అన్వేషించండి

Sai Pallavi: సాయిప‌ల్లవిలో దేవ‌త ల‌క్ష‌ణాలు లేవు.. సీత‌గా ప‌నికిరాదు: బుల్లితెర ‘లక్ష్మణుడు’ విమర్శలు

Sai Pallavi: 'రామాయ‌ణ' ఈ ప్రాజెక్ట్ లో రాముడిగా ర‌ణ్ బీర్ క‌పూర్, సీత‌గా సాయిప‌ల్ల‌వి న‌టిస్తున్నారు. సాయిప‌ల్ల‌వి క్యారెక్ట‌ర్ గురించి ల‌క్ష్మ‌ణుడి పాత్ర వేసిన న‌టుడు సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.

Actor Sunil Lahri Sensational Comments About Sai Pallavi: సాయి ప‌ల్ల‌వి నేచుర‌ల్ బ్యూటీ. నేచుర‌ల్ గా ఉండ‌ట‌మే కాదు అంటే స‌హ‌జంగా న‌టిస్తారు కూడా. అలా ఆమె న‌ట‌న‌తో, సింప్లిసిటీతో ఎంతోమంది అభిమానుల‌ను సంపాదించుకున్నారు. ఇప్పుడిక 'రామాయ‌ణ' ప్రాజెక్ట్ లో సీత‌గా న‌టిస్తున్నారు సాయిప‌ల్లవి. అయితే, ఆమె సీత‌గా న‌టించ‌డంపై ల‌క్ష్మ‌ణుడి పాత్ర‌లో న‌టించిన బాలీవుడ్ న‌టుడు సునీల్ లాహ్రీ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. దీంతో ఇప్పుడు సాయిప‌ల్లవి ఫ్యాన్స్ అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. అస‌లు ఏమ‌న్నారంటే? 

ర‌ణ్ బీర్ ఓకే.. కానీ, చూడ‌లేరేమో.. 

'రామాయ‌ణ' ప్రాజ‌క్ట్ కి సంబంధించి షూటింగ్ మొద‌లైపోయింది. దానికి సంబంధించి కొన్ని ఫొటోలు కూడా లీక్ అయ్యాయి. ర‌ణ్ బీర్ రాముడిగా న‌టిస్తున్నారు ఈసినిమాలో. ఆయ‌న క్యారెక్ట‌ర్ లుక్ పై ఒక ఇంట‌ర్వ్యూలో కామెంట్ చేశారు లాహ్రీ. రాముడిగా ర‌ణ్ బీర్ క‌పూర్ చాలా అందంగా ఉన్నార‌ని, ఆయ‌న బాగా సూట్ అయ్యార‌ని అన్నారు. అయితే, ‘యానిమ‌ల్’ సినిమాలో ర‌ణ్ బీర్ ని అలా చూసిన ప్రేక్ష‌కులు రాముడిగా చూడ‌లేరేమో అని త‌న అభిప్రాయం చెప్పారు. 

దేవ‌త ల‌క్ష‌ణాలు లేవు.. 

ఈ సినిమాలో సాయి ప‌ల్ల‌వి సీత‌గా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే, ఆమ ఆ క్యారెక్ట‌ర్ చేయ‌డంపైన కూడా లాహ్రీ కామెంట్స్ చేశారు. ఆమె యాక్టింగ్ తాను ఎప్పుడూ చూడ‌లేద‌ని, ఆమె న‌టించిన సినిమా ఒక్క‌టి చూడ‌లేదు కాబ‌ట్టి న‌ట‌న గురించి తానేమీ కామెంట్ చేయ‌ను అన్నాడు. కానీ, ఆమెకు దేవ‌త ల‌క్ష‌ణాలు లేవ‌ని, సీత‌గా ఆమె బాగుండ‌ద‌ని, సూట్ కాద‌ని చెప్పాడు. దీంతో సాయి ప‌ల్ల‌వి ఫ్యాన్స్ లాహ్రీపై కోపంతో ఊగిపోతున్నారు. 

లీకుల బెడ‌ద‌.. 

'రామాయ‌ణ' ప్రాజెక్ట్ చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్నారు. ఈ మ‌ధ్యే దానికి సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభించారు. అయితే, షూటింగ్ మొద‌లైన రోజు నుంచి సెట్స్, షూటింగ్, క్యారెక్ట‌ర్స్ కి సంబంధించిన ఫొటోలు బ‌య‌టికి వ‌స్తూనే ఉన్నాయి. దీంతో షూటింగ్ స్పాట్ ని నో ఫోన్ జోన్ గా ప్ర‌క‌టించారు. ఈ సినిమాను నిర్మించేందుకు ముందుకొచ్చిన నిర్మాతలు.. ఆ తర్వాత ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేశారు. దీంతో మరో నిర్మాణ సంస్థ ఆ బాధ్యతలు తీసుకుంది.

సాయి ప‌ల్ల‌వి ప్లేస్ లో జాన్వీ క‌పూర్.. 

'రామాయ‌ణ' ప్రాజెక్ట్ మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఈ సినిమాకి సంబంధించి ఏదో ఒక రూమ‌ర్ బ‌య‌టికి వ‌స్తూనే ఉంది. దాంట్లో భాగంగా సాయిప‌ల్ల‌విని సీత‌గా తొల‌గించిన ఆమె ప్లేస్ లో జాన్వీ క‌పూర్ ని తీసుకున్నార‌నే వార్త విప‌రీతంగా వైర‌ల్ అయ్యింది. ఆ క్యారెక్ట‌ర్ కి ముందు అలియా భ‌ట్ ని అనుకున్నార‌ని, ఆమె డేట్స్ కుద‌ర‌క సాయిప‌ల్ల‌విని ఫిక్స్ చేశార‌నే వార్త కూడా బ‌య‌టికి వ‌చ్చింది. ఇక ఈ సినిమాలో కేజీఎఫ్ స్టార్ య‌ష్, విజ‌య్ సేతుప‌తి త‌దిత‌రులు న‌టిస్తున్న‌ట్లు కూడా వార్త‌లు బ‌య‌టికి వ‌చ్చాయి. అయితే, ఈ విష‌యాల‌పై మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు మూవీ టీమ్ క్లారిటీ ఇవ్వ‌లేదు.

Also Read: ‘క‌ల్కీ 2898 AD’పై ఆర్జీవీ కామెంట్స్.. ఈ పజిల్ పూర్తి చేస్తే రూ.లక్ష ఇస్తారట, మీరు సిద్ధమేనా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Adilabad Crime News: బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
2025 Apple Launching Products: 2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడుశ్రీతేజ్‌ హెల్త్‌‌ బులెటిన్ రిలీజ్, బిగ్ గుడ్ న్యూస్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Adilabad Crime News: బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
2025 Apple Launching Products: 2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Credit Card Safety Tips: మీ క్రెడిట్ కార్డు డిటైల్స్ సేఫ్‌గా ఉంచాలనుకుంటున్నారా? - ఆన్‌లైన్ షాపింగ్‌లో ఇలా అస్సలు చేయకూడదు!
మీ క్రెడిట్ కార్డు డిటైల్స్ సేఫ్‌గా ఉంచాలనుకుంటున్నారా? - ఆన్‌లైన్ షాపింగ్‌లో ఇలా అస్సలు చేయకూడదు!
Aus VS Ind Series: ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
Fuel Filling Tips: బైక్ లేదా పెట్రోల్‌ను ట్యాంక్ ఫుల్ చేస్తున్నారా? - అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
బైక్ లేదా పెట్రోల్‌ను ట్యాంక్ ఫుల్ చేస్తున్నారా? - అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
Embed widget