Abhishek bachchan: ట్రోలింగ్స్... రూమర్స్... నెగిటివ్ న్యూస్ - అభిషేక్ బచ్చన్ రియాక్షన్ ఏంటంటే?
Abhishek Bachchan Interview: ట్రోలింగ్స్, రూమర్స్ గురించి రియాక్ట్ అయితే వాటికి ఆజ్యం పోసినట్లవుతుందని బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్ అన్నారు. తనపై ట్రోల్స్‌తో ఫ్యామిలీ మొత్తం బాధ పడుతుందన్నారు.

Abhishek Bachchan Reaction On Trollings Rumours: తనపై వస్తోన్న రూమర్స్‌పై బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్ తాజాగా స్పందించారు. సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా ఉండని ఆయన... ఇటీవల చేసిన ఓ పోస్ట్ వైరల్ అయ్యింది. 'కొన్ని రోజులు నేను అన్నింటికీ దూరంగా ఉండాలనుకుంటున్నా. నా గురించి నేను తెలుసుకునేందుకు ఒంటరిగా ఉండాలని ఉంది.' అని పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో పెద్ద చర్చే సాగింది.
'అందుకే రియాక్ట్ కాను'
తనపై వచ్చే రూమర్స్, ట్రోలింగ్స్ వల్ల తన ఫ్యామిలీ మొత్తం బాధ పడుతుందని... ఆధారాలు లేని వాటి గురించి తాను అసలు పట్టించుకోనని చెప్పారు అభిషేక్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన... తప్పుడు వార్తలపై తాను రియాక్ట్ కాకపోవడానికి గల కారణాలను వెల్లడించారు. 'నాపై వచ్చిన వార్తలన్నింటికీ స్పందిస్తే వాటికి ఆజ్యం పోసినట్లవుతుంది. గతంలో నా గురించి ఎన్ని రూమర్స్ వచ్చినా నేను పట్టించుకోలేదు. కానీ, ఇప్పుడు వాటి వల్ల నా ఫ్యామిలీ మెంబర్స్ బాధ పడుతున్నారు. నేను వాటి గురించి నిజం చెప్పినా ప్రజలు నమ్మే స్థితిలో లేరు.
పాజిటివ్ విషయాల కంటే నెగిటివ్ వార్తలకే ఇంపాక్ట్ ఎక్కువ. రూమర్స్ సృష్టించే వారికి నా జీవితంలో ఏం జరుగుతుందో తెలియదు. నేను ఎవరికైతే ఆన్సర్ చెప్పాల్సి ఉంటుందో వారికి ఈ ట్రోలర్స్ సమాధానం చెప్పరు. తప్పుడు వార్తలు సృష్టించే వారు మనస్సాక్షితో ఆలోచించాలి. ఇది నా ఒక్కడికే కాదు. నా ఫ్యామిలీ మొత్తానికి సంబంధించినది. కంప్యూటర్ స్క్రీన్ ముందు కూర్చుని ఎన్ని అసభ్యకర విషయాలనైనా రాయొచ్చు. ఆ వార్త ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో మీరు ఆలోచించలేరు. మీ గురించి ఎవరైనా అలా రాస్తే మీరు ఇష్టపడతారా?, మీరు ఇంటర్నెట్‌లో చెప్పే విషయాలు నాతోనే డైరెక్ట్‌గా ధైర్యంగా చెప్పాలని కోరుతున్నా. మీకు ఆ ధైర్యం ఎప్పటికీ ఉండదు.' అని అన్నారు.
Also Read: 'కింగ్ డమ్' రిలీజ్ వరకూ వెయిట్ చేయండి - ప్రొడ్యూసర్ నాగవంశీ ఫుల్ క్లారిటీ... ఎందుకో తెలుసా?
ఆ పోస్ట్... సోషల్ మీడియాలో చర్చ
'నాకు ఉన్నదంతా ఎంతో ఇష్టమైన వారికి ఇచ్చేశా. జన సమూహానికి దూరంగా ఉంటూ నన్ను నేను తెలుసుకోవాలనుకుంటున్నా.' అంటూ ఇటీవల అభిషేక్ ఓ పోస్ట్ చేయగా అసలు అలా ఎందుకు చేశారంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చే సాగింది. గతంలో ఐశ్వర్యతో డివోర్స్ అంటూ రూమర్స్ రాగా... ఐశ్వర్య, ఆరాధ్యలతో కలిసి ఉన్న ఫోటో షేర్ చేసి వాటికి చెక్ పెట్టారు. అయినా కానీ రూమర్స్ మాత్రం ఆగలేదు. వీటిపై ఇప్పటివరకూ అభిషేక్ రియాక్ట్ కాలేదు. తాజాగా ఇంటర్వ్యూలో ట్రోలర్స్, రూమర్స్ సృష్టించే వారిపై అసహనం వ్యక్తం చేశారు.
ఇక సినిమాల విషయానికొస్తే... 'హౌస్ ఫుల్' మూవీతో రీసెంట్‌గా సక్సెస్ అందుకున్న అభిషేక్ బచ్చన్... 'కాళీధర్ లాపత' మూవీతో రాబోతున్నారు. మధుమిత దర్శకత్వం వహించిన ఈ మూవీ జులై 4న నేరుగా 'జీ5' ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. దైవిక్ భాగేలా, జీషన్ ఆయూబ్ కీలక పాత్రలు పోషించారు. 'కరుపు దురై' అనే తమిళ మూవీకి ఈ సినిమా రీమేక్ కాగా... అనాథ పిల్లల చుట్టూ ఈ స్టోరీ సాగుతుంది.





















