Actor Vijay salary: ఓ మై గాడ్, విజయ్ ఆ మూవీకి అంత రెమ్యునరేషన్ అడిగాడా? ఇండియాలోనే సరికొత్త రికార్డ్!
విజయ్ దళపతి, వెంకట్ ప్రభు కాంబోలో ఓ సినిమా తెరకెక్కబోతోంది. ఈ మూవీ కోసం విజయ్ కనీవినీ ఎదరుని రీతిలో రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారట. ఇండియా ఇప్పటి వరకు ఏ స్టార్ ఇంత పారితోషికం తీసుకోలేదట.
కోలీవుడ్ లో ఓ క్రేజీ కాంబినేషన్ లో ప్రతిష్టాత్మక చిత్రం రూపొందబోతోంది. హీరో విజయ్ దళపతి, దర్శకుడు వెంకట్ ప్రభు కాంబోలో ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం విజయ్ ‘లియో’ చిత్రంలో నటిస్తున్నారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్, అర్జున్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
విజయ్ రెమ్యునరేషన్ రూ. 200 కోట్లు
విజయ్ కోసం పలు నిర్మాణ సంస్థలు, దర్శకులు ఎదురుచూస్తున్నారు. అయితే, వెంకట్ ప్రభుతో సినిమా చేసేందుకు విజయ్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం విజయ్ రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇండియాలో ఇప్పటి వరకు ఏ స్టార్ హీరో కూడా తీసుకోనంత రెమ్యునరేషన్ అందుకోబోతున్నారు. తాజా నివేదికల ప్రకారం ఆయన ఈ చిత్రం కోసం ఏకంగా రూ. 200 కోట్లు తీసుకుంటున్నారట. గత దశాబ్ద కాలంలో విజయ్ స్టార్ డమ్ కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన కెరీర్ అత్యుత్తమ దశలో ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి చిత్రానికి సుమారు రూ.100 కోట్లు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తదుపరి చిత్రంతో రెమ్యునరేషన్ విషయంలో కొత్త రికార్డు నెలకొల్పబోతున్నట్లు సమాచారం. AGS ఎంటర్‌టైన్‌మెంట్స్ మొత్తం రూ.300 కోట్లతో ఈ సినిమా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం విజయ్ సినిమాలకు ఇండియాతో పాటు ఓవర్సీస్ లోనూ మంచి బిజినెస్ జరుగుతోంది. కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాది రాష్ట్రాల సినిమా మార్కెట్లో ఆయనకు గణనీయమైన క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన తన తదుపరి సినిమా కోసం రూ. 200 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. చిత్రాలే కాకుండా, విజయ్ కి కొన్ని బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు కూడా ఉన్నాయి. వీటి ద్వారా తను ఏడాదికి రూ. 10 కోట్ల వరకు సంపాదిస్తున్నారు. పలు నివేదికల ప్రకారం విజయ్ నికర ఆస్తుల విలువ రూ.445 కోట్లుగా ఉంది.
‘లియో’ షూటింగ్ లో విజయ్ బిజీ
ప్రస్తుతం విజయ్, లోకేష్ కనగరాజ్ తో కలిసి ‘లియో’ అనే సినిమా చేస్తున్నారు. ఇందులో త్రిష, సంజయ్ దత్, అర్జున్, ప్రియా ఆనంద్ సహా పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. ‘లియో’ చిత్రం ఈ ఏడాది అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రానికి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవి చంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విజయ్ తో కలిసి ఆయన మూడు సినిమాలు చేశాడు. 'కత్తి', 'మాస్టర్', 'బీస్ట్' సినిమాలకు అద్భుత సంగీతం అందించాడు. ఈ మూడు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. తాజాగా నాలుగో సినిమాకు కూడా ఆయన సంగీతం అందించబోతున్నారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇక వెంకట్ ప్రభు తాజాగా అక్కినేని నాగ చైతన్యతో కలిసి ‘కస్టడీ’ అనే ద్విభాష చిత్రాన్ని తెరకెక్కించారు. తెలుగు, తమిళ భాషల్లో తాజాగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలింది.
Also Read : 'అన్నీ మంచి శకునములే' రివ్యూ : 'సీతారామం' నిర్మాతలు తీసిన సినిమా - సంతోష్ శోభన్‌కు హిట్ వస్తుందా?