అన్వేషించండి

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today March 22: మిత్రాకు పిల్లలను దూరం చేసేందుకు మనీషా ఆడిన నాటకం ఫలించిందా..?

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode: అరవిందను అడ్డుపెట్టుకుని మిత్రాకు పిల్లలను దూరం చేసేందుకు మనీషా,దేవయాని వేసిన పాచిక పారిందా లేదా అన్నది నేటి ఏపిసోడ్‌లో తెలుస్తుంది..?

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode: అరవింద సహా కుటుంబ సభ్యులంతా తమవైపు రావడంతో మనీషా ఆనందానికి అవదులు ఉండవు. అత్త అరవింద తనను కోడలిగా అంగీకరించడం...లక్ష్మీని దూరం పెట్టడంతో మిత్రా సగం తనవాడైనట్లేనని భావిస్తుంది. ఇక  దేవయానితో కలిసి కొత్త ఎత్తులు వేస్తుంది.పిల్లలను మిత్రాకు దూరం చేయాలని పన్నాగాలు పన్నుతుంది. అక్కడికి అరవింద  రావడం చూసి వాళ్లిద్దరూ కలిసి కొత్త నాటకం ఆడతారు. ప్రశాంతంగా భర్త పక్కనే ఉంటే కడుపులో ఉన్న బిడ్డ హెల్తీగా ఉంటుందని డాక్టర్ సూచించారని...కానీ మిత్రా పక్కన ఉండటం తనకు ఎలా కుదురుతుందని దేవయాని అంటుంది. దీనికి సమాధానంగా  మనీషా కూడా  నాటకాన్నిరక్తికట్టిస్తుంది. పగలంతా  మిత్ర ఆఫీసు పనిలో ఉంటాడని...సాయంత్రం కాగానే పిల్లల దగ్గరికి చేరిపోతున్నాడని ఇక నా వద్ద ఉండే ఛాన్స్ ఎక్కడ ఉందని మనీషా శోకాలు పెడుతుంది.దీంతో అరవింద  ఈరోజు నుంచి పిల్లలు తన గదిలో ఉంటారని...నువ్వు మిత్రతో ఉండొచ్చని హామీ ఇస్తుంది.
 
             తమ పాచిక పారిందని దేవయాని,మనీషా ఎగిరిగంతులేస్తారు.ఈరోజునుంచి మిత్ర పక్కన లక్ష్మీ ఉండదని సంబరపడిపోతారు. అరవిందను అడ్డుపెట్టుకుని ఈ ఇంట్లో ఇకపై మనం ఏమైనా చేయొచ్చని ఆనందపడిపోతారు. ఇప్పుడు నీ లగేజీ మొత్తం మిత్ర గదికి షిప్ట్ చేద్దామంటూ దేవయాని మనీషాను తీసుకుని వెళ్తుంది.
 
                         లక్ష్మీ కాపురం రోజురోజుకు సుడిగుండాల్లో కూరుకుపోవడం చూసి జానూ బాధపడుతుంది. తొలుత నెగిటివ్ వచ్చిన ప్రెగ్నెన్సీ రిపోర్టు ఆ తర్వాత మారిపోవడం వెనక మనీషా హస్తం ఉందని జానూ, వివేక్ అనుమానిస్తారు. డయాగ్నస్టిక్‌ సెంటర్‌కు ఫోన్ చేసి బెదిరించి ఉంటుందని అనుమానించి వారు దేవయాని ఫోన్‌,మనీషా ఫోన్ చెక్‌చేయాలనుకుని  ఫోన్లకోసం వెతుకుతుంటారు.దేవయాని ఫోన్ దొరికినా....అది లాక్‌ చేసి ఉండటంతో  నిరాశ చెందుతారు. దేవయాని ఫోన్ లాక్‌ ఓపెన్ చేసి చూస్తారు. కాల్‌ లిస్ట్‌ చెక్‌ చేస్తుండగా...అప్పుడే అక్కడికి దేవయాని, మనీషా వస్తారు. వాళ్లను చూసి జానూ,వివేక్‌ కర్టెన్ చాటున దాక్కుంటారు. గదిలోకి వచ్చిన మనీషా,దేవయాని మాట్లాడుకునే మాటలన్నీ చాటుగా వింటారు. ఇంతలో ఫోన్‌ను చూసుకున్న దేవయాని....తన ఫోన్‌ ప్లేస్ మారడంతో అనుమానిస్తుంది.ఈ గదిలోకి ఎవరైనా వచ్చి వెళ్లి ఉంటారని అనుకుంటారు. వారు బయటకు వెళ్లిపోగానే....జానూ, వివేక్‌ అక్కడి నుంచి బయటపడతారు. పిల్లల విషయం వెంటనే లక్ష్మీకి చెప్పాలని అక్కడి నుంచి వెళ్లిపోతారు. తాము విన్న విషయాలన్నీ  వారు లక్ష్మీకి చెబుతారు. పిల్లలను  మిత్రాకు దూరం చేసేందుకు దేవయాని,మనీషా ఆడిన నాటకాన్ని వివరిస్తారు. అలాగే  ప్రెగ్నెన్సీ రిపోర్ట్ వచ్చిన సమయంలోనే  దేవయాని ఫోన్‌కు  గుర్తుతెలియని నెంబర్‌కు ఫోన్ చేసినట్లు చెబుతారు. దానికి లక్ష్మీ సమాధానమిస్తూ....మనీషా ప్రెగ్నెన్సీ రిపోర్ట్ పాజిటివ్‌ వచ్చినప్పుడే  వారు మేనేజ్ చేశారని అర్థమైందని అంటుంది. ఈ విషయాన్ని అరవిందకు చెబుతామని చెప్పగా...లక్ష్మీ వద్దని వారిస్తుంది.
 
                            ఇంతలో మిత్ర గదిలో వెళ్తున్న పిల్లలను అరవింద ఆపుతుంది. తనతోపాటు తన గదిలో పడుకోవాలని కోరుతుంది. నాకు మీతో ఉండాలని ఉందని చెప్పడంతో వారు సరేనని అరవింద గదికి వెళ్లిపోతారు. ఈలోగా మనీషా లక్ష్మీ దగ్గరకు వచ్చి జ్యూస్ కావాలని అడుగుతుంది.
తాను మిత్ర గదిలోకి వెళ్తున్నానంటూ లక్ష్మీని మనీషా రెచ్చగొడుతుంది. జ్యూస్ తీసుకుని మనీషా మిత్ర గదిలోకి వెళ్తుంది. దీంతో ఇవాల్టి ఏపిసోడ్ ముగిసిపోతుంది.
 
 
 

టాప్ హెడ్ లైన్స్

Objection My Lord Series OTT : లాయర్‌గా శ్రీకాంత్... ఓటీటీలోకి కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
లాయర్‌గా శ్రీకాంత్... ఓటీటీలోకి కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Allu Aravind : హీరోయిన్‌లా ఉన్నావ్... నెక్స్ట్ మూవీలో చేస్తావా? - యాంకర్‌కు అల్లు అరవింద్ క్రేజీ ఆఫర్... ఆమె ఎవరో తెలుసా?
హీరోయిన్‌లా ఉన్నావ్... నెక్స్ట్ మూవీలో చేస్తావా? - యాంకర్‌కు అల్లు అరవింద్ క్రేజీ ఆఫర్... ఆమె ఎవరో తెలుసా?
Salman Khan : బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
Naga Chaitanya Sobhita Dhulipala : చై.. నా శారీ ఎలా ఉంది? - శోభిత క్వశ్చన్‌కు చై క్యూట్ రియాక్షన్... లెనిన్ సక్సెస్‌పై వెరీ హ్యాపీ
చై.. నా శారీ ఎలా ఉంది? - శోభిత క్వశ్చన్‌కు చై క్యూట్ రియాక్షన్... లెనిన్ సక్సెస్‌పై వెరీ హ్యాపీ

వీడియోలు

Washington Sundar Ruled Out, Harsh Dubey In | మ్యాచ్ ముందే మారిన టీమిండియా స్క్వాడ్
Ashwin Comments On Hitman Retirement | రోహిత్ రిటైర్మెంట్ రూమర్స్ పై అశ్విన్ కామెంట్స్
FIFA's Shocking Decision For World Cup Final | ఫిఫాలో వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు బంగారు ఉంగరాలు
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
Kohli vs Gambhir Fight Rumors ODI | గంభీర్‌తో గొడవపడి కోహ్లీ హోటల్ వీడాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
UA Iran Conflict: ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
Hyderabad Crime News: పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
Tammineni Sitaram: నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
Messi VS Spain Strategy: మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పెయిన్!
మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పానిష్ టీమ్!
Salman Khan : బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
Asifabad News: భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
Normal Fever vs Dengue: ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
Embed widget