News
News
X

Chirajeevi: మైనస్ 8 డిగ్రీల చలిలో షూటింగ్ అంటూ సాంగ్ లీక్ చేసేసిన చిరంజీవి, ఇదిగో వీడియో

ఈ నెల 12 వ తేదీన శృతి హాసన్ తో తీయాల్సిన బ్యాలెన్స్ సాంగ్ షూటింగ్ ఫినిష్ అయిందని చెప్పారు చిరు. ఆ పాటను సౌత్ ఆఫ్ ఫ్రాన్స్ లో స్విజర్లాండ్-ఇటలీ బోర్డర్ లో ఉన్న ఆల్ప్స్ మౌంటెన్ లోయలో..

FOLLOW US: 
Share:

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న సినిమా ‘వాల్తేరు వీరయ్య’. దర్శకుడు బాబి దర్వకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదల అయిన దగ్గర నుంచీ కొత్త కొత్త అప్డేట్ లు ఇస్తూ సినిమాపై మరింత అంచనాలు పెంచేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తవుతున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా బిజీ బిజీ గా జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇటీవలె చిత్ర యూనిట్ శృతి హాసన్, చిరంజీవి పై ఓ పాట చిత్రీకరణలో భాగంగా పారీస్‌కు వెళ్లింది. తాజాగా ఆ పాటకు సంబంధించిన షూటింగ్ పూర్తయిందట. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఓ వీడియోలో తెలియజేశారు. పనిలో పనిగా ఆ పాటను లీక్ చేసి.. అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచారు. 

ఇప్పుడు చిరంజీవి విడుదల చేసిన ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ నెల 12వ తేదీన శృతి హాసన్ తో తీయాల్సిన బ్యాలెన్స్ సాంగ్ షూటింగ్ ఫినిష్ అయిందని చెప్పారు చిరు. ఆ పాటను సౌత్ ఆఫ్ ఫ్రాన్స్ లో స్విజర్లాండ్-ఇటలీ బోర్డర్ లో ఉన్న ఆల్ప్స్ మౌంటెన్ లోయలో చిత్రీకరించారని చెప్పారు. ఈ లోయలో లొకేషన్స్ చూస్తే చాలా అద్భుతంగా ఉన్నాయని, అక్కడి లోయ అందాలు చూసి తాను కూడా చాలా ఎగ్జైట్ అయ్యానని అన్నారు. అందుకే ఆ ఆనందాన్ని ఆపుకోలేక తానే స్వయంగా అక్కడి లొకేషన్స్ లో కొన్ని వీడియోలను షూట్ చేసి షేర్ చేస్తున్నానని తెలిపారు. లొకేషన్స్ చూడటానికి చాలా అందంగా ఉన్నా.. అంతకుమించి చలి ఉందని అన్నారు. సాంగ్ ను షూట్ చేసే సమయంలో మైనస్ 8 డిగ్రీల చలిలో డాన్స్ చేశామని చెప్పారు. దీంతో షూటింగ్ లో స్టెప్స్ చేయడానికి కూడా చాలా కష్టమైందని అయినా ఫ్యాన్స్ ఆనందం కోసం గడ్డకట్టే చలిని కూడా తట్టుకొని డాన్స్ చేశానని అన్నారు చిరు.

ఈ పాట కోసం టీమ్ లో ప్రతీ ఒక్కరూ చాలా కష్టపడ్డారని, తమ కష్టానికి తగ్గట్టుగానే పాట చాలా బాగా వచ్చిందన్నారు. సినిమాలో ఈ పాట ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని అన్నారు. ఇక ఈ పాటకు సంబంధించి లిరికల్ వీడియో త్వరలోనే విడుదల చేస్తారని తెలిపారు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ వీడియో లో షూట్ చేసిన పాటలోని చిన్న లైన్ ను వీడియోలో వినిపించారు చిరు. ‘‘నువ్ శ్రీదేవి అయితే.. నేనే చిరంజీవి అంటా.. రాయే రాయే చేసేద్దాం లవ్వూ’’ అంటూ సాగే పాటలో చిన్న బిట్ ను లీక్ చేశారు చిరంజీవి. దీంతో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది. 

ఇక ఈ సినిమా జనవరి 13 న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో చిరంజీవి తో పాటు మాస్ మహరాజ్ రవితేజ కూడా ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఆయకు సంబంధించిన ఇంట్రో వీడియో కూడా అదిరిపోవడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మైత్రీ  మూవీ మేకర్స్ నిర్మాణంలో  తెరకెక్కిన ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా చేస్తుంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 

Read Also: బాలీవుడ్ సినిమాల పతనానికి కారణం వాళ్లే, దర్శకుడు రాజమౌళి సంచనల వ్యాఖ్యలు

View this post on Instagram
 
A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela)

Published at : 14 Dec 2022 07:56 PM (IST) Tags: Shruti Haasan Bobby Ravi Teja chirajeevi Waltair veerayya

సంబంధిత కథనాలు

Thalapathy67: కత్తులు, చాక్లెట్లు, విజయ్, విలన్స్ - ప్రోమోతోనే సిక్సర్ కొట్టిన లోకేష్ కనగరాజ్ - టైటిల్ ఏంటో తెలుసా?

Thalapathy67: కత్తులు, చాక్లెట్లు, విజయ్, విలన్స్ - ప్రోమోతోనే సిక్సర్ కొట్టిన లోకేష్ కనగరాజ్ - టైటిల్ ఏంటో తెలుసా?

Amigos Trailer : ముగ్గురిలో ఒకడు రాక్షసుడు అయితే - కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్ వచ్చేసిందోచ్

Amigos Trailer : ముగ్గురిలో ఒకడు రాక్షసుడు అయితే - కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్ వచ్చేసిందోచ్

‘ఫరాజ్’ సినిమాకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ - స్టే నిరాకరణ, వివాదం ఏమిటీ?

‘ఫరాజ్’ సినిమాకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ - స్టే నిరాకరణ, వివాదం ఏమిటీ?

K Viswanath Oscars : ఆస్కార్ బరిలో నిలిచిన తొలి తెలుగు దర్శకుడు విశ్వనాథ్

K Viswanath Oscars : ఆస్కార్ బరిలో నిలిచిన తొలి తెలుగు దర్శకుడు విశ్వనాథ్

రాతిలోని శిల్పాన్ని గుర్తించగల మహా శిల్పి విశ్వనాథ్ - ఆయన సినిమాల్లో ఈ విషయాలను గుర్తించారా?

రాతిలోని శిల్పాన్ని గుర్తించగల మహా శిల్పి విశ్వనాథ్ - ఆయన సినిమాల్లో ఈ విషయాలను గుర్తించారా?

టాప్ స్టోరీస్

Krishna Tribunal : కొత్త కృష్ణా ట్రైబ్యునల్ ఏర్పాటుపై వీడని సందిగ్ధత, అభిప్రాయం చెప్పేందుకు ఏజీ నిరాకరణ

Krishna Tribunal : కొత్త కృష్ణా ట్రైబ్యునల్ ఏర్పాటుపై వీడని సందిగ్ధత, అభిప్రాయం చెప్పేందుకు ఏజీ నిరాకరణ

నన్ను ఎన్ కౌంటర్ చేయించండి- కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు

నన్ను ఎన్ కౌంటర్ చేయించండి- కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Hindenburg Research: కుబేరుడు అదానీ ఆస్తులను ఊదేస్తున్న ఈ మొండిఘటం ఎవరు !

Hindenburg Research: కుబేరుడు అదానీ ఆస్తులను ఊదేస్తున్న ఈ మొండిఘటం ఎవరు !

YS Sharmila : మళ్లీ కేసీఆర్ ను నమ్మితే రాష్ట్రాన్ని అమ్మేస్తారు, రైతు బంధు తప్ప అన్ని సబ్సిడీలు బంద్- వైఎస్ షర్మిల

YS Sharmila : మళ్లీ కేసీఆర్ ను నమ్మితే రాష్ట్రాన్ని అమ్మేస్తారు, రైతు బంధు తప్ప అన్ని సబ్సిడీలు బంద్- వైఎస్ షర్మిల