అన్వేషించండి

venu about pawankalyan: నాలోని యాక్టర్‌ని గుర్తించింది పవన్‌కల్యాణ్: బలగం వేణు

Balagam Venu: ఒకప్పుడు కేవలం కమెడియన్‌గానే అందరికీ తెలిసిన వేణులో మంచి నటుడు కూడా ఉన్నాడు. సీరియస్‌ పాత్రల్లో, ఎమోషన్స్‌ పండించడంలో వేణు మంచిపేరు తెచ్చుకున్నాడు

Balagam Venu: వేణు ఎలుదండి.. ఇలా చెప్తే ఆయన్ను ఎవ్వరూ గుర్తుపట్టరు. 'బలగం' వేణు అంటే ఇట్టే గుర్తపడతారు. జబర్దస్త్‌ వేణు అంటే ఓ మాకు ఎందుకు తెలియదు అంటారు. మొదట కమెడియన్‌గా పరిచయం అయిన వేణు అనూహ్యంగా, అంచనాలకు మించి 'బలగం' సినిమా తీసి ఇండస్ట్రీలో ఫేమస్‌ డైరెక్టర్‌, రైటర్‌ అయిపోయాడు. అయితే, ఒకప్పుడు కేవలం కమెడియన్‌గానే అందరికీ తెలిసిన వేణులో మంచి నటుడు కూడా ఉన్నాడు. సీరియస్‌ పాత్రల్లో, ఎమోషన్స్‌ పండించడంలో వేణు మంచిపేరు తెచ్చుకున్నాడు. అయితే, తనలోని యాక్టింగ్‌ని గుర్తించింది మాత్రం పవన్‌కల్యాణ్‌ అని చెప్తున్నారు ఆయన. వేణు ఈ మధ్యకాలంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన పవన్‌ కల్యాణ్‌ గురించి, ఆయన తనను ఎలా ఎంకరేజ్‌ చేశారనే దాని గురించి గుర్తుచేసుకున్నారు.

సర్దార్‌గబ్బర్‌సింగ్‌లో మంచి రోల్‌.. 

పవన్‌ కల్యాణ్‌ చాలా గొప్ప వ్యక్తి అని, ప్రతిది చాలా బాగా గమనిస్తారని చెప్పారు వేణు. బలగం సినిమా తర్వాత ఆయన్ను కలిసే ఛాన్స్‌ దగ్గర వరకు వచ్చిపోయిందని, డెఫనెట్‌గా త్వరలో మళ్లీ కలుస్తానని చెప్పారు వేణు. ఇక తనకు మంచి లైఫ్‌ ఇచ్చింది వపన్‌కల్యాణ్‌ అని, తనలో ఒక యాక్టర్‌ ఉన్నాడని గుర్తించి మంచి ఛాన్స్‌ ఇచ్చింది ఆయనే అని చెప్పారు. 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'లో మంచి పాత్ర ఇచ్చారని అన్నారు వేణు. సినిమా మొత్తంలో ఆయనతో ఉంటానని, క్లైమాక్స్‌లో కూడా మంచి రోల్‌ ఉందని గుర్తుచేసుకున్నారు వేణు. 

'అత్తారింటికి దారేది' షూటింగ్‌ అయ్యాక ఫొటో దిగేందుకు వెళ్లినప్పుడు నన్ను గుర్తుపట్టారని, "నువ్వు యాడ్స్‌లో చేశావు కదా? ఒగు కథ చేశారు కదా.. ఆ సీన్‌లో ఉన్నావు కదా?" అని తన గురించి చాలా చిన్న విషయాలు కూడా గుర్తుంచుకున్నారని, ఆయన ప్రతీది అలా ఫాలో అవుతారని, అది పవన్‌కల్యాణ్‌ గొప్పతనం అని చెప్పారు వేణు. చాలామంది టాలెంట్‌ ఉంది అని అనేవాళ్లే తప్ప ఛాన్స్‌ ఇవ్వరని, కానీ పవన్‌కల్యాణ్‌ మాత్రం ఛాన్స్‌ ఇచ్చారని, కచ్చితంగా "నువ్వు గొప్ప నటుడివి, గొప్పవాడివి అవుతావు వేణు" అని ఆశీర్వదించినట్లు చెప్పారు.

పవన్‌ సినిమా అంటే ఒక పండగ

పవన్‌కల్యాణ్‌కి తాను పిచ్చ ఫ్యాన్‌ అని, ఆయన సినిమాలంటే పెద్ద పండుగలా చేసుకుంటామని చెప్పారు వేణు. పవన్‌కల్యాణ్‌ సినిమాకి వెళ్తున్నామంటే పొద్దున నుంచే కూర్చుని బస్తాలు, బస్తాలు పేపర్లు చింపేవాళ్లము అని గుర్తుచేసుకున్నారు. పవన్‌కల్యాణ్‌ సినిమాకి వెళ్తే అరుస్తూనే ఉంటామని, ఎంజాయ్‌ చేస్తామని అందుకే, అరవాలంటే ఎనర్జీ కోసం రెండు పెగ్గులు వేసుకుని వెళ్తానని అన్నారు వేణు. "పవన్‌కల్యాణ్‌ పవర్‌కి, మీ పెన్‌ పవర్‌ కలిసే రోజు వస్తుందా?" అని అడిగిన ప్రశ్నకు వేణు ఇలా సమాధానం చెప్పారు. ఆరోజు వస్తే చాలా హ్యాపీ అని, మంచి సినిమా తీస్తానని చెప్పారు ఆయన. దేవుడు దయవల్ల ఆ ఛాన్స్‌ వస్తే, కచ్చితంగా ఆ అవకాశాన్ని వినియోగించుకుంటానని చెప్పారు. 

Also Read: 11వ రోజు ‘హనుమాన్’‌కు షాక్, ఎంత వసూలు చేసిందంటే?

కమెడియన్‌గా  కెరీర్‌ స్టార్ట్‌ చేసిన వేణు.. ఆ తర్వాత ఎన్నో కామెడీ క్యారెక్టర్లు చేశాడు. జబర్దస్త్‌లో ఎన్నో స్కిట్లు చేసి నవ్వించాడు. అలాంటిది ఒక్కసారిగా 'బలగం' అనే ఫ్యామిలీ సెంటిమెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆ సినిమాకి డైరెక్టర్‌గా గొప్ప సక్సెస్‌ సాధించాడు వేణు. ఫ్యామిలీ ఆడియెన్స్‌కి కనెక్ట్‌ అయిపోయాడు.      

టాప్ హెడ్ లైన్స్

Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
Ram Charan Irumudi: రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
Balakrishna Koratala Siva Movie: కొరటాలతో బాలకృష్ణ సినిమా ఆగిందా? యూనిట్ ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే?
కొరటాలతో బాలకృష్ణ సినిమా ఆగిందా? యూనిట్ ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే?
Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
Ram Charan Irumudi: రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Embed widget