Sai Dharam Tej : సాయిధరమ్ తేజ్ బండిపై వెయ్యి రూపాయల ఫైన్.. ఎందుకు.. ఎక్కడ..
సాయిధరమ్ తేజ్ వెళ్లిన బైక్‌పై చలానా పెండింగ్‌లో ఉంది. ఇంతకీ బైక్ ఎవరిది... ఆ బైక్ సాయి ధరమ్ తేజ్ ఎందుకు డ్రైవ్ చేస్తున్నట్టు. ?
సాయిధరమ్ తేజ్‌కు బైక్స్ అంటే చాలా ఇష్టం. ఖరీదైన బైక్స్‌లో నగరంలో తిరగడం చాలా కాలం నుంచి ఉన్న అలవాటు. అదే అలవాటు ప్రకారం వినాయక చవితి రోజు వెళ్లి ప్రమాదానికి గురయ్యారు. అయితే ఆయన ప్రమాదానికి గురైన బైక్ ఆయన గతేడాది కొన్నాడు.
ప్రమాద సమయంలో సాయిధరమ్ తేజ్ నడిపిన బైక్ చాలా ఖరీదైంది. ఇప్పటికే ఈ బైక్‌పై చాలా టూర్లు వేశాడు సాయిధరమ్ తేజ్. గతేడాది ఆగస్టులో తీసుకున్నాడు. అప్పటి నుంచి చాలా టూర్లు వేశాడు. హైదరాబాద్‌లో షూటింగ్ అయితే కొన్నిసార్లు బైక్‌పైనే వెళ్లేవాడు. డబ్బింగ్ చెప్పడానికి, స్క్రిప్టులు వినడానికి సినిమా ఆఫీసులకు వెళ్లాలన్నా చాలా సార్లు బైక్‌పై నేరుగా వెళ్లిపోయేవాడని సన్నిహితులు చెబుతున్నారు.
ఫోర్‌వీలర్‌పై వెళ్తుంటే మన శరీం ముందుకు వెళ్తుందని... అదే టూ వీలర్‌పై ప్రయాణిస్తుంటే సోల్ ప్రయాణిస్తుంటుందని ఓ సందర్భంలో సాయిధరమ్ తేజ్ సోషల్‌మీడియాలో పెట్టారంటే... బైక్స్‌పై ఆయనకు ఉన్న మక్కువ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
">
2018లో ఓసారి హోటల్‌లో డిన్నర్ చేసి టూవీలర్‌పై ఫ్రెండ్స్‌తో వెళ్తూ నగరవాసుల కెమెరాకు చిక్కాడు తేజు. రాయల్ఎన్‌ఫీల్డ్ బైక్ వెళ్తున్న తేజు కెమెరా క్లిక్‌మనిపించింది.
ఇప్పుడు సాయిధరమ్ తేజ్ నడిపిన బైక్ ట్రంప్ ట్రిడెంట్ కంపెనీకి చెందిన అత్యంత ఖరీదైనది. దీని విలువ సుమారు పాతిక లక్షలకుపైగానే ఉంటుంది. సాయిధరమ్ తేజ్ గతేడాది ఆగస్టులు తీసుకున్నారు. అంటే సుమారు ఏడాది అయింది.
బైక్‌లపై తిరగడం సరదాగా భావించే సాయిధరమ్ తేజ్ ఎక్కడా కూడా అజాగ్రత్త వహించేవాడు కాదు. బైక్ తీసిన ప్రతిసారీ హెల్మెట్ ధరించేవాడు. గ్లౌజ్ ఇలా బైక్ నడిపేటప్పుడు కావాల్సిన ప్రతిది పాటించేవారు. ఈ మధ్య కాలంలో ఆయన జూబ్లీ హిల్స్‌లో బైక్‌పై తిరగడం ఓ కెమెరామెన్ తన కెమెరాలో బంధించాడు. అప్పటి నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉందీ ఫోటో.
TS 07 GJ 1258 నంబర్‌తో ఉన్న ఈ బైక్ గతేడాది ఆగస్టు రెండున ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తూ పోలీసుల కంట పడింది. పార్వతినగర్ తోటాడి కాంపౌండ్ వద్ద ట్రాఫిక్ నిబంధనలు పాటించలేదని ఈ నెంబర్ బైక్‌పై వెయ్యిరూపాయల చలానా ఉంది. నలభై కిలోమీటర్ల వేగానికి మించి వెళ్లకూడని ప్రాంతంలో సుమారు 87 కిలోమీటర్ల వేగంతో వెళ్తూ ట్రాఫిక్ పోలీసుల కెమెరాకు చిక్కారు. ఇంకా ఆ చలానా పెండింగ్‌లో ఉంది.