ముందెప్పుడు చూడలేదు. @vetripalanisamyని ట్యాగ్ చేస్తూ.. హ్యాట్సాఫ్🫡 ఎమోజీని జత చేశారు జ్యోతిక. అయితే కొందరు మీడియాకి చెందిన వ్యక్తులు, మరికొందరు కలిసి.. కావాలనే సినిమాపై నెగిటివ్​ రివ్యూలు ఇస్తున్నారంటూ జ్యోతిక షాక్​కి గురైనట్లు తెలిపారు. 

అలాంటి రివ్యూలు తగదు

"నెగిటివ్ రివ్యూలు చూసి నేను షాక్​ అయ్యాను. మీడియాకి చెందిన వారు.. మరికొందరు కంగువకు నెగిటివ్ రివ్యూలు ఇచ్చారు. ఈ సినిమాలో స్త్రీలను ఇబ్బంది పెట్టడం, పాత కథే చెప్పడం, డబుల్ మీనింగ్ డైలాగ్​లు లేవు. ఈ భారీ బడ్జెట్ సినిమా ఆ స్థాయికి దిగజారలేదు. దీనిలో టాప్ యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. ఇలాంటి సినిమాకి అలాంటి రివ్యూలు తగదంటూ" గట్టిగా చెప్పారు. 

పాజిటివ్​గా ఏమి రాశారు మీరు..

సినిమాకు నెగిటివ్ రివ్యూ ఇచ్చిన వాళ్లు.. దాని గురించి పాజిటివ్​గా రాయడం మరచిపోయారు. సినిమా రెండో భాగంలో స్త్రీల యాక్షన్ సీక్వెన్స్, పిల్లాడిపై చూపించిన ప్రేమ, కంగువకు జరిగిన ద్రోహం ఇలాంటి పాజిటివ్ విషయాలు అన్ని.. రివ్యూల్లో రాయడం మరిచిపోయారని అనుకుంటున్నానంటూ జ్యోతిక తెలిపారు. 

మొదటి రోజే ఇంత నెగిటివ్ టాక్?

అలాంటి రివ్యూలను చదవాలా? వినిలా? నమ్మాలా? నాకు తెలియట్లేదు. కంగువను 3D సినిమాగా రూపొందించడానికి చిత్రబృందం పడిన కష్టానికి వారికి ప్రశంసలు రావాలి. అవి రాకపోగా.. మొదటి షో అవ్వకముందే.. కొందరు కావాలనే సినిమాపై నెగిటివ్ టాక్​ని స్ప్రెడ్ చేస్తున్నారు. సినిమా విడుదలైన మొదటి రోజే ఇంత నెగిటివ్ టాక్​ని ప్రచారం చేయడం చాలా విచారించాల్సిన విషయం. 

Be proud Team Kanguva, as the ones commenting negative r doing just that and nothing else to their credit to uplift cinema! అంటూ తన పోస్ట్​ని ముగించారు జ్యోతిక. సూర్య అభిమానులు కూడా.. సూర్యలాంటి మంచి వ్యక్తిపై ఇంత నెగిటివిటీని స్ప్రెడ్ చేయడం సరికాదంటూ కామెంట్లు పెడుతూ.. పోస్ట్​ను షేర్ చేస్తున్నారు. 

Also Read : సూర్య ఫిట్​నెస్​ కంగువకు బ్లెస్సింగ్.. సీక్వెల్​కు లీడ్ ఇచ్చే పాత్రలో చేసింది ఎవరంటే - డైరక్టర్ శివ ఇంటర్వ్యూ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!ఎలక్ట్రిక్ వెహికిల్స్ పేలిపోకూడదంటే.. జాగ్రత్తలు ఇవే!Memers Celebrating Team India Bowlers | Aus vs Ind First Test లో బౌలర్ల దెబ్బ అదుర్స్ కదూ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
TGPSC Group-1 Results: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
IND vs AUS 1st Test Highlights: 20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్, ఆసీస్‌లో మొదలైన కంగారు
20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్ భాగస్వామ్యం, ఆసీస్‌లో మొదలైన కంగారు
Road Accident: అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురి మృతితో తీవ్ర విషాదం
అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురి మృతితో తీవ్ర విషాదం
Embed widget