Bharateeyudu 2: ‘భారతీయుడు 2’లో మర్మకళపై కోర్టుకెక్కిన రచయిత - అలా చేయడం కుదరదు అంటూ మదురై కోర్టు ఆదేశాలు
Bharateeyudu 2: ‘భారతీయుడు 2’ సినిమా ఇప్పటికే ఎన్నో అడ్డంకులను దాటుకొని జులై 12న విడుదలకు సిద్ధమయ్యింది. ఫైనల్‌గా విడుదల అవుతుంది అనుకునే సమయంలో మేకర్స్‌కు మరొక సమస్య ఎదురయ్యింది.
Bharateeyudu 2: ప్యాన్ ఇండియా రేంజ్‌లో ఒక సినిమాను విడుదల చేయాలంటే దానికి తగినట్టుగా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. లేదా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుతం కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘భారతీయుడు 2’కు కూడా అదే పరిస్థితి ఎదురయ్యింది. ఈ సినిమాలో సేనాపతి క్యారెక్టర్‌లో తిరిగిరానున్నారు కమల్ హాసన్. ఇందులో తన పాత్రకు మర్మకళ విద్యలో ప్రావీణ్యం ఉంటుంది. కానీ ‘భారతీయుడు 2’లో మర్మకళను సీన్స్‌ను తన పుస్తకం నుంచి కాపీ కొట్టారని ఒక వ్యక్తి కోర్టు మెట్లు ఎక్కారు. కానీ ఆయన వేసిన పిటీషన్‌ను మధురై హైకోర్టు తోసిపుచ్చింది.
స్టే కుదరదు..
మర్మకళ గురించి చెప్తూ రాజేంద్రన్ అనే వ్యక్తి ఒక పుస్తకం రాశారు. అయితే అందులోని విషయాలను ఆధారంగా చేసుకొని ‘భారతీయుడు 2’లోని మర్మకళ సీన్స్‌ను తెరకెక్కించారని ఆయన ఆరోపించారు. ఈ విషయంపై న్యాయం కావాలంటూ మధురై హైకోర్టును ఆశ్రయించారు. రాజేంద్రన్ ఆరోపణలను ‘భారతీయుడు 2’ నిర్మాతలు ఖండించారు. ‘భారతీయుడు’ మొదటి భాగంలో కూడా కమల్ హాసన్ మర్మకళలో ప్రావీణ్యుడిగానే కనిపించారు. అవే సీన్స్‌ను సీక్వెల్‌లో కూడా కొనసాగించామని వారు అన్నారు. దీంతో రాజేంద్రన్ పిటీషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. ‘భారతీయుడు 2’ సినిమాకు స్టే ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పింది. ఇక ఈ సినిమా ఏ ఇబ్బంది లేకుండా విడుదలకు సిద్ధమయ్యింది.
చాలా ఏళ్ల వెయిటింగ్..
‘భారతీయుడు’ సినిమాతోనే శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్‌కు ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు. దాదాపు పాతికేళ్ల క్రితం ఈ మూవీ విడుదలయ్యింది. అప్పటినుంచి వీరిద్దరూ కలిసి మళ్లీ సినిమా ఎప్పుడు చేస్తారా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తూ ఉన్నారు. ఫైనల్‌గా ఏడేళ్ల క్రితం ‘భారతీయుడు’కు సీక్వెల్ వస్తుందని వార్తలు మొదలయ్యాయి. కోవిడ్ కంటే ముందే నిజంగానే ఈ సీక్వెల్ తెరకెక్కిస్తున్నామంటూ మేకర్స్ అనౌన్స్ చేశారు. ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ విషయాన్ని ప్రకటించారు. కానీ అప్పటినుంచి ఇప్పటివరకు ‘భారతీయుడు 2’ షూటింగ్‌లో ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. అవన్నీ దాటుకొని ఫైనల్‌గా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది ఈ భారీ బడ్జెట్ సీక్వెల్.
బజ్ తక్కువే..
1996లో విడుదలయిన సినిమాకు సీక్వెల్ కావడంతో ‘భారతీయుడు 2’పై ప్రేక్షకుల్లో బజ్ చాలా తక్కువగా ఉంది. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో కూడా విడుదల కానుంది. తమిళంలో కంటే తెలుగులోనే బుకింగ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. జులై 12న విడుదలకు సిద్ధమయ్యింది ‘భారతీయుడు 2’. అంటే విడుదలకు ఇంకా ఒక్కరోజే సమయం ఉంది. అయినా కూడా ఈ మూవీ గురించి ప్రేక్షకులు పెద్దగా మాట్లాడుకోవడం లేదు. ఇందులో కమల్ హాసన్‌తో పాటు రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్ కూడా కీలక పాత్రల్లో నటించారు. అందరూ కలిసి ‘భారతీయుడు 2’ను ప్రమోట్ చేసినా కూడా చాలావరకు ఆడియన్స్‌కు మూవీ రీచ్ అవ్వలేకపోయిందని ఇండస్ట్రీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: 'ఇండియన్ 2' ఫస్ట్ రివ్యూ... ఆడియన్స్‌లో బజ్ తక్కువే కానీ సూపర్ హిట్ రిపోర్ట్!