Thalapathy Vijay Net Worth: కళ్లు చెదిరే బంగళా, లగ్జరీ కార్లు, దళపతి విజయ్ ఆస్తుల విలువెంతో తెలుసా?
Thalapathy Vijay Net Worth: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ‘తమిళగ వెట్రి కళగం’ పేరుతో కొత్త పార్టీని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన ఆస్తులు, అంతస్తుల గురించి తెలుసుకుందాం..
Thalapathy Vijay Net Worth: దళపతి విజయ్ అసలు పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. చిన్నప్పటి నుంచే తనకు సినిమాల పట్ల మక్కువ ఎక్కువగా ఉండేది. తండ్రి ప్రోత్సాహంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆయన సౌత్ లో స్టార్ హీరోగా ఎదిగారు. ప్రస్తుతం దక్షిణాదిలో అత్యంత డిమాండ్ ఉన్న నటులలో ఆయన ఒకరు. అశేష అభిమానులతో దళపతి విజయ్ గా మారారు. ప్రస్తుతం రాజకీయ పార్టీని స్థాపించి ప్రజల్లోకి అడుగు పెట్టారు.
బాల నటుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ
వాస్తవానికి విజయ్ చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అతడి తండ్రి చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన ‘వెట్రి’(1984) చిత్రంలో బాల నటుడిగా పరిచయం అయ్యారు. కొంతకాలం పాటు చైల్డ్ ఆర్టిస్టుగా కొనసాగారు. 18 ఏండ్ల వయసులో తన తండ్రి దర్శకత్వంలోనే ‘నాలయ్య తీర్పు’(1992)తో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. 1996లో వచ్చిన ‘పూవే ఉనక్కగా’ అనే రొమాంటిక్ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత విజయ్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ‘తిరుమల’(2003), ‘గిల్లి’(2004), ‘తిరుపాచి’(2005), ‘శివకాశి’(2005), ‘పొక్కిరి’(2007), ‘సుర’(2010), ‘తలైవా’(2013) లాంటి చిత్రాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘జిల్లా’(2014) సినిమా అతడి కెరీర్ కు టర్నింగ్ పాయింట్ గా మారింది. ‘కత్తి’(2014), ‘తేరి’(2016), ‘మెర్సల్’(2017), ‘సర్కార్’(2018), ‘బిగిల్’(2019), ‘మాస్టర్’ (2021), ‘బీస్ట్’(2022), ‘లియో’(2023) చిత్రాలు అత్యధిక వసూళ్లను సాధించాయి.
రూ.500 రెమ్యునరేషన్ తో కెరీర్ ప్రారంభం
విజయ్ తన తొలి చిత్రం ‘వెట్రి’లో నటనకు గాను రూ. 500 రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఒక్కో సినిమాకు తన పారితోషికం పెంచుకుంటూ వెళ్లారు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. 100 కోట్లకు పైనే వసూళు చేస్తున్నారు. అత్యంత ధనవంతులైన ఇండియన్ సినీ స్టార్స్ ఫోర్బ్స్ లిస్టులో విజయ్ చోటు సంపాదించుకున్నారు. విజయ్ వార్షిక ఆదాయం అతని వార్షిక ఆదాయం సుమారు 5.4 మిలియన్లు (రూ.45 కోట్లు). ఆయన నెల వారీ ఆదాయం 360,146 డాలర్లు (రూ.3 కోట్లు). బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ తో కూడా భారీగానే సంపాదిస్తున్నారు.
విలాసవంతమైన సముద్రతీర బంగ్లా
విజయ్ చెన్నైలోని నీలంకరై పరిసరాల్లోని క్యాజురినా వీధిలో విలాసవంతమైన సముద్రతీర బంగ్లాలో నివసిస్తున్నారు. విజయ్ ఇల్లు టామ్ క్రూజ్ బీచ్ హౌస్ నుంచి ప్రేరణపొంది నిర్మించినట్లు తెలుస్తోంది. దీని విలువ సుమారు రూ. 80 కోట్లు ఉంటుంది. తిరువళ్లూరు, తిరుపోరూర్, తిరుమజిసై, వండలూరులో రూ.100 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది.
లగ్జరీ కార్ కలెక్షన్
Audi A8, BMW సిరీస్ 5తో సహా పలు లగ్జరీ కార్లు విజయ్ గ్యాలరీలో ఉన్నాయి. BMW X6, BMW 7-సిరీస్, ఫోర్డ్ మస్టాంగ్, మినీ కూపర్ ను కూడా ఆయన కొనుగోలు చేశారు. వీటితో పాటు రెగ్యులర్ వాడకం కోసం మరికొన్ని కార్లు కొనుగోలు చేశారు. ఇక విజయ్ దగ్గర రూ. 90 లక్షల విలువైన పటేక్ ఫిలిప్ వాచ్ ఉంది.
Read Also: వివాదాలకు చిరునామా పూనమ్ పాండే, ఆమె కెరీర్‌లో టాప్ 10 కాంట్రవర్సీలు ఇవే