Actress Hema: ఒక్క ఛాన్స్ ఇవ్వడంటూ హేమ కొత్త వీడియో... దేనికైనా రెడీ, కావాలంటే టెస్టులు చేయించుకోమని ఛాలెంజ్
Hema Drug Case: టాలీవుడ్ సీనియర్ నటి హేమ తాజాగా తనపై వస్తున్న వార్తల కొట్టిపారేసింది. డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవడానికి తాను సిద్ధం అంటూ ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది.
టాలీవుడ్ సీనియర్ నటి హేమ (Actress Hema) టైం ఇటీవల కాలంలో అస్సలు బాలేదు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఏ ముహూర్తాన చిక్కుకుందో గాని తన తప్పు ఏమాత్రం లేదని ఎంత చెప్పినా ఎవ్వరూ నమ్మట్లేదు. ఓవైపు మీడియాలో ఆమెపై, ఆ బెంగళూరు రేవ్ పార్టీపై వరుస కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హేమ తాజాగా ఓ వీడియోను రిలీజ్ చేసింది. అందులో తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వమని వేడుకుంటూనే మీరు టెస్టులు చేయిస్తే నేను దానికి కూడా రెడీ అంటూ ఛాలెంజ్ విసిరింది.
దేనికైనా రెడీ అంటూ ఛాలెంజ్
తాజాగా హేమ ఓ కొత్త వీడియోను రిలీజ్ చేసి ఆ బెంగళూరు రేవ్ పార్టీలో తన తప్పు ఏమాత్రం లేదని, కావాలంటే టెస్టులు కూడా చేయించుకోవడానికి తను సిద్ధమని మీడియాకి స్పెషల్ గా రిక్వెస్ట్ చేసింది. దాదాపు ఆరు నిమిషాల నిడివి ఉన్న ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన విషయంలో అసలు ఏం జరుగుతుందో చెప్తూ ఆవేదనను వ్యక్తం చేసింది. కావాలనే ఓ వర్గం మీడియా తనను టార్గెట్ చేస్తోందని చెప్పి షాక్ ఇచ్చింది. కొన్నాళ్ల క్రితం బెంగళూరులోని రేవ్ పార్టీలో హేమా దొరికిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది.. కానీ ఆ టైంలో పోలీసులలేమో హేమ పార్టీలో ఉందని చెప్తే, ఆమె మాత్రం తాను ఒక ఫామ్ లో ఉన్నానంటూ బుకాయించడానికి ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయింది. అయితే ఆ తర్వాత హేమ పార్టీలో ఉండడమే కాదు డ్రగ్స్ కూడా తీసుకుందని తేల్చి, అరెస్ట్ చేసి, కొన్నాళ్లు జైల్లో కూడా ఉంచారు. ఇక రీసెంట్ గా బెయిల్ పై బయటకు వచ్చిన హేమకు డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ వచ్చింది అంటూ వార్తలు వచ్చాయి. ఆ వార్తలు పై స్పందిస్తూ హేమా ఇప్పుడు కొత్త వీడియోను రిలీజ్ చేసింది.
Also Read: రోహిణి కమిటీపై చిన్మయి కామెంట్స్... లైంగిక వేధింపులకు పాల్పడిన వైరముత్తులను ఏం చేయలేరంటూ
ఇంకెంత కాలం వేధిస్తారు?
ఈ వీడియోలో హేమ మాట్లాడుతూ "గతంలో నాకు డ్రగ్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చిందని కొంతమంది మీడియా వాళ్ళు ప్రచారం చేశారు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. అసలు చార్జిషీట్ ఎలా ఉందో ఇంకా నేను చూడలేదు. నేనే చూడనప్పుడు ఆ చార్జిషీట్ మీ చేతికి ఎలా వచ్చింది? ఇలాంటి న్యూస్ ను ఎందుకు ప్రచారం చేస్తున్నారో అర్థం కావట్లేదు. కావాలంటే నేను మీ దగ్గరికి రావడానికి రెడీగా ఉన్నాను. మీరు టెస్ట్ లు చేయిస్తానంటే దానికి కూడా సిద్ధమే. ఒకవేళ పాజిటివ్ వస్తే ఎవరు ఏ శిక్ష వేసినా నేను భరిస్తాను. కానీ నెగటివ్ వస్తే మీ మీడియా పెద్దలు అందరూ కలిసి ఏం చేస్తారో మీరే నిర్ణయం తీసుకోండి" అంటూ పేరు పేరునా ప్రతి టీవీ ఛానల్ కు సంబంధించిన పెద్దలను కోరింది హేమ. అంతేకాకుండా ఈ న్యూస్ వల్ల తన తల్లికి యాంగ్జైటి రావడంతో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నామని, తను పరువు కోసం చచ్చిపోతానని, తన కుటుంబం, ఇండస్ట్రీ తల దించుకునే పనిని ఇప్పటివరకు ఎప్పుడూ చేయలేదని చెప్పుకొచ్చింది హేమ. "ఇలాంటి న్యూస్ ప్రచారం చేసే ముందు ఎక్కడికి రమ్మన్నా నేను రావడానికి రెడీగా ఉన్నాను. నాకు టెస్టులు చేసి ఆ తర్వాత మాట్లాడండి" అని హేమ తను మాట్లాడిన ఆ వీడియోను తన ఇన్ స్టాలో షేర్ చేసింది.
Also Read: జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపులు, రేప్ కేసు - 21 ఏళ్ల అమ్మాయి కేసు పెట్టడంతో...