Waltair Veerayya Title Song : గ్యాంగ్ లీడర్‌ను గుర్తు చేస్తున్న వీరయ్య - టైటిల్ సాంగ్‌తో రఫ్ఫాడించడానికి రెడీ
Waltair Veerayya Movie Title Song Update : 'వాల్తేరు వీరయ్య' సినిమా టైటిల్ సాంగ్ త్వరలో విడుదల కానుంది. అయితే, సాంగ్ పోస్టర్ లుక్ మెగా ఫ్యాన్స్‌కు 'గ్యాంగ్ లీడర్' రోజులు గుర్తు చేశాయి.
'చెయ్యి చూశారా... ఎంత రఫ్‌గా ఉందో? రఫ్ఫాడించేస్తా!' - స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ డైలాగ్ చదివినా, విన్నా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) 'గ్యాంగ్ లీడర్' సినిమా గుర్తుకు వస్తుంది. ఆ సినిమా ఇంపాక్ట్ అలాంటిది మరి! ఇప్పుడు మెగా అభిమానులకు మళ్ళీ ఆ రోజులను దర్శకుడు బాబీ గుర్తు చేయడానికి రెడీ అయ్యారు.
చిరంజీవి కథానాయకుడిగా ఆయన వీరాభిమాని బాబీ కొల్లి (కె.ఎస్. రవీంద్ర) తెరకెక్కిస్తున్న సినిమా 'వాల్తేరు వీరయ్య' (Waltair Veerayya). ఇందులోని రెండు పాటలను విడుదల చేశారు. ఒకటి... 'బాస్ పార్టీ'. అది ఆడియన్స్‌లోకి బాగా వెళ్ళింది. రెండోది... 'నువ్వు శ్రీదేవి అయితే నేను చిరంజీవి'. ఇది మెలోడియస్‌గా ఉంది. ఇప్పుడు మూడో పాటను విడుదల చేయడానికి రెడీ అయ్యారు.
డిసెంబర్ 26న టైటిల్ సాంగ్
Waltair Veerayya Title Song : 'వాల్తేరు వీరయ్య' టైటిల్ సాంగ్‌ను డిసెంబర్ 26న.... అంటే సోమవారం విడుదల చేయనున్నట్లు ఈ రోజు వెల్లడించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన స్టిల్ చూస్తే... మెగా అభిమానులతో పాటు ప్రేక్షకులకు 'గ్యాంగ్ లీడర్' గుర్తుకు రావడం ఖాయం. మెగా ఫ్యాన్స్ అప్పటి లుక్, ఇప్పటి లుక్ పక్క పక్కన పెట్టి షేర్స్ చేస్తున్నారు. దర్శకుడు బాబీ కూడా ''ఇంక రఫ్ ఆడిద్దాం!!'' అంటూ అంచనాలు పెంచేస్తున్నారు. ''మాస్ మూలవిరాట్ విశ్వరూపం చూడండి'' అంటూ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పేర్కొంది.
Also Read : పవన్ కళ్యాణ్ 'వీరమల్లు' కోసం హిందీ హీరో వచ్చాడోచ్
ఇంక రఫ్ ఆడిద్దాం!! 🔥🔥
— Bobby (@dirbobby) December 24, 2022
MEGA MASS Loaded #WaltairVeerayya TITLE song Releasing on Dec 26th 🎶💥
Get ready to witness Mass Moolavirat's Vishwaroopam 🔥#WaltairVeerayyaOnJan13th
Megastar @KChiruTweets @RaviTeja_offl Rockstar @ThisIsDSP @shrutihaasan @ThisIsDSP @MythriOfficial pic.twitter.com/6WfUlcf3Fi
సంక్రాంతి బరిలో వీరయ్య
సంక్రాంతి కానుకగా జనవరి 13న 'వాల్తేరు వీరయ్య' చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. దాని కంటే ముందు జనవరి 8న విశాఖలో 'వాల్తేరు వీరయ్య' ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారట. అంతే కాదు... మెగా ఫ్యాన్స్ కోసం సికింద్రాబాద్ నుంచి విశాఖకు స్పెషల్ ట్రైన్ వేయాలని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఆలోచిస్తోందని తెలిసింది. భారీ ఎత్తున ఫంక్షన్ చేయాలని ప్లాన్ చేశారట.
విశాఖ నేపథ్యంలో సినిమా రూపొందింది. వాల్తేరు విశాఖలో ఉంది. ఆ ఏరియా మనిషిగా చిరంజీవి సినిమాలో కనిపించనున్నారు. ఇంకో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే... ఆయన తమ్ముడిగా రవితేజ తెలంగాణ వ్యక్తిగా కనిపించనున్నారట. ఈ రిలేషన్ ఏంటో తెలియాలంటే సినిమా చూడాలి. ఇందులో రవితేజ జోడీగా కేథరిన్ కనిపించనున్నారు. ఈ ఇద్దరి మధ్య ఘాటు లిప్ లాక్ ఉందని తెలిసింది. ఈ మధ్య ఆ సీన్ షూట్ చేశారట.
Also Read : బాలకృష్ణ కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ - ముగ్గురు హీరోయిన్లు ఏం చెప్పారంటే?
ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవి శంకర్ నిర్మిస్తున్నారు. చిత్ర దర్శకుడు బాబీ కథ, మాటలు రాయగా... స్క్రీన్‌ప్లే : కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి అందిస్తున్నారు. హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : ఆర్థర్ ఎ విల్సన్, ఎడిటర్: నిరంజన్ దేవరమానె, ప్రొడక్షన్ డిజైనర్: ఎఎస్ ప్రకాష్, కాస్ట్యూమ్ డిజైనర్: సుష్మిత కొణిదెల, సహ నిర్మాతలు: జీకే మోహన్, ప్రవీణ్ ఎం.