News
News
X

Chandramukhi 2 Movie: ‘చంద్రముఖి-2’లో శత్రు కీలక పాత్ర - కొత్త లుక్ కోసం మేకప్ షురూ!

నటుడు శత్రు ‘చంద్రముఖి 2’లో కీలక పాత్ర పోషించబోతున్నారు. తాజాగా ఆయన ఈ మూవీ షూటింగ్ సెట్ లో అడుగు పెట్టారు. ఈ మేరకు తొలి ఫోటోను అభిమానులతో పంచుకున్నారు.

FOLLOW US: 
Share:

వాసు దర్శకత్వంలో రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ లీడ్ రోల్స్ చేస్తున్న తాజా సినిమా ‘చంద్రముఖి 2’. 2005లో విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘చంద్రముఖి’ సినిమాకు సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెకుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాలో నటుడు శత్రు కీలకపాత్ర పోషించబోతున్నారు. రీసెంట్ గా ఈ మూవీ షూటింగ్ సెట్ లోకి ఆయన అడుగు పెట్టారు. ఈ విషయాన్ని చెప్తూ ఓ ఫోటోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

సంచలన విజయాన్ని సాధించిన ‘చంద్రముఖి’

2005లో విడుదలైన ‘చంద్రముఖి’ సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్, జ్యోతిక నటించారు. ఈ సినిమాలో చంద్రముఖిగా జ్యోతిక కనబర్చిన నటనకు అప్పట్లో ప్రేక్షకులు మంత్రముగ్దులయ్యారు. గంగ అనే క్యారెక్టర్ లో చాలా అమాయకంగా కనిపిస్తూనే చంద్రముఖి అనే భయానక పాత్రలో నటించి మెప్పించింది. చంద్రముఖిగా ఆమె డ్యాన్సును చూసి.. ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకున్నాయి.  అప్పట్లో రూ. 9 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ. 70 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. చంద్రముఖి మలయాళ మూవీ ‘మణిచిత్రతాజు’ను, అక్షయ్ కుమార్ హీరోగా హిందీలో ‘భూల్ భులయ్యా’గా రీమేక్ చేశారు. ఈ సినిమా కూడా అక్కడ బాగానే ఆడింది.   

‘చంద్రముఖి-2’లో కంగనా, లారెన్స్ లీడ్ రోల్స్

ఈ సినిమాలో తొలుత చంద్రముఖి క్యారెక్టర్ కోసం జ్యోతికను తీసుకుంటారని అందరూ భావించారు. కానీ, దర్శకుడు వాసు మాత్రం కంగనా రనౌత్ ను ఓకే చేశారు. ‘చంద్రముఖి 2’లో చంద్రముఖి టైటిల్ రోల్‌లో ఆమె నటించనుంది. ఈ సినిమాలో కంగనా.. రాజు ఆస్థానంలో ప్రముఖ నర్తకి పాత్రలో కనిపించనుంది. కంగనా రనౌత్ సరసన ప్రముఖ దర్శకుడు, నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ నటిస్తున్నాడు.  

గత డిసెంబర్ లో ప్రారంభమైన షూటింగ్  

‘చంద్రముఖి-2’ తొలి షెడ్యూల్ గత డిసెంబర్ లో మొదలయ్యింది. కంగనా తన  ‘ఎమర్జెన్సీ’  మూవీ కోసం కొంత విరామం తీసుకుంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ముగియడంతో ఆమె ‘చంద్రముఖి-2’లో నటిస్తోంది. ఈ చిత్రాన్ని  లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.  

నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శత్రు

శత్రు తెలుగులో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. రామ్ చరణ్ హీరోగా నటించిన ‘రంగస్థలం’ సినిమాతో బాగా పాపులర్ అయ్యాడు. ఈ సినిమా మొదట్లో హీరోతో గొడవపెట్టుకుని శత్రువుగా కనిపిస్తాడు. కానీ నెమ్మదిగా మారుతూ వస్తాడు. చివరకు మంచివాడుగా మారి ప్రెసిడెంట్ ఎన్నికల్లో హీరోకి, ఆయన అన్నకు మద్దతు పలుకుతాడు. ఈ పాత్రలో శత్రు అద్భుత నటన కనబర్చారు. ఆయన యాక్టింగ్ కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అటు ‘కృష్ణాగాడి వీర ప్రేమగాథ’ సినిమాతో మంచి బ్రేక్ అందుకున్నాడు. ‘బాహుబలి-2’, ‘లెజెండ్’, ‘ఆగడు’ లాంటి సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు. తాజాగా తమిళ హీరో కార్తీ తో కలిసి ఓ సినిమా చేశాడు.  

Read Also: ‘బాహుబలి’ ఆడిషన్‌లో రాశీ ఖన్నా - రాజమౌళికి నచ్చినా, ఆ కారణంతో ఛాన్స్ ఇవ్వలేదట!

Published at : 09 Mar 2023 10:55 AM (IST) Tags: Chandramukhi 2 Movie actor shatru chandramukhi 2 movie shooting

సంబంధిత కథనాలు

Kota Srinivasa Rao : డబ్బు కోసం మనిషి ప్రాణాలతో ఆడుకోవద్దు - మరణ వార్తపై కోట శ్రీనివాస రావు సీరియస్

Kota Srinivasa Rao : డబ్బు కోసం మనిషి ప్రాణాలతో ఆడుకోవద్దు - మరణ వార్తపై కోట శ్రీనివాస రావు సీరియస్

టాలీవుడ్‌‌లోకి బాలీవుడ్ బ్యూటీలు, తెలుగులో పాగా వేసేదెవరు?

టాలీవుడ్‌‌లోకి బాలీవుడ్ బ్యూటీలు, తెలుగులో పాగా వేసేదెవరు?

Pawan Kalyan's Ustad Bhagat Singh : పవన్ కళ్యాణ్ జోడీగా మలయాళ భామ - ప్రభాస్ సినిమా తర్వాత!

Pawan Kalyan's Ustad Bhagat Singh : పవన్ కళ్యాణ్ జోడీగా మలయాళ భామ - ప్రభాస్ సినిమా తర్వాత!

Virupaksha Modhamamba Temple: ‘విరూపాక్ష’ మూవీ కోసం ఏకంగా గుడే కట్టేశారు - ఎంత అద్భుతంగా ఉందో చూడండి

Virupaksha Modhamamba Temple: ‘విరూపాక్ష’ మూవీ కోసం ఏకంగా గుడే కట్టేశారు - ఎంత అద్భుతంగా ఉందో చూడండి

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్

టాప్ స్టోరీస్

CM Jagan : ఓ స్కిల్డ్ క్రిమినల్ చేసిన స్కామ్ స్కిల్ డెవలప్మెంట్, దేశంలోనే అతి పెద్ద కుంభకోణం - సీఎం జగన్

CM Jagan : ఓ స్కిల్డ్ క్రిమినల్ చేసిన స్కామ్ స్కిల్ డెవలప్మెంట్, దేశంలోనే అతి పెద్ద కుంభకోణం - సీఎం జగన్

TS Paper Leak Politics : "పేపర్ లీక్" కేసు - రాజకీయ పుట్టలో వేలు పట్టిన సిట్ ! వ్యూహాత్మక తప్పిదమేనా ?

TS Paper Leak Politics :

ఏపీ ప్రభుత్వ హైస్కూల్స్‌లో 5388 'నైట్ వాచ్‌మెన్' పోస్టులు, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వ హైస్కూల్స్‌లో 5388 'నైట్ వాచ్‌మెన్' పోస్టులు,  ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

Animals Care in Jharkhand: పశువులకు కూడా ఆదివారం సెలవు - ఆరోజు పాలు కూడా పితకరు!

Animals Care in Jharkhand: పశువులకు కూడా ఆదివారం సెలవు - ఆరోజు పాలు కూడా పితకరు!