Aasa Kooda: యూట్యూబ్‌లో అదరగొడుతున్న ‘ఓం భీమ్ బుష్’ బ్యూటీ పాట - 3 వారాల్లో 2 కోట్ల వ్యూస్
Aasa Kooda: తమిళంలో ‘కచ్చి సెర’ అనే ఆల్బమ్ సాంగ్ ఒక రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇదే సమయంలో ‘ఆశ కూడా’ లాంటి మరో పాట దానికి పోటీగా ట్రెండింగ్‌లోకి వచ్చింది.
Aasa Kooda Song: ఒకప్పుడు కేవలం హిందీలో మాత్రమే రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో ఆల్బమ్ సాంగ్స్ తెరకెక్కేవి. అవి వెంటనే హిట్ కూడా అయ్యేవి. ఇప్పుడిప్పుడే సౌత్‌లో కూడా ఈ ట్రెండ్ మొదలయ్యింది. సినిమా పాటలకంటే ఆల్బమ్ సాంగ్స్‌కే పాపులారిటీ పెరుగుతోంది. అలా తమిళంలో తన ఆల్బమ్ సాంగ్స్‌తో యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సింగర్ సాయి అభ్యంకర్. ఇప్పటికే ‘కచ్చి సెర’తో యూట్యూబ్‌ను షేక్ చేసిన అభ్యంకర్.. తాజాగా ‘ఓం భీమ్ బుష్’ హీరోయిన్ ప్రీతి ముకుందన్‌తో కలిసి మరొక ఆల్బమ్ సాంగ్‌ను కంపోజ్ చేసి యూత్‌ను ఆకట్టుకుంటున్నాడు.
యంగ్ సెన్సేషన్..
ఈరోజుల్లో ఏదైనా పాట వైరల్ అవ్వాలంటే దానిని ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేస్తే చాలు.. తన మొదటి ఆల్బమ్ సాంగ్ ‘కచ్చి సెర’కి అదే ఫార్ములాను ఫాలో అయ్యే సెన్సేషన్ క్రియేట్ చేశాడు సాయి అభ్యంకర్. ఇప్పటికీ ఈ పాటకు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ స్టెప్పులేస్తున్నారు. ఇక ‘కచ్చి సెరి’ హిట్ అవ్వడానికి సాయి అభ్యంకర్‌తో పాటు మరొక ముఖ్య కారణంగా నిలిచింది సంయుక్త డ్యాన్స్. అప్పటివరకు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మాత్రమే ఉన్న సంయుక్త.. ‘కచ్చి సెర’ పాటతో స్టార్ అయిపోయింది. ‘కచ్చి సెర’ తర్వాత ‘ఆశ కూడా’ పాటతో యూత్‌ను ఆకట్టుకుంటున్నాడు యంగ్ సింగర్ సాయి.
ఇప్పటికీ ట్రెండింగ్..
‘కచ్చి సెర’లో సంయుక్తలాగా ‘ఆశ కూడా’ కోసం ‘ఓం భీమ్ బుష్’ బ్యూటీ ప్రీతి ముకుందన్‌ను సెలక్ట్ చేసుకున్నాడు. ఈ పాట యూట్యూబ్‌లో విడుదలయినప్పటి నుండి సాయి అభ్యంకర్‌తో పాటు ప్రీతి ముకుందన్ కూడా ఈ పాటను ప్రమోట్ చేయడానికి కోసం కష్టపడింది. హుక్ స్టెప్ అంటూ తన టీమ్‌తో కలిసి డ్యాన్స్ చేసి ఒక వీడియోను అప్లోడ్ చేసింది. ఈ వీడియో.. ‘ఆశ కూడా’ పాటకు ఎక్కువగా రీచ్ తీసుకురావడానికి సహాయపడింది. అందుకే ‘ఆశ కూడా’ పాట విడుదలయిన మూడు వారాల్లో 2 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అంతే కాకుండా యూట్యూబ్ మ్యూజిక్‌లో ట్రెండింగ్ లిస్ట్‌లో 20వ స్థానంలో నిలిచింది. చాలాకాలం క్రితం విడుదలయిన ‘కచ్చి సెర’ కూడా 40వ స్థానంలో ఉండడం విశేషం.
ప్రీతి ముకుందన్ ఎవరు.?
మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన ప్రీతి ముకుందన్.. మొదట్లో పలు యాడ్స్‌లో నటించింది. ఆ తర్వాత శ్రీ విష్ణు హీరోగా నటించిన ‘ఓం భీమ్ బుష్’తో హీరోయిన్‌గా మారింది. ఆ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. ఆ మూవీ రిలీజ్ అవ్వకముందే మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నా ‘కన్నప్ప’లో కూడా ప్రీతికి ఛాన్స్ దక్కింది. తాజాగా విడుదలయిన టీజర్‌లో తన లుక్ పూర్తిగా మార్చేసి ఫైట్స్ కూడా చేసింది ఈ భామ. తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో కూడా ప్రీతి నటించిన సినిమాలన్నీ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అవుతున్నాయి. అదే సమయంలో ‘ఆశ కూడా’ పాటలో నటించడం తన కెరీర్‌కు మరింత ప్లస్ అయ్యింది.
Also Read: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!