By: ABP Desam | Updated at : 24 Jun 2022 12:53 PM (IST)
Edited By: harithac
(Image credit: Twitter)
Mega154: మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న వార్త రానే వచ్చింది. చిరు తన తరువాతి సినిమా ప్రకటన వచ్చేసింది. మెగా 154 పేరుతో ప్రస్తుతానికి ఆ సినిమా ట్రెండవుతోంది. ఇందులో హీరోయిన్‌గా శుత్రిహాసన్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ని శుక్రవారం మైత్రి మూవీ మేకర్స్ వారు విడుదల చేశారు. ఇందులో చిరంజీవితో చేతిలో లంగరు కనిపిస్తోంది. ‘బాక్సాఫీసు వేటకు లంగరు తయారు. మెగా 154 ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో 2023 సంక్రాతికి విడుదల కాబోతోంది’ అని క్యాప్షన్ పెట్టారు. పోస్టర్ పై ‘కలుద్దాం సంక్రాంతికి’ అని రాసి ఉంది.
ప్రస్తుతం చిరు భోళా శంకర్, గాడ్ ఫాదర్ సినిమా షూటింగులతో బిజీగా ఉన్నారు. ఆ సినిమాల తరువాత ఈ సినిమా విడుదలవుతుంది. ఈ సినిమాకు ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్ అనుకుంటున్నారు. ఈ మేరకు చిరంజీవి ఓ ఇంటర్య్వూలో చెప్పినప్పటికీ పోస్టర్లో మాత్రం ఆ టైటిల్ లేదు. త్వరలో టైటిల్ ప్రకటిస్తాం అని చిత్ర యూనిట్ చెబుతోంది. టైటిల్ మార్చే ఉద్దేశంలో ఉన్నారేమో అన్న అనుమానం అభిమానుల్లో ఉంది.
గాడ్ ఫాదర్ సినిమా సెప్టెంబరులో విడుదల కానుంది. ఆ తరువాత చిరు బాబీ దర్శకత్వంలో చేస్తున్న సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. ఆ తరువాతే ఈ మెగా154 విడుదలవుతుంది. చిరు చేతి నిండా సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. వచ్చే సంక్రాంతి బరిలో చిరు సినిమా ఉన్నట్టేనని ఈ ప్రకటనతో అర్థమవుతోంది.
Also read: పవిత్ర లోకేష్‌తో నరేష్ నాలుగో పెళ్లి? అసలు నిజం ఇది
Also read: పెళ్లి ఒక ఫెయిల్యూర్, నాలుగో పెళ్లి గురించి మాట్లాడుతూ నరేష్ వివాదాస్పద వ్యాఖ్యలు
Ileana Babymoon : డెలివరీకి ముందు పార్ట్నర్తో హాలిడేకి వెళ్లిన ఇలియానా!
Trivikram: సెంటిమెంట్‌ను ఫాలో అవ్వని త్రివిక్రమ్ - ‘గుంటూరు కారం’ ఫలితం ఎలా ఉంటుందో?
Pareshan Movie Review - 'పరేషాన్' సినిమా రివ్యూ : 'మసూద' తర్వాత తిరువీర్‌కు మరో హిట్!?
మహేష్ కోసం థమన్ కాపీ ట్యూన్ ఇచ్చాడా? 'గుంటూరు కారం' బీట్‌ను అక్కడి నుంచి లేపేశాడా?
ఎన్టీఆర్ మాస్టర్ ప్లాన్ - రెండు సినిమాల షూటింగ్స్ ఒకేసారి!
Balineni Meet Jagan : సీఎం జగన్‌తో బాలినేని భేటీ - చర్చలపై ఏం చెప్పారంటే ?
Telangana Formation Day: తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన 12 సంఘటనలు, చారిత్రక ఘట్టాలు ఇవే!
TSRTC: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పిన సజ్జనార్, వచ్చే నెల నుంచి పండగే!
Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ