By: ABP Desam | Updated at : 07 Jun 2023 06:57 PM (IST)
Image Credit:Svcc Official/Instagram
Gandeevadhari Arjuna: కెరీర్ మొదట్నుంచీ విభిన్నమైన కథలను ఎంచుకొని సినిమాలలోని తన నటనతో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. గతేడాది ‘ఎఫ్ 3’ లాంటి కామెడీ ఎంటర్టైనర్ మూవీతో వచ్చిన వరుణ్ ఈసారి ఫుల్ యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆయన తాజాగా నటించిన చిత్రం ‘గాంఢీవధారి అర్జున’. ఈ సినిమాకు టాలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. తాజాగా మూవీ నుంచి రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ టీజర్ ను విడుదల చేసింది మూవీ టీమ్. ఈ వీడియోకి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైన్ మూవీగా తెరకెక్కిన ‘గాంఢీవధారి అర్జున’ సినిమా ఆగస్ట్ 25 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు టీజర్ వీడియోతో అధికారికంగా ప్రకటించారు మేకర్స్.
ప్రస్తుతానికి ‘గాంఢీవధారి అర్జున’ చిత్ర బృందం విదేశాల్లో షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. అక్కడ భారీ యాక్షన్ ఎపిసోడ్ లను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ స్టైలిష్ లుక్ లో కనిపించనున్నాడట. యాక్షన్ సీక్వెన్స్ కూడా హైలైట్ గా నిలుస్తాయని చిత్ర బృందం చెబుతోంది. ఈ మూవీ వరుణ్ తేజ్ ఇప్పటి వరకూ నటించిన సినిమాలన్ని కంటే ఎక్కువ బడ్జెట్ సినిమా ఇదేనట. ఇందులో యాక్షన్స్ సీన్స్ టెక్నికల్ హై స్టాండర్డ్స్ తో మెప్పించనున్నాయి. వరుణ్ తేజ్ ను ఇప్పటి వరకూ చూడని స్టైలిష్ లుక్ చూడొచ్చని అంటున్నారు. ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారట. ఇప్పటికే ప్రవీణ్ సత్తారు గతేడాది నాగార్జున హీరోగా ‘ది గోష్ట్’ సినిమాను తెరకెక్కించారు. ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. మరి ఈ మూవీతో ప్రవీణ్ ప్రేక్షకులను ఎంత మేరకు ఆకట్టుకుంటాడో చూడాలి. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్. ప్రసాద్ నిర్మిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మిక్కి జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలకు వరుణ్ తేజ్ హాట్ కేక్ లా కనిపిస్తున్నారు. వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి లవ్ స్టోరీ గురించి నెట్టిం వార్తల వర్షం కురుస్తోంది. వరుణ్-లావణ్య లవ్ లో ఉన్నారని త్వరలోనే వారిద్దరూ ఎంగేజ్మెంటం చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. జూన్ 9 న ఇద్దరూ కుటుంబ పెద్దల సమక్షంలో నిశ్చితార్థం చేసుకోనున్నారని ఆ వార్తల సారాంశం. అయితే ఈ వార్తలపై వరుణ్ తండ్రి నాగబాబు స్పందించారు. ఈ ఏడాదే వరుణ్ కు పెళ్లి చేస్తామని కానీ అమ్మాయి ఎవరు అనేది తొందరలో చెప్తాము అంటూ ఇరకాటంలో పెట్టేశారు. దీంతో వరుణ్ చేసుకోబోయే అమ్మాయి లావణ్యనే అంటూ ఫిక్స్ అయిపోయారు మెగా ఫ్యాన్స్. దానికితోడు వరుణ్-లావణ్య ఇద్దరూ కూడా విడివిడిగా హాలిడే ట్రిప్ లకు వెళ్లారు. దీంతో ఇద్దరూ కలసే వెళ్లారంటూ ఇండియా తిరిగి రాగానే నిశ్చితార్థం అంటూ పుకార్లు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే..
Read Also : సాయిపల్లవి సీతగా మరో ‘రామాయణం’ - కీలక పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరోస్, కానీ..
Meenakshi Chaudhary: మీనాక్షీ చౌదరి, ఊర్వశి రౌటేలా - బాలకృష్ణతో గ్లామర్ గాళ్స్ ఇద్దరూ...
Venu Swamy: వరుణ్ తేజ్, లావణ్య కలిసుండే అవకాశాల్లేవ్ - వాళ్ళిద్దరి జాతకాలపై వేణు స్వామి సంచనల వ్యాఖ్యలు
Sandeep Reddy Vanga: వర్మ ‘యానిమల్’ రివ్యూపై స్పందించిన సందీప్ - కొన్ని విషయాలు పక్కన పెట్టాల్సిందే!
Rajashekar : జీవిత, జీవితం రెండు ఒక్కటే అనేది డైలాగ్ మాత్రమే - బయట వేరేవిధంగా ఉంటుంది: రాజశేఖర్
Animal: ఆ స్టార్ హీరో ఇంట్లో ‘యానిమల్’ మూవీ షూటింగ్ - డీకోడ్ చేసిన నెటిజన్లు!
Michaung Cyclone Effect In AP: మిగ్‌జాం తుపాను ధాటికి ఏపీ కకావికలం- బోరుమంటున్న రైతులు
Telangana CM Revanth Reddy: సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి తొలి ట్వీట్ చూశారా! వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు
Telangana New Cabinet: 18 మంత్రి పదువుల కోసం 30 మంది నేతల పోటీ - జట్టు కూర్పుపై రేవంత్ కసరత్తు
నేను అమ్ముడుపోయానా..? రేవంత్ రెడ్డి ఎమోషనల్...!
/body>