అన్వేషించండి

Aamir Khan: 'అందాజ్ అప్నా అప్నా' సీక్వెల్ ఉంటుందా? అభిమానులకు అదిరిపోయే న్యూస్ చెప్పిన అమీర్ ఖాన్

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. తాను నటించిన కల్ట్ క్లాసిక్ మూవీ 'అందాజ్ అప్నా అప్నా'కి సీక్వెల్ తీసుకురాబోతున్నట్లు తెలిపారు.

Aamir Khan Hint About  Andaz Apna Apna 2: అమీర్ ఖాన్ కెరీర్ లో అద్భుత చిత్రంగా గుర్తింపు పొందిన మూవీ 'అందాజ్ అప్నా అప్నా'. త్వరలో ఈ కల్డ్ క్లాసిక్ మూవీకి సీక్వెల్ రాబోతోంది. తన పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులతో ఇంటరాక్ట్ అయిన ఆయన, ఈ మూవీ సీక్వెల్ కు సంబంధించి క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈ ఐకానిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌కు సీక్వెల్ ప్రయత్నాలు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయని వెల్లడించారు. గత కొంతకాలంగా ఈ సినిమా సీక్వెల్ గురించి చర్చలు జరుగుతున్నాయని చెప్పిన అమీర్ ఖాన్, త్వరలోనే ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉందన్నారు. 'అందాజ్ అప్నా అప్నా‘లో అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ పోషించిన అమర్, ప్రేమ్ క్యారెక్టర్లు తిరిగి వెండితెర మీద సందడి చేస్తాయని చెప్పారు.

1994లో సంచలన విజయాన్ని అందుకున్న ‘అందాజ్‌ అప్నా అప్నా’

మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించిన అమర్, ప్రేమ్.. ధనవంతులైన అమ్మాయిలను ప్రేమలోకి దింపే కథతో 1994లో ‘అందాజ్‌ అప్నా అప్నా’ సినిమా తెరకెక్కింది. కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని అందుకుంది. బాలీవుడ్ స్టార్ హీరోలు అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు. రవీనా టాండన్‌, కరిష్మా కపూర్‌ హీరోయిన్లుగా నటించారు. రాజ్‌ కుమార్‌ సంతోషి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాన్ని అందుకుంది. వసూళ్ల పరంగా సత్తా చాటింది.

‘అందాజ్‌ అప్నా అప్నా 2’ స్క్రిప్ట్ పనులు షురూ

ఇప్పుడు ‘అందాజ్‌ అప్నా అప్నా’ సినిమాకు సీక్వెల్ రాబోతోంది. అమీర్ ఖాన్ తాజాగా ఈ మూవీ సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చారు. ‘‘డైరెక్టర్ రాజ్‌ కుమార్‌ సంతోషి ‘అందాజ్‌ అప్నా అప్నా 2’ స్క్రిప్టు వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ పనులు స్టార్టింగ్ లోనే ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అన్ని వివరాలు అభిమానులకు వెల్లడిస్తాం’’ అని చెప్పుకొచ్చారు. అమీర్ ఖాన్ ఇచ్చిన హింతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరోసారి థియేటర్లలో హాయిగా నవ్వుకునే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.   

అటు ప్రస్తుతం అమీర్ ఖాన్ ‘సితారే జమీన్ పర్‘ అనే సినిమా చేస్తున్నారు. 2007లో వచ్చిన ‘తారే జమీన్ పర్‘ అనే సినిమాకు కొనసాగింపుగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు అమీర్ తెలిపారు. ఆ సినిమా కథలో థీమ్ ఈ సినిమాలో థీమ్ ఒకేలా ఉంటుందన్నారు. మనందరిలోనూ లోపాలు, బలహీనతలు ఉన్నా, కొన్ని ప్రత్యేకతలు ఉంటాయని చెప్పారు. ‘తారే జమీన్ పర్‘లో ఇషాన్ అనే పిల్లాడికి తాను సాయం చేస్తానని, ఈ చిత్రంలో ఇషాన్ లాంటి 9 మంది పిల్లలు తనకు సాయం చేస్తానని చెప్పారు. అటు సల్మాన్ ఖాన్ చివరిగా ‘టైగర్ 3‘లో కనిపించారు. ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది.

Read Also: ఒకే ఒక్క క్యారెక్టర్ నన్ను సినిమాలకు దూరం చేసింది- అసలు విషయం చెప్పిన అందాల రాశీ

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Civil Mock Drill: యుద్ధ సన్నాహాలు షురూ - దేశవ్యాప్తంగా సివిల్ మాక్ డ్రిల్‌కు ఆదేశాలు - ఈ డ్రిల్ పూర్తి డీటైల్స్
యుద్ధ సన్నాహాలు షురూ - దేశవ్యాప్తంగా సివిల్ మాక్ డ్రిల్‌కు ఆదేశాలు - ఈ డ్రిల్ పూర్తి డీటైల్స్
Hyderabad Crime News: ఆన్ లైన్ ఆపరేషన్ చేసిన డాక్టర్ - కవల పిల్లలు మృతి - ఎలాంటి శిక్ష వేయాలి?
ఆన్ లైన్ ఆపరేషన్ చేసిన డాక్టర్ - కవల పిల్లలు మృతి - ఎలాంటి శిక్ష వేయాలి?
Viral News: నోరు లేని కుక్కపై అభాండాలు - యజమానిని చంపలేదు..కాపాడే ప్రయత్నం చేసింది !
నోరు లేని కుక్కపై అభాండాలు - యజమానిని చంపలేదు..కాపాడే ప్రయత్నం చేసింది !
Earthquake In Telangana: ఉత్తర తెలంగాణలో భూ ప్రకంపనలు-  భయంతో వణికిపోయిన ప్రజలు
ఉత్తర తెలంగాణలో భూ ప్రకంపనలు- భయంతో వణికిపోయిన ప్రజలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Prabhsimran Singh 437 Runs IPL 2025 | బ్యాటింగ్ లో దుమ్ము రేపుతున్న ప్రభ్ సిమ్రన్ సింగ్ | ABP DesamRahane's Grit Despite Stitches | కేకేఆర్ ను ప్లే ఆఫ్స్ కు తీసుకువెళ్లటం సర్వస్వం పెట్టేస్తున్న రహానే | ABP DesamRiyan Parag 6 Sixers vs KKR IPL 2025 | కేకేఆర్ బౌలర్లపై 6 సిక్సర్లతో విరుచుకుపడిన రియాన్ పరాగ్ | ABPPBKS vs LSG Match Highlights IPL 2025 | లక్నోపై 37పరుగుల తేడాతో పంజాబ్ విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Civil Mock Drill: యుద్ధ సన్నాహాలు షురూ - దేశవ్యాప్తంగా సివిల్ మాక్ డ్రిల్‌కు ఆదేశాలు - ఈ డ్రిల్ పూర్తి డీటైల్స్
యుద్ధ సన్నాహాలు షురూ - దేశవ్యాప్తంగా సివిల్ మాక్ డ్రిల్‌కు ఆదేశాలు - ఈ డ్రిల్ పూర్తి డీటైల్స్
Hyderabad Crime News: ఆన్ లైన్ ఆపరేషన్ చేసిన డాక్టర్ - కవల పిల్లలు మృతి - ఎలాంటి శిక్ష వేయాలి?
ఆన్ లైన్ ఆపరేషన్ చేసిన డాక్టర్ - కవల పిల్లలు మృతి - ఎలాంటి శిక్ష వేయాలి?
Viral News: నోరు లేని కుక్కపై అభాండాలు - యజమానిని చంపలేదు..కాపాడే ప్రయత్నం చేసింది !
నోరు లేని కుక్కపై అభాండాలు - యజమానిని చంపలేదు..కాపాడే ప్రయత్నం చేసింది !
Earthquake In Telangana: ఉత్తర తెలంగాణలో భూ ప్రకంపనలు-  భయంతో వణికిపోయిన ప్రజలు
ఉత్తర తెలంగాణలో భూ ప్రకంపనలు- భయంతో వణికిపోయిన ప్రజలు
Andhra Pradesh News: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు గుడ్ న్యూస్- మంగళవారం సాయంత్రంలోపు పరిహారం జమ
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు గుడ్ న్యూస్- మంగళవారం సాయంత్రంలోపు పరిహారం జమ
Revanth Reddy: నన్ను కోసుకుని తిన్నా పైసల్లేవు - అప్పులూ పుట్టట్లేదు -  ఉద్యోగ సంఘాలకు తేల్చి చెప్పిన రేవంత్
నన్ను కోసుకుని తిన్నా పైసల్లేవు - అప్పులూ పుట్టట్లేదు - ఉద్యోగ సంఘాలకు తేల్చి చెప్పిన రేవంత్
Peddi: పెద్ది సిగ్నేచర్ షాట్‌తో ఢిల్లీ ప్లేయర్ - రీ క్రియేటెడ్ వీడియో అదుర్స్
పెద్ది సిగ్నేచర్ షాట్‌తో ఢిల్లీ ప్లేయర్ - రీ క్రియేటెడ్ వీడియో అదుర్స్
Kesineni War : లిక్కర్ స్కాం ప్రధాన నిందితుడితో టీడీపీ ఎంపీ వ్యాపారాలు - సంచలన ఆధారాలు బయట పెట్టిన కేశినేని నాని
లిక్కర్ స్కాం ప్రధాన నిందితుడితో టీడీపీ ఎంపీ వ్యాపారాలు - సంచలన ఆధారాలు బయట పెట్టిన కేశినేని నాని
Embed widget