అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source:  Poll of Polls)

Aayush Sharma: నన్ను కుక్కతో పోల్చారు, దారుణంగా అవమానించారు - సల్మాన్‌ ఖాన్‌ బావ ఆయుష్‌ శర్మ భావోద్వేగం

Aayush Sharma on Trolls:కెరీర్‌లో ప్రారంభంలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను గుర్తు చేసుకున్నాడు బాలీవుడ్ నటుడు ఆయుష్‌ శర్మ. తొలి సినిమా టైంలో తనని కుక్కతో పోలుస్తూ వార్తలు రాశారంటూ ఎమోషనల్‌ అయ్యాడు.

Aayush Sharma Remembers Trolls on Initial Days: సినీ ఇండస్ట్రీలో విమర్శలు, ప్రశంసలు కామన్‌. ఎంతటి స్టార్‌ హీరో, హీరోయిన్‌ అయినా వరుస ప్లాప్స్‌ పండాయంట దారుమైణ ట్రోల్స్‌ ఎదుర్కొవాల్సిందే. ఇక ఒకరి సపోర్టు ఇండస్ట్రీకి వచ్చిన వారిని అయితే తొందరగా జడ్జ్‌ చేస్తుంటారు. తొలి సినిమా టైంలో వారు ఎదుర్కొనే సవాళ్లు అంతాఇంతా కాదు. మూవీ హిట్‌ అయితే ఒకే అదే ప్లాప్‌ అయితే మాత్రం వారిని మామూలుగా ఆడుకోరు. కెరీర్‌లో ప్రారంభంలో తాను అలాంటి చేదు అనుభవాలే ఎదుర్కొన్నానన్నాడు సల్మాన్‌ ఖాన్‌ సోదరి భర్త ఆయుష్‌ శర్మ. నిజానికి అతడిని మొదటి నుంచి విమర్శలు వెంటాడుతూనే ఉన్నాయి. ఆఫర్ల కోసం, ఫేం కోసమే ఆయుష్‌ శర్మ సల్మాన్‌ చెల్లి అర్ఫిత ఖాన్‌ను పెళ్లి చేసుకున్నాడంటూ పెళ్లి సమయంలో అతడికి విమర్శించారు నెటిజన్లు.

అలాగే సల్మాన్‌ బ్యాగ్రౌండ్‌తోనే ఇండస్ట్రీకి వచ్చాడు. అర్పితా ఖాన్‌తో పెళ్లయిన కొద్ది రోజులకే ఆయుష్‌ శర్మ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. లవ్‌ యాత్రి అనే సినిమాతో అతడు హీరోగా పరిచయం అయ్యాడు. పైగా ఈ సినిమాకు సల్మాన్‌ ఖాన్‌ నిర్మాత. కానీ, ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బొల్తా కొట్టింది. ఈ మూవీ ప్లాప్‌ అవ్వడంతో అంతా ఆడియన్స్‌, క్రిటిక్స్‌ ఆయుష్‌ను టార్గెట్‌ చేశారు. అతడికి యాక్టింగ్‌ కూడా రాలేదని, హీరోగా కాదు కనీసం నటుడిగా కూడా అతడు పనికి రాడంటూ దారుణంగా విమర్శించారు. అంతేకాదు కొన్ని మీడియాల్లో అయితే అతడిపై అనుచిత కామెంట్స్‌ చేస్తూ కథనాలు రాశారు. తాజాగా వాటిని గుర్తు చేసుకుని ఎమోషనల్‌ అయ్యాడు ఆయుష్‌. అతడు హీరోగా తెరకెక్కిన లేటెస్ట్‌ మూవీ 'రుస్లాన్‌'. రేపు ఏప్రిల్‌ 26న ఈ చిత్రం విడుదల కానుంది.

నన్ను కుక్కతో పోలుస్తూ వార్తలు రాశారు

ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా మూవీ టీంతో కలిసి ఆయుష్‌ ఓ బాలీవుడ్‌ మీడియాకు ఇంటర్య్వూ ఇచ్చాడు. ఈ సందర్భంగా కెరీర్‌ ప్రారంభంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నానంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. "నా ఫస్ట్‌ మూవీ లవ్‌ యాత్రి మూవీతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. కానీ ఈ సినిమా తర్వాత నేను దారుణమైన ట్రోల్స్‌, సవాళ్లు ఎదుర్కొన్నాను. 'ఆయుష్‌ బదులుగా ఓ కుక్కను పెట్టి సినిమా తీయాల్సింది' అంటూ దారుణం మాట్లాడారు. నా పిల్లలు నన్ను చూసి గర్వపడాలి అనుకున్నాను. కానీ నా గురించి చెత్తగా రాశారు. మూవీ రిలీజ్‌ రోజు అయితే దారుణంగా తిట్టారు. కుక్కతో పోలుస్తూ కామెంట్స్‌ చేయడం నన్ను చాలా బాధించింది" అంటూ ఆయుష్‌ కన్నీరు పెట్టుకున్నాడు. 

నన్ను చూసి నా పిల్లలు గర్వించాలి అనుకున్నాను. రేపు పెద్దయ్యాక నా కొడుకు, కూతురు ఆ వార్త చదివితే నా పరిస్థితి ఎంటీ? మూవీ రిలీజ్‌ టైంలో మీడియాల్లో నన్ను ట్రోల్‌ చేసిన వార్తలే వచ్చాయి. ఇంటర్నేట్‌ ఆన్‌ చేస్తే నన్ను కుక్క అంటూ రాసిన వార్తలే కనిపించాయి. అవి నా పిల్లలు కూడా చూశారు. కానీ చిన్నవాళ్లు కాబట్టి వారికి అది అర్థం కాలేదు. అదే పెద్దయ్యాక ఆ వార్త చదివితే తండ్రిగా నాకు ఎంత బాధగా ఉంటుంది. కానీ, నన్ను ట్రోల్‌ చేసిన వారికి ఇప్పుడు నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అప్పుడు వాళ్లు అలా నన్ను అవమానించడం వల్లే ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాను. ఆ ట్రోల్స్‌ నాలో పట్టుదల పెంచాయి. నటుడిగా నన్ను ప్రూవ్‌ చేసుకోవాలని నిర్ణయించుకుని కష్టపడి ఇప్పుడు ఇలా ఉన్నాను" అంటూ అతడు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అతడి కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి. సల్మాన్‌ ఖాన్‌ బావకు కూడా ఇండస్ట్రీలో అవమానాలు తప్పలేదా? అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.  

Also Read: 'కల్కి'కి ప్రభాస్‌ రెమ్యునరేషన్‌ తెలిస్తే అవాక్కావ్వాల్సిందే! - బడ్జెట్ లో 25 శాతం, ఎన్ని కోట్లంటే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PPP Model Chandrababu:  ప్రాజెక్టులు,రోడ్లను వాడుకుంటే డబ్బులు కట్టాల్సిందే - ఏపీలో PPP మోడల్ - చంద్రబాబు రిస్క్ చేస్తున్నారా ?
ప్రాజెక్టులు,రోడ్లను వాడుకుంటే డబ్బులు కట్టాల్సిందే - ఏపీలో PPP మోడల్ - చంద్రబాబు రిస్క్ చేస్తున్నారా ?
Weather Update Today: ఏపీకి వాన గండం- తెలంగాణపై చలి పిడుగు - జిల్లాల వారీగా ఉష్ణోగ్రతలు ఇవే
ఏపీకి వాన గండం- తెలంగాణపై చలి పిడుగు - జిల్లాల వారీగా ఉష్ణోగ్రతలు ఇవే
Aditi Shankar: పాలకొల్లులో 'గేమ్ ఛేంజర్' దర్శకుడి కూతురు... శ్రీనివాస్ బెల్లకొండతో క్యూట్ లవ్ సాంగ్ కోసం!
పాలకొల్లులో 'గేమ్ ఛేంజర్' దర్శకుడి కూతురు... శ్రీనివాస్ బెల్లకొండతో క్యూట్ లవ్ సాంగ్ కోసం!
AP Cabinet: టూరిజం పాలసీకి ఆమోదం - కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
టూరిజం పాలసీకి ఆమోదం - కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలుఅరటిపండు రాకెట్ కూలిపోయింది, ట్రంప్ ముందు పరువు పోయిందిగా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PPP Model Chandrababu:  ప్రాజెక్టులు,రోడ్లను వాడుకుంటే డబ్బులు కట్టాల్సిందే - ఏపీలో PPP మోడల్ - చంద్రబాబు రిస్క్ చేస్తున్నారా ?
ప్రాజెక్టులు,రోడ్లను వాడుకుంటే డబ్బులు కట్టాల్సిందే - ఏపీలో PPP మోడల్ - చంద్రబాబు రిస్క్ చేస్తున్నారా ?
Weather Update Today: ఏపీకి వాన గండం- తెలంగాణపై చలి పిడుగు - జిల్లాల వారీగా ఉష్ణోగ్రతలు ఇవే
ఏపీకి వాన గండం- తెలంగాణపై చలి పిడుగు - జిల్లాల వారీగా ఉష్ణోగ్రతలు ఇవే
Aditi Shankar: పాలకొల్లులో 'గేమ్ ఛేంజర్' దర్శకుడి కూతురు... శ్రీనివాస్ బెల్లకొండతో క్యూట్ లవ్ సాంగ్ కోసం!
పాలకొల్లులో 'గేమ్ ఛేంజర్' దర్శకుడి కూతురు... శ్రీనివాస్ బెల్లకొండతో క్యూట్ లవ్ సాంగ్ కోసం!
AP Cabinet: టూరిజం పాలసీకి ఆమోదం - కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
టూరిజం పాలసీకి ఆమోదం - కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Allu Arjun: భార్యతో బన్నీ సీక్రెట్ వాట్సాప్ చాట్ గ్రూప్- ఎందుకు, ఎప్పుడు ఉపయోగిస్తారో తెలుసా?
భార్యతో బన్నీ సీక్రెట్ వాట్సాప్ చాట్ గ్రూప్- ఎందుకు, ఎప్పుడు ఉపయోగిస్తారో తెలుసా?
Paritala Sunitha: మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరులు జాకీని వెళ్లగొట్టారు, తక్షణం చర్యలు చేపట్టాలి: పరిటాల సునీత
మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరులు జాకీని వెళ్లగొట్టారు, తక్షణం చర్యలు చేపట్టాలి: పరిటాల సునీత
Karthika Vanabhojanam 2024: కార్తీక సమారాధన అంటే క్యాటరింగ్ భోజనాలు కాదు..అసలైన వనభోజనాలంటే ఇవి!
కార్తీక సమారాధన అంటే క్యాటరింగ్ భోజనాలు కాదు..అసలైన వనభోజనాలంటే ఇవి!
Amla Soup : చలికాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు రోగనిరోధక శక్తిని పెంచే సూప్.. సింపుల్ రెసిపీ, మరెన్నో హెల్త్ బెనిఫిట్స్
చలికాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు రోగనిరోధక శక్తిని పెంచే సూప్.. సింపుల్ రెసిపీ, మరెన్నో హెల్త్ బెనిఫిట్స్
Embed widget