Jayam Ravi to Ravi Mohan: 'జయం' రవి కాదు... రవి మోహన్ - ఇక నుంచి ఇలాగే పిలవండి, రిక్వెస్ట్ చేసిన హీరో
Jayam Ravi request regarding his name: తమిళంలో హీరోగా పరిచయమైన 'జయం' తర్వాత ఎడిటర్ మోహన్ రెండో కుమారుడి పేరు 'జయం' రవి అయ్యింది. ఇప్పుడు తన పేరు విషయంలో ఆయన ఒక రిక్వెస్ట్ చేశారు.

Jayam Ravi requests everyone to address him as Ravi or Ravi Mohan: తమిళ కథానాయకుడు జయం రవి మన తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితులే. ప్రముఖ ఎడిటర్ మోహన్ రెండో కుమారుడిగా చాలా మందికి తెలుసు. మణిరత్నం దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన 'పొన్నియిన్ సెల్వన్' తెలుగులోనూ భారీ ఎత్తున విడుదల అయింది. ప్రేక్షకుల అభిమానం సొంతం చేసుకుంది. రవి నటించిన కొన్ని సినిమాలు తెలుగులో డబ్బింగ్ అయ్యాయి. ఈ హీరో ఇప్పుడు తన పేరు ముందు 'జయం'ను తీసేయమని రిక్వెస్ట్ చేస్తూ ఒక లెటర్ రిలీజ్ చేశారు.
జయం రవి కాదు... రవి లేదా రవి మోహన్!
ఇవాల్టి నుంచి తాను రవి లేదా రవి మోహన్ (Ravi Mohan)గా అందరికీ తెలియాలని అనుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. కొత్త ఏడాదిలో అడుగు పెడుతున్న సందర్భంగా తన ఆశలు, ఆకాంక్షలు, విలువలు ప్రతిబింబించే విధంగా తన పేరు ఉండాలని కోరుకుంటున్నట్లు, జీవితంలో కొత్త అధ్యాయంలో అడుగుపెడుతున్న సందర్భంగా తన పేరును మార్చుకుంటున్నట్లు ఈ కథానాయకుడు చెప్పారు. స్నేహితులు, అభిమానులు, ప్రతి ఒక్కరూ తనను రవి లేదా రవి మోహన్ అని పిలవాలని రిక్వెస్ట్ చేశారు. ఇక నుంచి తాను 'జయం' రవి కాదు అని, ఆ పేరుతో ఎవరూ పిలవద్దని, అందరికీ ఇది తన హృదయపూర్వక విజ్ఞప్తి అని తెలిపారు.
నిర్మాణ సంస్థను అనౌన్స్ చేసిన రవి మోహన్!
నితిన్ హీరోగా తేజ దర్శకత్వం వహించిన జయం సినిమాలో తమిళంలో అదే పేరుతో రీమేక్ చేశారు రవి. అప్పటి నుంచి ఆయన పేరు జయం రవి అయింది. అయితే ఇప్పుడు... పేరు ముందు జయం తీసేసి, చివరన తన తండ్రి మోహన్ పేరు యాడ్ చేశారు.
ఎడిటర్ మోహన్ కేవలం ఎడిటింగ్ బాధ్యతలకు మాత్రమే పరిమితం కాలేదు. 'హనుమాన్ జంక్షన్' వంటి హిట్ సినిమాలు ప్రొడ్యూస్ చేశారు కూడా! పేరు చివర తండ్రి పేరును పెట్టుకున్న రవి మోహన్... తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ నిర్మాతగా కొత్త అవతారంలోకి అడుగు పెట్టడానికి సిద్ధం అయ్యారు. రవి మోహన్ స్టూడియోస్ పేరుతో ఒక నిర్మాణ సంస్థను స్థాపించినట్లు అనౌన్స్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకునే, ప్రజలందరిలో స్ఫూర్తి నింపే కథలతో ఆ సంస్థలో సినిమాలు తీయాలని అనుకుంటున్నట్లు ఆయన వివరించారు.
Actor @iam_RaviMohan requests everyone to address him as #Ravi / #RaviMohan going forward, also announces some new initiatives like #RaviMohanStudios and #RaviMohanFansFoundation.#HappyPongal 🌾@shiyamjack @vamsikaka pic.twitter.com/ybnU4Xmd2W
— Vamsi Kaka (@vamsikaka) January 13, 2025
రవి మోహన్ ఫ్యాన్స్ ఫౌండేషన్ కూడా ఆయన ప్రారంభించారు. తన అభిమాన సంఘాలు అన్నిటినీ ఒక్క తాటి మీదకు తీసుకు రావడం కోసం తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రజలు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పడంతో పాటు తన పేరు మార్పు విషయాన్ని స్పష్టంగా వివరించారు. గత ఏడాది అర్తి నుంచి రవి విడాకులు తీసుకున్నారు. ఆ సమయంలో విమర్శలు, ప్రతి విమర్శలు జరిగాయి. వ్యక్తిగత జీవితంలోనూ, వృత్తిపరమైన జీవితంలోనూ కొత్తగా అడుగులు వేయాలని రవి మోహన్ నిర్ణయం తీసుకున్నారు.
Also Read: 'గేమ్ చేంజర్' మీద ఆ ముఠా గూడుపుఠాణి... 45 మందిపై సైబర్ క్రైమ్‌లో కంప్లైంట్





















