News
News
X

Chiranjeevi Targets Summer : సంక్రాంతి హిట్టు - సమ్మర్ చిరంజీవికి హిట్ ఇస్తుందా?

Chiranjeevi Bhola Shankar Movie Release Date : సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య' సినిమాతో చిరంజీవి హిట్ అందుకున్నారు. మరి, సమ్మర్ సంగతి ఏంటి?

FOLLOW US: 
Share:

సంక్రాంతికి విడుదలైన మెగాస్టార్ చిరంజీవి సినిమాలు చాలా ఉన్నాయ్! వాటిలో చాలా వరకు విజయాలు ఉన్నాయి. రీ ఎంట్రీలోనూ సంక్రాంతి చిరంజీవికి కలిసి వచ్చింది. 'ఖైదీ నంబర్ 150', లేటెస్టుగా 'వాల్తేరు వీరయ్య'... సంక్రాంతి బరిలో విజయాలు సాధించాయి. సంక్రాంతికి చిరు సినిమాలు వస్తే హిట్టు! మరి, సమ్మర్ సంగతి ఏంటి? ఇప్పుడు వేసవి మీద చిరు కన్నేశారట!

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అసలు పేరు ఏంటి? కొణిదెల శివ శంకర వర ప్రసాద్! ఆ పేరులో శివుడు ఉన్నాడు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా సినిమా 'భోళా శంకర్' (Bholaa Shankar). పరమ శివుడిని 'భోళా శంకరుడు' అంటారు కదా! ఆ విధంగా సినిమా పేరులోనూ శివుడు ఉన్నాడు. సినిమా పేరులో చిరు అసలు పేరు భాగమైన చిత్రమిది. 

మే 12న 'భోళా శంకర్' విడుదల?
చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న 'భోళా శంకర్' చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా సినిమాలో హీరో ఫస్ట్ లుక్ విడుదల చేశారు. చేతిలో త్రిశూలంతో కూడిన చైను... జీప్ ముందు కూర్చున్న మెగాస్టార్ ఫోజు... లుక్ చాలా స్టయిలిష్ అంటూ మెగా ఫ్యాన్స్ సంబరపడ్డారు. ఈ సినిమా గురించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే... వేసవికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. 

మే 12న 'భోళా శంకర్' (Bholaa Shankar Release Date) ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. సమ్మర్ సీజన్ కాబట్టి ఫ్యామిలీలు థియేటర్లకు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. పైగా, సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది.

'భోళా శంకర్'లో చిరంజీవి చెల్లెలి పాత్రలో జాతీయ పురస్కార గ్రహీత కీర్తీ సురేష్, చిరు సరసన కథానాయికగా మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా నటిస్తున్నారు. 'సైరా నరసింహా రెడ్డి' తర్వాత చిరు, తమన్నా నటిస్తున్న చిత్రమిది. ఆ సినిమాలో ఇద్దరి మధ్య ఓ మెలోడీ షూట్ చేసినప్పటికీ... విడుదల చేశారు. సినిమాలో ఆ పాటకు కత్తెర వేశారు. తర్వాత కూడా బయటకు రానివ్వడం లేదు. సో... 'భోళా శంకర్'లో ఇద్దరు జంటగా చేసే డ్యాన్స్ ప్రేక్షకులు చూడొచ్చు.

Also Read : టాలీవుడ్‌ను వణికించిన జనవరి 27 - ఒక షాక్ తర్వాత మరొక షాక్   

ప్రముఖ నిర్మాత కె.ఎస్. రామారావుకు చెందిన క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ  నిర్మిస్తున్న చిత్రమిది. మణిశర్మ కుమారుడు, యువ సంగీత సంచలనం మహతి స్వరసాగర్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు. 'వెన్నెల' కిశోర్, అర్జున్ దాస్, రష్మీ గౌతమ్, తులసి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ చేశారు. ప్రధాన తారాగణంపై కొన్ని సన్నివేశాలు కూడా తెరకెక్కించారు.  

Also Read : ఆగస్టు నుంచి దసరాకు వెళ్ళిన మహేష్ - త్రివిక్రమ్?

తమిళంలో అజిత్ నటించిన 'వేదాళం'కు రీమేక్ ఇది. ఈ సినిమాలో చిరు గుండుతో కనిపించవచ్చు. ఆ మధ్య సోషల్ మీడియాలో గుండు లుక్ పోస్ట్ చేసింది కూడా ఈ సినిమా టెస్టింగ్ లో భాగమే. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథ పర్యవేక్షణ: సత్యానంద్, సంభాషణలు: తిరుపతి మామిడాల, కూర్పు: మార్తాండ్ కె వెంకటేష్, ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్. 

Published at : 28 Jan 2023 09:51 AM (IST) Tags: Bhola Shankar Movie Chiranjeevi Vedalam Telugu Remake Bhola Shankar On May 12th

సంబంధిత కథనాలు

Hero Srikanth: ఇంట్లో చెప్పకుండా చెన్నై పారిపోయా, ఆ నాలుగు రోజులు నరకం చూశా: హీరో శ్రీకాంత్

Hero Srikanth: ఇంట్లో చెప్పకుండా చెన్నై పారిపోయా, ఆ నాలుగు రోజులు నరకం చూశా: హీరో శ్రీకాంత్

Actor Ajith Father Died : కోలీవుడ్ హీరో అజిత్ ఇంట్లో విషాదం - హీరో తండ్రి మృతి 

Actor Ajith Father Died : కోలీవుడ్ హీరో అజిత్ ఇంట్లో విషాదం - హీరో తండ్రి మృతి 

Janaki Kalaganaledu March 24th: మనోహర్ కంట పడకుండా తప్పించుకున్న జానకి- హనీమూన్ సంగతి తెలిసి కుళ్ళుకున్న మల్లిక

Janaki Kalaganaledu March 24th: మనోహర్ కంట పడకుండా తప్పించుకున్న జానకి- హనీమూన్ సంగతి తెలిసి కుళ్ళుకున్న మల్లిక

Ustad Bhagat Singh Shoot : రాసుకో సాంబ - షూటింగుకు ఉస్తాద్ పవన్ కళ్యాణ్ రెడీ

Ustad Bhagat Singh Shoot : రాసుకో సాంబ - షూటింగుకు ఉస్తాద్ పవన్ కళ్యాణ్ రెడీ

Guppedanta Manasu March 24th: తన స్థానం ఏంటో దేవయానికి క్లారిటీ ఇచ్చిన వసు, కాలేజీలోకి ఎంటరైన కొత్త విలన్ రిషికి దొరికిపోయినట్టేనా!

Guppedanta Manasu March 24th: తన స్థానం ఏంటో దేవయానికి క్లారిటీ ఇచ్చిన వసు, కాలేజీలోకి ఎంటరైన కొత్త విలన్ రిషికి దొరికిపోయినట్టేనా!

టాప్ స్టోరీస్

300కార్లతో ర్యాలీ- టీడీపీలోకి వెళ్లే సమయంలో కోటంరెడ్డి బలప్రదర్శన

300కార్లతో ర్యాలీ- టీడీపీలోకి వెళ్లే సమయంలో కోటంరెడ్డి బలప్రదర్శన

TSPSC Paper Leak: ఉదాసీనతే కొంప ముంచిందా? విధులు నిర్వహిస్తూనే పరీక్షలకు హాజరైన కమిషన్ ఉద్యోగులు! అయినా నో రెస్పాన్స్!

TSPSC Paper Leak: ఉదాసీనతే కొంప ముంచిందా? విధులు నిర్వహిస్తూనే పరీక్షలకు హాజరైన కమిషన్ ఉద్యోగులు! అయినా నో రెస్పాన్స్!

TSRTC Dynamic Pricing: రద్దీ టైంలో తెలంగాణ బస్‌ టికెట్లపై బాదుడు - కిటికీ పక్క సీటు స్పెషల్ కాస్ట్- ఈనెల 27 నుంచే అమలు 

TSRTC Dynamic Pricing: రద్దీ టైంలో తెలంగాణ బస్‌ టికెట్లపై బాదుడు - కిటికీ పక్క సీటు స్పెషల్ కాస్ట్- ఈనెల 27 నుంచే అమలు 

పది పరీక్షలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం-విద్యార్థులకు ఏపీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్

పది పరీక్షలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం-విద్యార్థులకు ఏపీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్