By: ABP Desam | Updated at : 19 Jun 2023 07:36 PM (IST)
Photo Credit: Anil Ravipudi/Instagram
ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న సక్సెస్‌ఫుల్ డైరెక్టర్స్ లో అనిల్ రావిపూడి కూడా ఒకరు. కమర్షియల్ కథలకు కామెడీ టచ్ చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటున్నాడు ఈ దర్శకుడు. ఇటీవల 'ఎఫ్ త్రీ' మూవీతో సక్సెస్ అందుకున్న అనిల్ రావిపూడి ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో 'భగవంత్ కేసరి' అనే సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. తెలంగాణ బ్యాక్ డ్రాప్ తో రాబోతున్న సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా మరో హీరోయిన్ శ్రీ లీల కీలక పాత్ర పోషిస్తుంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్లో కాజల్ అగర్వాల్ జాయిన్ అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా సెట్స్ లో హీరోయిన్ కాజల్ అగర్వాల్, శ్రీలీల ఇద్దరూ బాలయ్య పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశారు. అందుకు సంబంధించిన వీడియోని దర్శకుడు అనిల్ రావిపూడి తన ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్ చేశాడు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.
రీసెంట్ గా బాలయ్య మూవీ సెట్స్ లో అనిల్ రావిపూడి ఫైట్ మాస్టర్ డాన్స్ మాస్టర్ లతో కలిసి బాలయ్య బాబు పాటకి అదిరిపోయే స్టెప్పులు వేసిన విషయం తెలిసిందే. ఆ వీడియో కూడా వైరల్ అయింది. అయితే తాజా వీడియోలో మాత్రం అనిల్ రావిపూడి కాకుండా హీరోయిన్ కాజల్ అగర్వాల్, శ్రీ లీల బాలయ్య సూపర్ హిట్ సాంగ్ 'చిలకపచ్చ కోక' పాటకి అదిరిపోయే స్టెప్పులు వేశారు.
ఈ వీడియోని తన సోషల్ మీడియాలో అనిల్ రావిపూడి పంచుకుంటూ.." నేను బాలయ్య బాబు పాటకి వేసిన డాన్స్‌కు ఈర్ష్యగా ఫీల్ అవుతూ మా హీరోయిన్స్ ఇద్దరూ నా ముందు డాన్స్ చేయడం అస్సలు ఆపడం లేదు" అంటూ రాసుకొచ్చాడు. దీంతో ఈ వీడియో ఇప్పుడు నెటిజన్స్ ని తెగ ఆకట్టుకుంటుంది. ఈ వీడియోలో కాజల్, శ్రీ లీల డాన్స్ స్టెప్పులకు అనిల్ రావిపూడి విజిల్స్ వేయగా.. మా డాన్స్ ఇంకా అయిపోలేదు అంటూ శ్రీలీలా, కాజల్ మరోసారి స్టెప్పులు వేశారు. అన్నట్టు ఈ వీడియోలో కాజల్, శ్రీ లీల ఇద్దరూ సేమ్ కాస్ట్యూమ్స్ ధరించడం విశేషం.
ఇక నెటిజెన్స్ ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఒకరేమో 'బాలయ్య బాబు పాటలు అంటే మరి ఆ మాత్రం ఊపు లేకపోతే ఎట్టా' అని కామెంట్ చేయగా, మరొకరేమో 'కాజల్, శ్రీ లీల మాస్ డాన్స్ అదిరిపోయింది' అంటూ రాసుకొచ్చాడు. కాగా రీసెంట్ గా బాలయ్య పుట్టినరోజు సందర్భంగా సినిమా నుంచి విడుదలైన టైటిల్ అండ్ టీజర్ గ్లిమ్స్ ఆడియన్స్ నుండి భారీ రెస్పాన్స్ ని అందుకుంది. ముఖ్యంగా టీజర్ లో బాలయ్య సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ అలాగే తెలంగాణ యాసలో బాలయ్య చెప్పే మాస్ డైలాగ్స్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో భగవంత్ కేసరి సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాని దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదల చేయనున్నారు మేకర్స్. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహూ గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.
Richest South Indian Actor: దక్షిణాదిలో సంపన్న నటుడు ఎవరో తెలుసా? రూ.3 వేల కోట్ల ఆస్తి, సొంత విమానం మామూలుగా లేదు మరీ!
Navdeep Love Mouli: నవదీప్‌లో మార్పు - ఒంటి మీద నూలు పోగు లేకుండా!
Vicky Kaushal: ఇకపై ఆమెతో వాదించనని చెప్పా, కత్రినా 'టవల్ ఫైట్'పై భర్త విక్కీ కౌశల్ ఫన్నీ కామెంట్స్
Kriti Sanon : బన్నీతో కలిసి పనిచేసే క్షణాల కోసం ఎదురుచూస్తున్నా: కృతిసనన్
Kangana Ranaut: మాజీ ప్రధాని ఇందిరా గాంధీని కలిసిన కంగనా, అదెలా సాధ్యమని షాక్ అవుతున్నారా?
Andhra News : అనంతపురంలో బీజేపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ ! టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుపై వివాదం
KCR Election Campaign: హైదరాబాద్ మినహా 97 నియోజకవర్గాల్లో కేసీఆర్ ప్రచారం- నేడు గజ్వేల్‌లో ఫైనల్ మీటింగ్
Telangana Elections 2023: సాయంత్రానికి ముగియనున్న ఎన్నికల ప్రచారం-ప్రలోభాలపర్వం షురూ
Malla Reddy: ‘బిజినెస్ మ్యాన్’ సినిమా చూసి రాజకీయాల్లోకి వచ్చాను - మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర కామెంట్స్
/body>