అన్వేషించండి

Rangabali Movie: న్యూస్ యాంకర్స్‌పై కమెడియన్ సత్య ఫన్ - ‘రంగబలి’ ఇంటర్వ్యూ వీడియో వైరల్!

నాగశౌర్య హీరోగా నటించిన 'రంగబలి' సినిమా ఎమోషన్స్ లో భాగంగా కమెడియన్ సత్య నాగశౌర్యను ఇంటర్వ్యూ చేసిన ప్రోమో వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.

ప్రజెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ టాలెంటెడ్ కమెడియన్స్ లో సత్య ఒకరు. ఇప్పటికే అగ్ర హీరోల సినిమాల్లో సత్య తన కామెడీ టైమింగ్ తో కమెడియన్గా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇతని కామెడీ టైమింగ్ చాలా యునీక్ గా ఉంటుంది. అయితే సత్య ఈమధ్య ఎక్కువగా సినిమాల్లో కనిపించడం లేదు. కాస్త గ్యాప్ తర్వాత ఇప్పుడు 'రంగబలి' సినిమాతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేందుకు రాబోతున్నాడు. యంగ్ హీరో నాగశౌర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'రంగబలి'. జూలై 7న రిలీజ్ కాబోతున్న ఈ మూవీకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు జెట్ స్పీడ్ లో జరుగుతున్నాయి. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచింది.

అందుకు ప్రధాన కారణం ట్రైలర్లో సత్య కామెడీ టైమింగ్, డైలాగ్స్ అని చెప్పాలి. ట్రైలర్లో 'స్పెర్మ్ ను రోడ్ మీద తేనె అమ్మినట్టు అమ్మేద్దామంటూ' అతను చెప్పిన డైలాగ్ ట్రైలర్ కే హైలైట్ గా నిలిచింది. ట్రైలర్ ని బట్టి చూస్తే 'రంగబలి' అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ కామెడీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని అర్థమవుతుంది.ఇక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా కమెడియన్ సత్య నాగశౌర్యను ఇంటర్వ్యూ చేశారు. ఇక ఈ ఇంటర్వ్యూ ప్రోమో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అందుకు కారణం ఇందులో కమెడియన్ సత్య కొంతమంది ప్రముఖ జర్నలిస్టులను ఇమిటేట్ చేస్తూ నాగశౌర్యను ఇంటర్వ్యూ చేయడమే. ఇక ఈ స్పెషల్ ఇంటర్వ్యూ ప్రోమో ఇప్పుడు ఆకట్టుకుంటుంది.

ఇక ప్రోమో విషయానికి వస్తే.. వివిధ టీవీ, యూట్యూబ్ చానెళ్లలో ఇంటర్వ్యూలు చేసే పాపులర్ యాంకర్స్, మూవీ ప్రెస్ మీట్స్‌లో వివాదాస్పద ప్రశ్నలు వేసే విలేకరులను సత్య ఇమిటేట్ చేయడమే కాకుండా ఆ జర్నలిస్టుల గెటప్స్ లో కనిపించాడు. వారిని సత్య అచ్చంగా దించేశాడు. చాలా అద్భుతంగా ఇమిటేట్ చేయడంతో సోషల్ మీడియాలో ఈ ప్రోమో కాస్త వైరల్ గా మారింది. ఇక ప్రోమో చివర్లో అయితే ఓ ప్రముఖ లేడీ యాంకర్ ని ఇమిటేట్ చేస్తూ.. ‘‘గెటవుట్ ఫ్రమ్ మై స్టూడియో’’ అంటూ అరవడం హైలెట్ అయింది. దీంతో కచ్చితంగా ఈ ఇంటర్వ్యూ సినిమా ప్రమోషన్స్ ‌కి బిగ్ ఎసెట్ అవుతుందని నిస్సందేహంగా చెప్పొచ్చు. తాజాగా విడుదలైన ప్రోమో వైరల్ అవుతుండగా ఈ ఫుల్ ఇంటర్వ్యూ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.

కాగా ఈ సినిమా ద్వారా నూతన దర్శకుడు పవన్ భాసం శెట్టి టాలీవుడ్ కి పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమాలో నాగశౌర్య సరసన యుక్తి తరేజ హీరోయిన్గా నటించింది. పవన్ సిహెచ్ సంగీతమందించిన ఈ సినిమా పాటలు ఇప్పటికే ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ అందుకున్నాయి. SLV సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కాగా నాగశౌర్య గత చిత్రం 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. మరి ఈ 'రంగబలి' సినిమా నాగశౌర్య కి ఎలాంటి సక్సెస్ ని అందిస్తుందో చూడాలి.

Also Read : నిఖిల్ 'స్పై' ఓటీటీ డేట్ లాక్ - స్ట్రీమింగ్ అందులోనే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rain Updates: అల్పపీడనం ఎఫెక్ట్, ఏపీలో ఆ జిల్లాలకు వర్ష సూచనతో అలర్ట్ - తెలంగాణలో వణికిస్తున్న చలి
అల్పపీడనం ఎఫెక్ట్, ఏపీలో ఆ జిల్లాలకు వర్ష సూచనతో అలర్ట్ - తెలంగాణలో వణికిస్తున్న చలి
Rohit Sharma: రోహిత్ చేసింది కరెక్టే, కాదు అతని కెరీర్ కే ప్రమాదం- బ్యాటింగ్ ఆర్డర్ మార్పుపై మాజీల వాదన
రోహిత్ చేసింది కరెక్టే, కాదు అతని కెరీర్ కే ప్రమాదం- బ్యాటింగ్ ఆర్డర్ మార్పుపై మాజీల వాదన
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
Allu Arjun: షాకింగ్... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అల్లు అర్జున్
షాకింగ్... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అల్లు అర్జున్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rain Updates: అల్పపీడనం ఎఫెక్ట్, ఏపీలో ఆ జిల్లాలకు వర్ష సూచనతో అలర్ట్ - తెలంగాణలో వణికిస్తున్న చలి
అల్పపీడనం ఎఫెక్ట్, ఏపీలో ఆ జిల్లాలకు వర్ష సూచనతో అలర్ట్ - తెలంగాణలో వణికిస్తున్న చలి
Rohit Sharma: రోహిత్ చేసింది కరెక్టే, కాదు అతని కెరీర్ కే ప్రమాదం- బ్యాటింగ్ ఆర్డర్ మార్పుపై మాజీల వాదన
రోహిత్ చేసింది కరెక్టే, కాదు అతని కెరీర్ కే ప్రమాదం- బ్యాటింగ్ ఆర్డర్ మార్పుపై మాజీల వాదన
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
Allu Arjun: షాకింగ్... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అల్లు అర్జున్
షాకింగ్... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అల్లు అర్జున్
NITW: వరంగల్ నిట్‌లో నాన్‌ టీచింగ్ పోస్టులు, వివరాలు ఇలా
NITW: వరంగల్ నిట్‌లో నాన్‌ టీచింగ్ పోస్టులు, వివరాలు ఇలా
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Embed widget