News
News
X

Chiranjeevi Europe Trip: ఫ్యామిలీతో విహార యాత్ర, హీరోయిన్‌తో వీరయ్య యాత్ర - చిరంజీవి ట్వీట్ వైరల్

చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ మూవీ సాంగ్స్ షూట్ కోసం యూరప్ కు వెళ్లారు. తనతో పాటు ఫ్యామిలీని కూడా తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఫ్యామిలీ ఫోటో, హీరోయిన్ తో దిగిన ఫోటోల సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

FOLLOW US: 
Share:

మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే ‘గాడ్ ఫాదర్’ సినిమాతో అలరించారు. ప్రస్తుతం ‘వాల్తేరు వీరయ్య’ సినిమా షూటింగ్ లో బిజీగా గడుపుతున్నారు. కేఎస్ రవీంద్ర  దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ సినిమాలో చిరు లుక్ చూసి సినీ లవర్స్ వారెవ్వా అంటున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ‘బాస్ వొచ్చిండు’ అనే పాటను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే చాలా వరకు సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన పాటలను షూట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే యూరప్ లో కొన్ని పాటలను ప్లాన్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా యూనిట్ యూరప్ కు వెళ్లింది.   

ఇటు ఇల్లాలు, అటు హీరోయిన్

సినిమా పాటల చిత్రీకరణ కోసం యూరప్ కు వెళ్లిన చిరంజీవి, తనతో పాటు భార్య సురేఖ, కూతురు, మనవరాళ్లను కూడా తీసుకెళ్లారు. మరోవైపు హీరోయిన్ శృతి హాసన్ కూడా సినిమా షూటింగ్ కోసం యూరప్ వెళ్లింది. ఈ సందర్భంగా ఇటు హీరోయిన్ తో తీసుకున్న ఫోటో, అటు ఫ్యామిలీతో తీసుకున్న ఫోటోలను చిరంజీవి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘ఫ్యామిలీతో అటు విహార యాత్ర.. హీరోయిన్‌తో ఇటు వీరయ్య యాత్ర’ అంటూ ఆకట్టుకునేలా క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నాయి.

‘వాల్తేర్ వీరయ్య’ సినిమాలో మాస్ మహరాజా రవితేజ ఈ సినిమాలో ముఖ్యమైన క్యారెక్టర్ చేస్తున్నాడు. ఇప్పటికే చిరంజీవితో కలిసి ఆయన ‘అన్నయ్య’ అనే సినిమాలో నటించాడు. ఇప్పుడు ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో ఫుల్ లెన్త్ క్యారెక్టర్ చేస్తున్నాడు. హీరోయిన్ కేథరీస్ థెస్రా,  బాబీ సింహా, వెన్నెల కిశోర్ సహా పలువురు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఊర్వశి రౌతేలా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తోంది. ఇక ఈ సినిమాకు కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ ప్లే అందించారు. ఆర్థర్ ఏ విల్సన్ సినిమాటోగ్రాఫర్‌ గా చేస్తున్నారు.

త్వరలో ‘భోళా శంకర్’ షురూ!

చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘వాల్తేరు వీరయ్య’ సినిమా తర్వాత.. మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళ శంకర్’ సినిమా చేయనున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ చిరంజీవి చెల్లి పాత్రలో నటించనుంది. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయి. అటు పూరి జగన్నాథ్ తాజాగా చిరంజీవికి ఓ స్టోరీ చెప్పారట. చాలా కాలంగా ఎదురు చూస్తున్న చిరు, పూరి కాంబోలోని మూవీ రాబోతుందని తెలియడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: అసభ్యకరంగా అక్కడ తాకాడు, పసుపు బట్టలంటేనే భయం పుడుతోంది: ఐశ్వర్య లక్ష్మి

Published at : 09 Dec 2022 12:34 PM (IST) Tags: Shruti Haasan Chiranjeevi Chiranjeevi Europe Trip Chiranjeevi family Waltair Veerayya shoot

సంబంధిత కథనాలు

Monica Barbaro: ‘RRR’ తెలుగులోనే చూస్తా - ‘నెట్‌ఫ్లిక్స్’కు ప్రముఖ హాలీవుడ్ నటి రిక్వెస్ట్, ‘ఎత్తర జెండా’కు ఫిదా!

Monica Barbaro: ‘RRR’ తెలుగులోనే చూస్తా - ‘నెట్‌ఫ్లిక్స్’కు ప్రముఖ హాలీవుడ్ నటి రిక్వెస్ట్, ‘ఎత్తర జెండా’కు ఫిదా!

Unstoppable 2 Finale Episode : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దెబ్బకు ఆహా ఓటీటీ పని చేస్తుందా?

Unstoppable 2 Finale Episode : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దెబ్బకు ఆహా ఓటీటీ పని చేస్తుందా?

‘దసరా’ సినిమా నిర్మాతకు ఊహించని నష్టాలు?

‘దసరా’ సినిమా నిర్మాతకు ఊహించని నష్టాలు?

Project K Movie: ‘బాహుబలి’ బాటలో ‘ప్రాజెక్ట్-K’, రెండు పార్టులుగా విడుదల కాబోతోందా?

Project K Movie: ‘బాహుబలి’ బాటలో ‘ప్రాజెక్ట్-K’, రెండు పార్టులుగా విడుదల కాబోతోందా?

Brahmamudi Serial February 2nd: స్వప్న బుట్టలో పడిపోయిన రాజ్- కనకం గుట్టు తెలుసుకున్న రుద్రాణి

Brahmamudi Serial February 2nd: స్వప్న బుట్టలో పడిపోయిన రాజ్- కనకం గుట్టు తెలుసుకున్న రుద్రాణి

టాప్ స్టోరీస్

Hyderabad Traffic: బడ్జెట్ సమావేశాల ఎఫెక్ట్ - అసెంబ్లీ పరిధిలో ట్రాఫిక్ మళ్లింపులు

Hyderabad Traffic: బడ్జెట్ సమావేశాల ఎఫెక్ట్ - అసెంబ్లీ పరిధిలో ట్రాఫిక్ మళ్లింపులు

Budget 2023: ఇన్‌కం టాక్స్‌లో మోదీ సర్కార్‌ అతిపెద్ద కనికట్టు ఇదే - మీకు లాభమో, నష్టమో ఇలా తెలుసుకోండి!

Budget 2023: ఇన్‌కం టాక్స్‌లో మోదీ సర్కార్‌ అతిపెద్ద కనికట్టు ఇదే - మీకు లాభమో, నష్టమో ఇలా తెలుసుకోండి!

Vande Bharat Metro: త్వరలోనే వందేభారత్ మెట్రో రైళ్లు,కీలక నగరాల్లో సర్వీస్‌లు - రైల్వే మంత్రి ప్రకటన

Vande Bharat Metro: త్వరలోనే వందేభారత్ మెట్రో రైళ్లు,కీలక నగరాల్లో సర్వీస్‌లు - రైల్వే మంత్రి ప్రకటన

Suspicious Drone in Srikakulam : భావనపాడు తీరంలో మత్య్సకారులకు దొరికిన డ్రోన్ | DNN | ABP Desam

Suspicious Drone in Srikakulam : భావనపాడు తీరంలో మత్య్సకారులకు దొరికిన డ్రోన్ | DNN | ABP Desam