అన్వేషించండి

వీజే సన్నీ దొంగతనం చేశాడా? బ్యాగ్ నిండా డబ్బులతో సీసీటీవీ కెమేరాకు చిక్కిన వైనం

‘బిగ్ బాస్’ విన్నర్ వీజే సన్నీ దొంగతనం చేస్తూ సీసీటీవీ కెమేరాకు చిక్కాడంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో ఇప్పుడు ఓ వీడియో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. అందులో ఉన్న వ్యక్తి వీజే సన్నీలాగే ఉన్నాడు. ఓ బిల్డింగ్ నుంచి ఓ మూటతో కంగారుగా బయటకు పరుగులు పెట్టడం సీసీటీవీ కెమేరాకు చిక్కింది. ఆ కంగారులో అతడు మూటను జార విడిచాడు. దీంతో అందులోని డబ్బుల కట్టలు కిందపడ్డాయి. వెంటనే వాటిని మళ్లీ మూటలో పెట్టుకుని కారులో ఉడాయించాడు. ఈ సీసీటీవీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. ఆ వీడియో జనవరి 2వ తేదీన రికార్డైనట్లు ఉంది. నిజంగా వీజే సన్నీ దొంగతనం చేశాడా? లేకపోతే అంతా డ్రామా అని నెటిజనులు తల గోక్కుంటున్నారు. తప్పకుండా ఇది ఇదేదో సినిమా లేదా వెబ్ సరీస్ కోసం చేస్తున్న స్టంట్ అయ్యి ఉంటుందని, ఒక వేళ నిజంగానే వీజే సన్నీ దొంగతనం చేసి ఉంటే పోలీస్ స్టేషన్‌లో కేసయ్యేదని అంటున్నారు. ఔను, వారి అంచనా కూడా కరెక్టే. ఎందుకంటే.. వీజే సన్నీ నటిస్తున్న వెబ్ సీరిస్ కూడా దొంగతనానికి సంబంధించినదే. 

‘ఏటీఎం’ వెబ్ సీరిస్ గురించేనా ఇదంతా?

ప్రస్తుతం వీజే సన్నీ.. ‘ATM’ అనే వెబ్ సీరిస్‌లో నటిస్తున్నాడు. దిల్ రాజు బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్సిత రెడ్డి నిర్మిస్తున్న ఈ వెబ్ సీరిస్‌కు సి.చంద్రమోణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే ఆ సీరిస్‌కు హైప్ తీసుకొచ్చేందుకు ఈ సీసీటీవీ వీడియోను సోషల్ మీడియాలో వదిలి ఉంటారనే సందేహాలు నెలకొంటున్నాయి. వీడియో చూసేవారికి కూడా అది స్పష్టంగా అర్థమవుతుంది. దీంతో నెటిజనులు ‘‘మీరు మమ్మల్ని మోసం చేయలేరు’’ అని అంటున్నారు. మరికొందరు ఫన్నీగా ట్రోల్ చేస్తున్నారు. మాతో ప్రాంక్‌లు వద్దు బ్రో అని కామెంట్లు చేస్తున్నారు. 

‘బిగ్ బాస్’తో విజయం - అవకాశాలం కోసం పాట్లు

‘బిగ్ బాస్’ సీజన్-5తో విజేతగా నిలిచిన సన్నీ.. రంగుల ప్రపంచంలో అవకాశాల కోసం చేయని ప్రయత్నాలంటూ లేవు. ఓ సందర్భంలో అతడే స్వయంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. బిగ్ బాస్ వల్ల తనకు ఒరిగిందేమీ లేదని, ‘బిగ్ బాస్’ విజేతగా నిలిచినా కెరీర్‌కు అది ప్లస్ కాలేదని ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యనించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే, ‘బిగ్ బాస్’ సీజన్-6కు గెస్టుగా వచ్చినప్పుడు మాత్రం ఆ షోను ఆకాశాన్న ఎత్తేశాడు. 

సన్నీ నేపథ్యం ఇది

1989 ఆగష్టు 17న ఖమ్మంలో జన్మించిన వీజే సన్నీ అసలు పేరు అరుణ్ రెడ్డి. సన్నీ ఇంటర్ వరకు ఖమ్మంలోనే చదువుకున్నాడు. ఆ తర్వాత హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో బీకామ్ పూర్తి చేశాడు. చిన్నప్పటి నుంచి సన్నీకి నటనపై ఆసక్తి ఎక్కువ. దీంతో సన్నీకి తన తల్లి కళావతి కూడా సపోర్ట్ చేసింది. ఓ టీవీ ఛానెల్‌లో ‘జస్ట్ ఫర్ మెన్’ అనే షోకు యాంకర్‌గా బుల్లితెర ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. ఆ తరువాత న్యూస్ ఛానెల్‌లో రిపోర్టర్‌గా కూడా పనిచేశాడు. అనంతరం ‘కళ్యాణ వైభోగం’ అనే  సీరియల్‌లో జయసూర్య అనే పాత్రలో సన్నీ నటించాడు. త్వరలోనే సన్నీ హీరోగా ‘అన్‌స్టాపబుల్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 

Read Also: సమ్మర్‌లో శర్వానంద్ షాదీ! వధువు ఎవరో తెలుసా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
China Corruption mayor: చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
Vaammo Vaayyo Song Lyrics : ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్

వీడియోలు

పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
China Corruption mayor: చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
Vaammo Vaayyo Song Lyrics : ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
Venezuela : వెనిజులా రాజధాని కారకాస్‌పై క్షిపణి దాడి! పలు చోట్ల విధ్వంసం!
వెనిజులా రాజధాని కారకాస్‌పై క్షిపణి దాడి! పలు చోట్ల విధ్వంసం!
Maoist Latest News: ఆపరేషన్ కగార్ తరువాత దేశంలో అతిపెద్ద లొంగుబాటు! డీజీపీ వద్దకు మావోయిస్టు కీలకనేత బరిసెదేవా దళం!
ఆపరేషన్ కగార్ తరువాత దేశంలో అతిపెద్ద లొంగుబాటు! డీజీపీ వద్దకు మావోయిస్టు కీలకనేత బరిసెదేవా దళం!
Hyundai Creta నుంచి Tata Sierra వరకు - కొత్త Seltos ముందు బలంగా నిలబడే కారు ఏది?
కొత్త Kia Seltos - ధర, స్పెసిఫికేషన్లలో ఇతర కార్ల కంటే బెటర్‌గా ఉందా?
Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
Embed widget