![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Pushpa 2 Surprise: ఫుల్ సాంగ్ కంటే ముందు సెన్సేషనల్ సర్‌ప్రైజ్ - ప్లాన్ చేసిన మూవీ టీం - అదేంటబ్బా!
'పుష్ప 2' నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్‌కు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. నిన్న విడుదల చేసిన ప్రొమో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ ఫుల్ సాంగ్ కంటే ముందు సెన్సేషనల్ సర్‌ప్రైజ్ రాబోతుంది.
![Pushpa 2 Surprise: ఫుల్ సాంగ్ కంటే ముందు సెన్సేషనల్ సర్‌ప్రైజ్ - ప్లాన్ చేసిన మూవీ టీం - అదేంటబ్బా! A Sensational Surprise on The Way for Pushpa 2 Fans Before First Single Release Pushpa 2 Surprise: ఫుల్ సాంగ్ కంటే ముందు సెన్సేషనల్ సర్‌ప్రైజ్ - ప్లాన్ చేసిన మూవీ టీం - అదేంటబ్బా!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/25/6216873f851dc6006b4ff4a3beccdba41714039341954929_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Pushpa 2 Sensational Surprise Awaited: టాలీవుడ్ మోస్ట్ అవైయిటెడ్ చిత్రాల్లో 'పుష్ప 2' ఒకటి. అల్లు అర్జున్-క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇందులో పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ యాక్టింగ్‌కి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. తనదైన యాక్టింగ్ స్కిల్స్‌తో బన్నీ అన్ని భాషల ఆడియన్స్‌ని ఆకట్టుకున్నాడు. ఇక పాటలకు వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంత కాదు. ఎక్కడ చూసిన పుష్ప పాటలే మారుమోగాయి. ఇంటర్నేషనల్ వేదికలపై కూడా శ్రీవల్లి, ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా పాటలు ప్రదర్శన కూడా జరిగింది. అంతగా పుష్ప మూవీ, పాటలు సన్సేషన్ క్రియేట్ చేశాయి. అందుకే పుష్ప 2 ఆడియోకి ఫుల్ డిమాండ్ పెరిగింది. రిలీజ్‌కు ముందే 'పుష్ప 2' ఆడియో రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయినట్టు ఇన్‌సైడ్ సినీ సర్కిల్లో టాక్.
ఇక రిలీజ్ టైం దగ్గరపడుతుంటంతో పుష్ప 2 జాతరను మొదలు పెట్టేస్తుంది మూవీ టీం. టీజర్ నుంచి మొదలు వరుసగా అప్‌డేట్స్‌తో సర్‌ప్రైజ్ చేస్తున్నారు. మే 1న ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. నిన్నే ప్రొమో రిలీజ్ చేయగా దానికి భారీ రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా మరో సన్సేషనల్ సర్‌ప్రైజ్ అంటూ మూవీ టీం ట్వీట్ చేసింది. "మే 1న పుష్ప 2 ఫస్ట్ సింగిల్ ఫుల్ సాంగ్ వచ్చేస్తోంది. అయితే దానికి కంటే ముందు మీకు మరో సన్సేషనల్ సర్‌ప్రైజ్ రాబోతుంది. అప్పటి వరకు ట్యూన్ చేస్తూ ఉండండి" అంటూ మూవీ టీం తాజాగా ట్వీట్ చేసింది. దీంతో అంతా ఈ సర్‌ప్రైజ్ ఎంటా అని ఆలోచనలో పడ్డారు. ప్రస్తుతం ఈ ట్వీట్ హాట్‌టాపిక్ అవుతుంది. సన్సేషనల్ సర్‌ప్రైజ్ అంటే డైరెక్టర్ సుకుమార్ ఏదో భారీగానే ప్లాన్ చేశారంటున్నారు. మరి ఇది సాంగ్‌కి సంబంధించిందా? లేదా మరేదైనా పుష్ప 2 అప్‌డేట్ అనేది తెలియాలంటే అంతా వేచి చూడక తప్పదు.
We said it.
— Pushpa (@PushpaMovie) April 25, 2024
You did it.#PushpaPushpa is resonating all over 🔥
May 1st @ 11.07 ❤🔥
Before the full song, stay tuned for a sensational surprise 💥💥#Pushpa2FirstSingle #Pushpa2TheRule pic.twitter.com/jARH7EeKdA
కాగా పుష్ప 1కు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. ఫస్ట్ పార్ట్స్ సాంగ్స్ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. దీంతో సీక్వెల్ కి కూడా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. దీంతో పార్ట్ 2 కోసం దేవి మరోసారి తనదైన మార్క్ చూపిస్తూ మాస్ సాంగ్స్ రెడీ చేశారట. అందులో నుంచి పుష్ప.. పుష్ప.. పుష్పరాజ్ అం టూ ఫస్ట్‌సాంగ్ రాబోతుంది. మరి ఈ పాట రిలీజ్ తర్వాత ఈ 'పుష్ప 2' ఫస్ట్ సింగిల్ యూట్యూబ్‌ను ఏ రేంజ్‌లో షేక్ చేస్తుందో చూడాలి. ఇందులో అల్లు అర 'పుష్ప 2' ఆగస్ట్ 15న భారీ వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇందులో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. అలాగే అనసూయ భరద్వాజ్, సునీల్, రావు రమేష్, జగపతి బాబు వంటి అగ్ర నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు రిలీజ్‌కు ముందే ప్రీరిలీజ్ బిజినెస్ భారీగా జరుగుతున్నట్టు ఇన్‌సైడ్ సినీ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)