(Source: ECI/ABP News/ABP Majha)
Chiranjeevi : న్యూయార్క్ టైం స్క్వేర్స్ పై చిరంజీవి ఫోటో- మెగాస్టార్ కి వినూత్న రీతిలో శుభాకాంక్షలు చెప్పిన ఎన్నారై అభిమాని!
Chiranjeevi : చిరంజీవికి పద్మవిభూషణ్ వరించడంతో ఓ ఎన్నారై అభిమాని వినూత్న రీతిలో మెగాస్టార్ కి శుభాకాంక్షలు తెలియజేశాడు.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల పద్మ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశంలోని సినీ, కళారంగం, విద్య, వ్యాపారం, సాంకేతిక రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులకు ఈ ప్రతిష్టాత్మక అవార్డులను అందిస్తుంది. ప్రతి ఏటా రిపబ్లిక్‌డే సందర్భంగా ప్రకటించే ఈ అవార్డులకు మన తెలుగు తేజాలు ఉండటం విశేషం. ఇందులో మెగాస్టార్ చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి పద్మవిభూషణ్ వరించాయి. ఇక కళారంగంలో అందించిన విశేష సేవలకు గానూ మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ వరించింది. ఈ సందర్భంగా ఆయనకు సినీ రాజకీయ ప్రముఖుల నుంచి ఆయనకు అభినందనలు తెలియజేశారు దేశంలోని రెండో అతిపెద్ద పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ చిరంజీవికి దక్కడంతో ఆయన అభిమానులు ఎంతో ఆనందించారు
న్యూ యార్క్ టైమ్ స్క్వేర్ పై చిరంజీవి ఫోటో
చిరంజీవికి పద్మభూషణ్ గౌరవం దక్కడం పట్ల న్యూయార్క్ చెందిన అభిమాని మెగాస్టార్ కి వినూత్నంగా అభినందనలు తెలియజేశారు. ప్రఖ్యాత న్యూయార్క్ టైం స్క్వేర్ స్ట్రీట్ లో మెగాస్టార్ ఫోటో ని ప్రదర్శించి తన అభిమానాన్ని చాటుకున్నాడు. కుందవరపు శ్రీనివాస్ నాయుడు అనే ఎన్నారై తన అభిమాన హీరో చిరంజీవికి పద్మ విభూషణ్ వరించడంతో శుభాకాంక్షలు తెలియజేస్తూ చిరంజీవి ఫోటోలు న్యూయార్క్ టైం స్క్వేర్ పై ప్రదర్శనకు పెట్టాడు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. న్యూయార్క్ టైం స్క్వేర్ పై మెగాస్టార్ ఫోటోలు చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు.
విశ్వంభర గురించి..
Padma Vibhushan Megastar #Chiranjeevi garu's Visuals Display Wishes by Mega Fans at the Times Square, NY, USA
— Chiranjeevi Army (@chiranjeeviarmy) January 30, 2024
Boss @KChiruTweets#MegastarChiranjeevi#PadmaVibhushanChiranjeevi pic.twitter.com/rrzY3pR0sF
'బింబిసార' మూవీ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కునున్న ఈ సినిమా సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రల్ లో ఉండబోతోంది. ఈ సినిమాను యువీ క్రియేషన్స్ సంస్థ సుమారు రూ. 200 కోట్లతో తెరకెక్కించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ఇటీవలే ఈ మూవీకి ‘విశ్వంభర’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ రిలీజ్ చేసిన టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో నుంచి భారీ రెస్పాన్స్ అందుతుంది. సినిమాలో చిరంజీవి గోదావరి జిల్లాకు చెందిన వాడిలా కనిపించబోతున్నాడనే టాక్ నడుస్తోంది.
చిరు ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ గోదావరి జిల్లాకు చెందిన వాడిగా మాత్రం కనిపించలేదు. మొదటి సారి గోదావరి యాసలో మాట్లాడుతూ రచ్చ చేయబోతున్నాడట. అలాగే ఈ సినిమాలో చిరంజీవి పేరు 'దొరబాబు' అని ఫిక్స్ అయినట్లు కూడా తెలుస్తోంది. ఇందులో ఎంత వరకు నిజం ఉందనేది తెలియదు కానీ ఈ వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
భారీ ధరకు 'విశ్వంభర' ఓవర్సీస్ రైట్స్
'విశ్వంభర' ఓవర్సీస్ రైట్స్ 18 కోట్ల రూపాయలకు అమ్ముడైనట్లు తెలిసింది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ మొత్తంలో ఓ సినిమాకు ఓవర్సీస్ హక్కుల ద్వారా ఇంత మొత్తం రావడం ఇదే మొదటిసారి. సీనియర్ హీరోలలో రూ.15 కోట్లకు పైగా ఓవర్సీస్ రైట్స్ అమ్ముడవ్వడం ఇప్పటివరకు జరగలేదు. ఇది కేవలం మెగాస్టార్ సినిమాకి మాత్రమే సాధ్యమైంది.
Also Read : షారుఖ్ ఖాన్‌తో కలిసి పని చేయనున్న 'కేజీఎఫ్' హీరో - ఆ బ్యానర్‌లో యశ్ రెండో బాలీవుడ్ ప్రాజెక్ట్!